Thursday, March 19, 2015

రివ్వున జీవని


మరిక నేను 
జీవితాన్ని సహచసరిస్తూ 
వసించి కదలుతాను
ప్రతి కలతను 
ధూమంలో 
ఎగరేస్తూ పాదం కదిపాను

వైకల్యంపై వ్యధ వ్యర్థం
వికలాన్నే సంబరిస్తూ 
నే
చనీ 
పోతున్నాను
ప్రతి కలతను ధూమంలో 
చెలరేగీ
అడుగుమడుగు కదిలాను

దక్కిందే తలరాతగా తలచాను
దక్కనిదిక  
మదిన తుడిచేస్తూ 
నే  
మరీ కదిలాను
ప్రతి కలతను ధూమంలో 
చిగురేస్తూ 
అంకురించాను 
ఏ తలాన  
సుఖ దు:ఖాల 
ఎడం ఎరుకకు  రాదో
ఆ మజీలీకి
నా మదిని జతచేర్చాను
ప్రతి కలతను ధూమంలో 
రివ్వుమని రేగి పొమ్మన్నాను
నేనే


.............................................................................
(మై జిందగీ కా సాథ్ నిభాతా చలా.... కు ఇలా నా తెలుగు)

No comments: