Saturday, November 29, 2014

చుంబన బింబం

బింబాన్నీ
నిజం చేయ జూసే
నీ ఐంద్రజాలిక మెలకువకువలకు
జోహార్లు

బింబ అధరాలనూ
సవాస్తవంగా నిలిపే
నిలువె త్తు
తహతహ నీదే

అణువణువునా
నినూ
నీ తపననూ
నీ తరగనూ
నీ హొయలునూ
నీ నును పదును చాతుర్యాన్నీ
ముద్దాడనా

ఇంతకూ
నా ముద్దు
చేరేదీ
చెందేదీ
నీకా
నీ బింబానికా
నీ చషకానికా
నీ అధివాస్థవిక వాసానికా
పొందిక సౌందర్యానికా
చిత్రిక సలిపిన
నీ చాకచక్యానికా


పోనీ
అందిందా
లేదా నా ముద్దు నీకూ


(మంత్ర వాస్తవిక కళాకారుడు ఆంజనేయులుకు )


Sunday, November 23, 2014

They say


When your are a child
or...
When you grow old
You are weak

#
Am neither weak nor old
Still
A child
grown
too bold.
 

కూన కలాపంనిండా రెండూ నిండని కూన
నిండు బుట్ట తెచ్చింది 
పండు సపోటాలతో 
ప్రయాసపడి 
ఒక్కొక్కటే 
చిట్టి చేతులతో 
నేర్పుగా వడిసి పట్టుకుని 
పండు పండూ బుట్ట దించింది 

ఆరు నిమిషాల్లో 
ఖాళీ చేసింది బుట్టని 

సపోటాల చో ట 
కేరింతిలు 
బుట్ట నిండుగా 

Thursday, November 13, 2014

పూమాల

అవును
నీకొక పుష్పాన్ని ఇద్దామనుకున్నాను
నీకై పూల మాల
కానుక నేనవుదామనుకున్నాను

మెరుపుల నీ పై పెదవి వంకీ వసారాలో
నా దోసిలి నిండా
అరవిరిసిన అనామిక మొగ్గల కదంబమాలను
నీ అనునాసిక ఆఘ్రాణానికి
ధఖలు పరుద్దామనుకున్నాను
మలి జామున
గుప్పెడు పూమాలలా వికసించేద్దామనుకుని
నాకు నేను... నీకై నేను.

అవును
పూలిస్తాను నీకోసం పూచి ప్రతి పూటకూ
కనీసం రుతువుకు చెప్పకుండా
పాలిస్తాను నీ దేహం దోచి ప్రతి తోటనూ
వనాంతం లత నొచ్చుకోకుండా

లెక్కకు సరి పోలని 
నీ ఇరు కనుపాపలు
వాల్చిన రెప్పలపై 
కొండ నాగమల్లిని రచిస్తాను 
నా ముకుపుటాలతో

తడారని నీ గింగిరాల
జలతారు ప్రతి వంకీలో
సన్నజాజి అద్దుతాను
ప్రణయ జ్వాలాముఖినై
సిగ దిద్దుతాను
ముడి వేయని
నీ కేశ ఆసాంతం బొండుమల్లి మాల పరుస్తాను
ముూడు మూరలై కొలుస్తాను
ముప్పేట మురుస్తాను
ముచ్చటగా తరిస్తాను

వేసవి సాయాన
నీ జడపాయలు
నా మునివేళ్ళతో
మునిలా జత చేస్తాను
జత జడ అల్లుతాను
ఎడమ జడ అంచె అంచెన
తీగ వెలిగే కాగడా మల్లిని అమరుస్తాను
కుడి జడ నిచ్చెనలో
అంటుకట్టిన సెంటు మల్లినై మెరుస్తాను
వ్యాసాన కనకాంబరాల ఆవిరి పచ్చబొట్లు
నా అధరాగ్రాన పొడిపించి
గోంగూర పువ్వు తలపించే నీ నాభిని సూర్యకాంతని చేస్తాను
ప్రతి రెక్కలకొన
నా వ్యామోహ చాంచల్యాన్ని కమలినిగా ఆవిష్కరిస్తాను
నీ నడుంపై శెనగ పూల మాలను పోలిన ఆదిమ నిప్పు పుట్టిస్తాను
విప్ప పూయిస్తాను
డప్పుల జత రాజేస్తాను
తుడుం మోగిస్తాను
వృక్షవంశం వశం తప్పి వివశులమై వాలే జామున
పరవశ పారిజాతవనం నాటుతాను
కుహరాన
.......
14నవంబరు14, మణికొండ

Tuesday, November 11, 2014

బావోన్మెత్తఒక కవితోన్మత్త
ఉమ్మెత్త పువ్వు
విరగబూసిన రోజు ఇదే.


o

సదా ఆ పసిడి రెక్కలు సతత శతపత్రాలై కొలనుకు సొబగును దరిచేర్చిన రోజు ఇదే.

0

శిశిరంలోనూ చిగురును చవిచూపిన ఒక ఆకు పచ్చని లోయని లోకం సందర్శించిన రోజూ ఇదే.

o

నా నవ యవ్వన వినీల గగనాన నినాదమై మెరిసిన బంధన ఛాయ నే చవిచూసినదీ ఈ రోజే.

o

నా జీవన మలి సంధ్యలోనూ ప్రభాతాన్ని ప్రతి తలంపులో ప్రతి పలకరింపులో ప్రతి కలయికలో సుపరిచితం చేసే భరోసా పుట్టిన రోజు ఇదే కదా.


--------------------------------------oooooooooooooooooooooooooo---------------------------------------------------
( నా 
పురా 
పురుష ప్రియురాలు
నామాడి శ్రీధర్ గాడికి 
9 నవంబర్ 2014న పుట్టినందుకు.)