Thursday, March 19, 2015

సెరెండిపిటి


నేను సిద్ధమయ్యే సరికి ముగిసింది యుద్ధం
విఫలం అనుకున్నప్పుడు తట్టింది విజయం

నా అన్న వారు వెన్నంటి వుంటారు
అనుకున్న తక్షణం నా వెంట లేరెవరు

కన్నీటి వాగు ఎండిపోతున్నప్పుడు
వెక్కి ఏడ్చేందుకు 
తూలి వాల్చేందుకు 
విన్నాను ఓ తెలియని భుజం చప్పుడు

అణువణువూ ద్వేషించాలనుకున్నప్పుడు
వినవచ్చింది ఒక నిజ లయ గుప్పెడు

వెలుగు రేఖ కోసం వేచి చూసినప్పుడు
చూస్తూ చూస్తూ రెప్ప వాల్చినప్పుడూ
అరుణ కాంతి కిరణ తోరణం నా ఆవరణం

అదే కదా జీవితం
అలా కదా జీవనం

రేపటికి నువ్వు సిద్ధం 
నీకు రేపు వుంచిందే నిక్షిప్తం 
నేటికి నీకూ తెలియదు
రేపటికి నిన్నా తెలీదు

విజయంతో నీవు లోకానికి పరిచయం
అపజయంలో నీకు లోకం పరిచితం

కానీయి సదా సంతసమే నీ సంతానం

తుది మరపూ కారాదు 
మెరుపు మురుగూ కాలేదు

అంచు ఇంచు
కొంగు పొంగు 

నేల అడుగు
నింగి తొడుగు

కానీయి సదా వసంతమే నీ సంతకం
..........................................

No comments: