Friday, December 10, 2010

పునరపిఒక్కటీ
శిరసావహించదు
అన్నింటా
విరామమెరుగని
ఉరకలూ...గలగలలూ
శకలం
మరో శకలం
అంటు కడతాయి
చిగురు తొడిగి
వడివడిగా
నిటారుగా
తలెత్తినవన్నీ
అప్పటివరకూ
అపరిచితలు

పురుడుపోసుకున్న తర్వాతే కదా
నామకరణం

మళ్ళీ అవన్నీ
వెలిగి వంగి కుంగి జరిగి
లీనమైన తక్షణం
అపరిచితలే మళ్ళీ
#
అణువణువూ
అగ్నికీలల రేణువు
నింపాదిగా ఒకసారి
మరోసారి దూకుడుగా
పడిలేచి పాడే వేణువు
#
సూర్య గోళాలను చూస్తాను
తనాలనే తలకెత్తుకునే
తలాలనే వీక్షిస్తాను నేను
అయినా
తనాలూ
తలాలూ
వాటి మండే గోళాలూ
నిర్మలంగా లీనమవ్వాల్సిందే
తలతనపురాచేలాన్చల చంచలత్వంలోకి
అనంతం లోనికి
#
తల్లీ నేలమ్మా
సాగరాలు... తీరాలూ
నీ సామ్రాజ్యాలు
ఊర్లు పైర్లు ఏర్లు మైదానాలూ
నీ ఆనవాళ్ళు
నీ దిక్కులు.. నీ రుక్కులు
నీ తారాతీరాలు
నీ పాలపుంతలూ
నీ సకలం
నీ శకలం
పురుడుపోసుకున్నది
పుంతల
పులకింతనాలలోనే
ఇల
నీ లీల
నిర్నిమేష హేల
ఇలా ఇదంతా
#
ఏదీ లొంగదు
పైగా శిరసావహించదు
తెలిమంచుతెర రేఖలు కమ్మేసే
కడలి కెరటాల ఆరాటాలూ
పారే వెన్నెల మాటున
గులకల ఇసుకల మైదానాల
చీకటి చిరునామాలూ
అలల్లో
సైకతలాల్లో
వాటి మర్మ జన్మస్థానాల్లో
తరగ నురగ
వెలుతురు కొడవలితో
గిరిగీసేసుకుపోతుంది

మరో
అఖాతం
రెప్ప విచ్చుకుంటుంది
-----
డిసెంబర్ 9

(చావు పుటుకల పైన lukreetius)