Sunday, October 24, 2010

కాస్తవీస్తాను.. ఇంకాస్త
కురుస్తాను

వీలు
కాకున్నా పూస్తాను
కాలినిస్తాను
కాలనిస్తాను
పోడు
చేస్తాను
నింగిలో
మోపనిస్తాను
చితిలో
పొడిపిస్తాను
భస్మంలో
బదనిక బతుకు
అయినా

గాలి గానుగలా
వీస్తాను
విత్తునూ
మోస్తాను
చిటారులో
విరుస్తాను
ఋతువులో

చనువుగా
కాస్తాను
కాయలా

రెమ్మలు
వదిలిన
కొమ్మల్ల్లో పండునై
కవ్విస్తాను

కోసుకునే
పరువాన్నిస్తాను
మాగి
రాలి వేచి మళ్ళీ
మొలుస్తాను
మారుక్షణం

---
అక్టోబర్