Sunday, March 27, 2011

లోయ గాలి పాత జీవితం

అన్నీవెంటాడుతూనే వుంటాయి

కాలం కామం కాకుండా పోయిన పుప్పొడీ

చైతన్యం

చొచ్చుకువచ్చిన పారదర్సకతా

తనను తానూ తన్మయంగా చూస్తూ కబోది ఐన చూపూ

వసంతం

పరదాలు

పదాలు

పడిగాపులూ

బూడిద రంగు చేతొడుగులూ

మరకలు

గరికపైన కుప్ప కూలిన మనో ధూళి

భస్మం రాల్చిన పరిచయాలూ

నీ నా మధ్య ఎగసిపడిన కీర్ర్తి కెరటాలూ కిరీటాలూ

చితికిన దృశ్యాల జనాయసయపు కల

జ్వర రాత్రుల పీడ కల

జోస్యపు నురగ

గాలి కతల నేతగాళ్ళ కంఠోపాఠాలూ

కాలి పేరుకు పోయిన కరపత్రాలూ

వెలిసి పేలికలైన ముదురు ఎరుపెరుపు జెండాలూ

చెల్లా చెదురైన సముద్రాలూ

గోడల వెల్ల వెనుక మరుగైన నినాదాలూ

కోరలూ గోర్లూ మొలిచిన బంధాలూ

మాసిన ఊసులూ మాయమైన పాద గురుతులూ

చితికిన మాటలూ

చితికి ఎక్కని స్పర్సాలూ

ఉరీ ఉచ్చూ కంచే హద్దూ పద్దూ గానుగెద్దు పరిభ్రమణాలూ భ్రమణాలూ

అకసేరుకాలూ నత్తలూ గుల్లాలూ

మచ్చిక కాని పెంపుడు కుక్కల్లాంటి పేర్చిన పుస్తకాలూ

మానని గాయాల్లాంటి పేలని యవ్వనలూ

అన్నింటికీ మించి

కుదురెరిగిన బతుకూ

దాని సాకులూ

సంజాయిషీలూ

వెంటాడుతూనే వున్నాయి

(సెప్టెంబర్, పన్నెండు, పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది- vaartha, srushti )
































Friday, March 25, 2011

ఒక్ఖన్నే

దుఃఖం లో
దుర్మార్గంతో
దూరంగా

ఒక్ఖన్నే

చీకటిలో
చింతల్తో
శబ్దంలా

ఒక్ఖన్నే


దప్పికలో
ఆకలితో
ఒంటరిగా

ఒక్ఖన్నే

మొహాల్లో
మొహమాటాల్తో
రద్దీగా

ఒక్ఖన్నే

లోయల్లో
లోతుల్తో
కేకల్లా

ఒక్ఖన్నే

చితుల్లో
మత్తుల్లో
గమ్మత్తై

ఒక్ఖన్నే

కాలంతో
కామాల్లో
మొండిగా

ఒక్ఖన్నే

రాగాల్లో
గారంగా
పగిలినా

ఒక్ఖన్నే

కంచల్లో
వంచనతో
భయంగా

ఒక్ఖన్నే

దారాల్లో
దారులతో
తప్పినా

ఒక్ఖన్నే

రాళ్ళలో
ప్రియురాల్లతో
రంజుగా

ఒక్ఖన్నే

దిగులుగా
పగిలినా
పలుగుతో

ఒక్ఖన్నే

భద్రాల్లో
భస్మాల్తో
బల్లెంలా

ఒక్ఖన్నే

కూడలిలో
కూటమితో
శిథిలంలా

ఒక్ఖన్నే

గురుతుల్లో
గాయాలతో
కస్కసిగా

ఒక్ఖన్నే

మాటలలో
బాకుల్తో
మవునంగా

ఒక్ఖన్నే

చరితల్లో
చిగురలతో
దర్జాగా

ఒక్ఖన్నే

స్నేహాల్లో
హేయాల్తో
మచ్చికగా

ఒక్ఖన్నే

ఒలికినా
ఒరిగినా
లేచినా
ఓడినా

ఒక్ఖన్నే

ఒక్ఖన్నే

ఒక్ఖన్నే


(-జూలై-ఇరవై ఒకటి - రెండు వేలా మూడు)




శ్యూన్య తేకే శురూ

ఎక్కడ్నుంచి వచ్చామో
తిరిగీ నలిగీ అక్కడికే చేరడం
ఎప్పటికప్పుడు
మళ్ళీ మొదలవడం
@
నాలుగ్గువ్వలు వుండేవీ
నగరంలో
తలో చెట్టును వదిలి
నదినీ తల్లినీ
ప్రేయసినీ
#
తడిసిన రెక్కలతో
తటపటాయింపులు లేని
పటాపంచల పాటలు పాడాలనుకున్నాయి
$
పరధ్యానంలోనే గడిచింది జీవితం
అపర పరాజితై కూలుతోన్న కాలంలో
&
పరాధీనమైన దైనందినం
అన్యాకాంతమైపోయిన జాగా
%
దేనిపైనా పిర్యాది లేకపోవడం దుర్మార్గం
!
ఒక సంభాషణా
ఒక సాయంత్రమూ లేక
తెగిన తీగల దగ్గిర
ప్రసారం కోసం పడిగాపులు కాచీ
చని
పోయిన
ఆ గువ్వల
సమాధుల పైన
పరకల మధ్యా

" వచ్చి వెళ్ళిన వారు
అసలు రానట్టే
మరెవల్లూ పూడ్చలేని ఖాళీ
గుండెల్లో గుచ్చి వెళ్లక పోతే "

ఎక్కడ్నించి వచ్చామో
తిరిగీ నలిగీ అక్కడి నుంచే
మొదలవడం

పశ్చాత్తాపమా

ప్రాయహ్చిత్తమా

(ఏడు మే తొంభై తొమ్మిది)

పుట్టిన రోజే

కొందరు గుచ్చాలనిచ్చారు
పూలకు మారుగా
నినాదాలు పేర్చి

మరికొందరు
కాసిన్ని మెట్లూ

ఖాళీ చేతులూ
ఖాళీ నవ్వులూ
చూపించలేని
అత్యంత ఆప్తులు
ఇంకొందరు
గయరు హాజరైనారు

నన్ను మీటని
గీతాలాపనల హోరు మధ్య
చూడండి
ఇంకొందరెలా
నిశ్సబ్దంగా
నీడల్ని
నాటి
వెల్లిపోతున్నారో

-పంతొమ్మిది మే ౧౯౯౭

Wednesday, March 23, 2011

aphorisms

స్త్రీలు
రెండు కోవలు.
ప్రియు రాళ్ళూ
రప్పలూ

సిగరెట్
భస్మమై
కాలి రాలిన కాలపు
మారు మిత్రుడు
మిత్రుడికి మారు
పూలు

కోయనూ లేను
ఏరనూ లేను
చీకటి
అలసిన జాబిలి
అనుమతితో
చేరగిలడం

Tuesday, March 22, 2011

మరిజా మెవ్ ఫాదూ


ఇప్పుడు పోర్చుగీసు లో (అంటే మన బుడత కీచు అన్న మాట) ఫాదూ సంప్రదాయం లో పాటల నిప్పులు చెరుగుతున్న రవ్వ పేరే మరిజా. ఫాదూ సంప్రదాయంమన గజల్ సంప్రదాయానికి చాలా దగ్గరగా వుంటుంది. గజల్ మాదిరిగానే ఫాదూ లో కూడా ఒక అంతర్లీనమైన దుఖపుజీర ప్రాణ వాయువై పారుతుంది. ఫాదూ సంప్రదాయం లో పాడే వాళ్ళను ఫాదిస్తా అంటారు. నా మనసు దోచిన ఫాదిస్తా పేరే మారిస్సా లేదా మరిజా. వీలయితే విని పరవసించండి. అర్థం కాకున్నా పంబ రేగుతుంది.
కింద వున్న నేగ్రో పాట మరిజా వాళ్ళ నానమ్మ కోసం రాసి పాడింది.


barca negro
São loucas! são loucas! loucas...Eu sei, meu amor,Que nem chegaste a partirPois tudo em meu redorMe diz que estás sempre comigoEu sei, meu amor,Que nem chegaste a partirPois tudo em meu redorMe diz que estás sempre comigoDe manhã, que medo, que me achasses feia!Acordei, tremendo, deitada na areiaMas logo os teus olhos disseram que não,E o sol penetrou no meu coraçãoMas logo os teus olhos disseram que não,E o sol penetrou no meu coraçãoVi depois, numa rocha, uma cruz,E o teu barco negro dançava na luzVi teu braço acenando, entre as velas já soltasDizem as velhas da praia que não voltas:São loucas! loucas...Eu sei, meu amor,.... .... ....No vento que lança areia nos vidros;Na água que canta, no fogo mortiço;No calor do leito, nos bancos vazios;Dentro do meu peito, estás sempre comigoNo calor do leito, nos bancos vazios;Dentro do meu peito, estás sempre comigo( solo )Eu sei, meu amor,.... .... ....

Friday, March 18, 2011

కబీరు పదాలు

మాను

కొమ్మ చివర
మునికాళ్ళలో స్వరం నింపి
ఆకుతో ముచ్చటించింది
మాను
ఇలా

పత్రమా!
విను నా మాటల శాఖను

చిగురు నవ్వు
పూలు రాలు
మాను మేని రీతి ఇదే
#

అహం

పొగరు రాలితే
చిగురు

రగిలే ఎద నది
ఎండితే
సత్య ప్రవాహం
#
అనంతం

ధనం
యవ్వనం
వచ్చి ఖర్చు అవుతాయంతే

...
మంది మంచి
నీ విడిది ఐతే
అనంతం
నీ
సంతకం
#
గమనం

ఇహం సుఖం
మది యోగం
లోక రీతి
కాల గమనం

నోటికి చేరేది కొంత
పంటికింద రాయి
కొండంత
#

బడాయి


పెదవి వెడల్పూ
నాలుక పొడవూ
శ్వాస లోతూ
అంతా అహంకారం

బడాయి రద్దు

వజ్రానికి సాన పట్తేన్తవరకూ
ఓర్పే

మెరుపు తురుపు
#
బోధి

పండితుడికి
కబీర్
ఏం నేర్పగలడు?

కబోది
ముందు
బోధి నృత్యం
#
అహం

అహం మాను
తేనె పలుకు

హృదిలో మిత్రుడు
మదిలో శత్రువు
మను
కాను
మాను
కానీ
మనమే కదా
#
ఓర్పు

నేలన పార
చెట్టున కొడవలి
పార, కొడవలి కలిసి
గొడ్డలి విసిరినా
నేర్వాలి
నెల నుంచి ఓర్పు
చెట్టు నుంచి ఓదార్పు
#
నది

మది శుప్త నది
సప్త పది
మది
నిరంతర చిరంతన

మది లిహం

రెక్కలల్లర్చినా
వివర్ణం కారాదు
జీవితం
#