మౌనాలు రవాలు
వినేందుకు వస్తావా
నీ స్పర్శతో విరబూస్తాయోమో
ఆహ్వానించవా నీ ఇంటికి
మాటలాడేందుకు పరితపిస్తున్నాయి
చెప్పనియ్యవా వాటినీ
మౌనాలు నీవీ... నావీ...
పెనవేసుకున్న మన మౌనాలు
యుగాలుగా ఎవరూ చనని
ఆ వీధిలో నడిచావా ఎపుడైనా
నా త్రికాల లోలకం నిలిచిపోయింది అక్కడే
నా లోన నే లోనయినవన్నీ నీతో నే చెప్పనా
మౌనాలు సంగీత వాద్యాలు
కాస్త నాదం నువ్వే తేవా
మౌనాలు పదాలు
నీ పెదాలు దాటనీయవా
నది నీటి నడకా మౌనమే ఇక్కడ
విరిసిన జాబిలిలో దాగాయి కోటి మౌనాలు
వాన చుక్కకు నాలుక వుందా
రగిలో గుండెల్లోనూ రేగే ధూమాలు మౌనాలు
మౌనాలు ఆకాశాలు
కాస్త విహరించేందుకు రారాదూ
మౌనాలు అనుభవాలు
ఆ అనుభూతి చెందిందా నీకు
మౌనాలు నీవీ... నావీ...
పెనవేసుకున్న మన మౌనాలు
మాటలాడేందుకు పరితపిస్తున్నాయి
చెప్పనియ్యవా వాటినీ
..........................................................................
ఖామోషియా హిందీ సినీ గీతానికి తెలుగు
No comments:
Post a Comment