Thursday, March 19, 2015

తుదకు

యిప్పుడిక
యేమీ చెప్పాలని లేదు
నాకు
అంతకన్నా
వొక బలమైన
నిజమైన
గొంతును వినాలని వుంది
అసలు
అలాంటిదంటూ వొకటి వుంటే
#
నే మాట్లాడిన ప్రతి మాటా
నా అంతరాత్మను వెతుకులాడుతూన్నప్పుడు
నేను యిచ్చే ప్రతి సంజాయిషీ
వోడి తిరిగి రాకముందే
మనమంతా
మరణమని
పిలుస్తామే
ఆ అనంత నిశ్శబ్దంలోకి
లీనమవ్వాలని వుంది
#
‘‘అతను చనిపోయే ముందు
ఏదో చెప్ప బోయాడు.
కానీ వినేందుకే
అతని చెంత
యెవ్వరూ లేర’’నిపించుకోవడం కన్నా
‘‘ అతను యేమీ
చెప్పకుండానే
కన్నుమూసాడ’’నిపించుకోవటంలో
యెంతో
తృప్తి
గర్వం
వుంటుంది.
...................................
సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా
హిందీ : అంత్ మే

తెలుగు : అనంతు

No comments: