Tuesday, October 11, 2011

అరిగిలి దుఃఖం



మే నెలలో
ఓ వెన్నల రాత్రి
తీరం వెంట నడక
వెండి రంగులో గడ్డీ, పూలూ
అయినా ఆకు పచ్చని వాసనే
*
కారు చీకటి రాత్రి
కొండవాలుకు మారింది
కాలినడక
జాబిలిని చూపుతున్నట్టు
తెల్లని రాళ్ళు
*
ఆ వ్వవధిది
కొద్ది క్షణాల దూరం
58 సంవత్సరాల విశాలం
*
నా వెనుక
అలలపై
పసి కిరణాలకు అటు
ఆవలి తీరం
అక్కడే పాలకులు
*
అక్కడే
ముఖాలకు బదులు
భవిత వున్న జనం
-

స్వీడిష్ - టోమస్ ట్రాన్స్ ట్రోమర్
(2011 నోబుల్ సాహిత్య విజేత)
ఇంగ్లీష్ అనువాదం - మైఖేల్ మెక్

(గొండోలా అంటే చేత్తో చేసుకునే అరిగిలి లేదా తెప్ప. వెనిస్ నగరంలో తొమ్మిది వేర్వేరు కలపలతో గొండోలాను చేసుకుంటారు.వివాహం, అంత్య క్రియలకు గొండోలాను వాడతారు.

2 comments:

ఎం. ఎస్. నాయుడు said...

Hi. good one. you could have added the english translation too.

Anonymous said...

the english version
-----------------------
Selections from The Sorrow Gondola
A Page from the Nightbook
-----------------------------------
One night in May I stepped ashore
through a cool moonlight
where the grass and flowers were grey
but smelled green.

I drifted the hillside
in the colorblind night
while white stones
signaled to the moon.

In a period
a few minutes long
and fifty-eight years wide.

And behind me
beyond the lad-shimmering water
lay the other shore
and those who ruled.

People with a future
instead of faces.

-----------------------------------
—Translated from the Swedish by Michael McGriff
-------------------------------