Tuesday, October 25, 2011

చెదిరిన కూటమి



మేం తయ్యారు
మాకు ఇల్లేదో చూపించారు
అతిథి అనుకున్నాడు:
చల్లగా వుండాలి

నీ లోన మురికి వాడలేవో
@
చర్చి లోపల
వికల విశ్వాస బాహువు చుట్టూ రజనులా
పాల తెలుపులో
స్తంభాలూ
విలువంపులో కట్టిన సరంబి
@
చర్చి లోపల
భిక్ష పాత్ర వొకటి
నేల నుంచి అమాంతం లేచి
బల్ల ముందు తేలియాడుతుంది
@
అయితే చర్చి గంటలే
నేల మాళిగలో
పీతి నాళికల్లో

ఎపుడేం చెయ్యాలనుకున్నా
ఖంగ్ మంటాయి
@
నిద్రలో నడిచే
నికోడిమస్
దారిలోనే వున్నాడు
చిరునామా వైపే అడుగులేస్తూ

మరి ఎవరి దగ్గరుంది చిరునామా?

తెలీదు

కానీ అక్కడికే
మా ప్రస్థానం
-------------------
"The scattered congregation"
english-robert bly
swedish- Tomas Transtromer

1 comment:

Anonymous said...

English version
-----------------------
We got ready and showed our home
The visitor thought: you live will
The slum must be inside you

Inside the church, pillars and vaulting
white as plaster, like the cast
around the broken arm of faith.

Inside the church ther's a begging bowl
that slowly lifts from the floor
and floats along the pews

But the church bells have gone underground.
They're hanging in the sewage pipes.
whenever we take a step, they ring.

Nicodemus the sleepwalker is on his way
to the address. who's got the address?
Don't know. But that's where we're going.
------------------------