Sunday, March 27, 2011

లోయ గాలి పాత జీవితం

అన్నీవెంటాడుతూనే వుంటాయి

కాలం కామం కాకుండా పోయిన పుప్పొడీ

చైతన్యం

చొచ్చుకువచ్చిన పారదర్సకతా

తనను తానూ తన్మయంగా చూస్తూ కబోది ఐన చూపూ

వసంతం

పరదాలు

పదాలు

పడిగాపులూ

బూడిద రంగు చేతొడుగులూ

మరకలు

గరికపైన కుప్ప కూలిన మనో ధూళి

భస్మం రాల్చిన పరిచయాలూ

నీ నా మధ్య ఎగసిపడిన కీర్ర్తి కెరటాలూ కిరీటాలూ

చితికిన దృశ్యాల జనాయసయపు కల

జ్వర రాత్రుల పీడ కల

జోస్యపు నురగ

గాలి కతల నేతగాళ్ళ కంఠోపాఠాలూ

కాలి పేరుకు పోయిన కరపత్రాలూ

వెలిసి పేలికలైన ముదురు ఎరుపెరుపు జెండాలూ

చెల్లా చెదురైన సముద్రాలూ

గోడల వెల్ల వెనుక మరుగైన నినాదాలూ

కోరలూ గోర్లూ మొలిచిన బంధాలూ

మాసిన ఊసులూ మాయమైన పాద గురుతులూ

చితికిన మాటలూ

చితికి ఎక్కని స్పర్సాలూ

ఉరీ ఉచ్చూ కంచే హద్దూ పద్దూ గానుగెద్దు పరిభ్రమణాలూ భ్రమణాలూ

అకసేరుకాలూ నత్తలూ గుల్లాలూ

మచ్చిక కాని పెంపుడు కుక్కల్లాంటి పేర్చిన పుస్తకాలూ

మానని గాయాల్లాంటి పేలని యవ్వనలూ

అన్నింటికీ మించి

కుదురెరిగిన బతుకూ

దాని సాకులూ

సంజాయిషీలూ

వెంటాడుతూనే వున్నాయి

(సెప్టెంబర్, పన్నెండు, పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది- vaartha, srushti )
































No comments: