Friday, March 25, 2011

శ్యూన్య తేకే శురూ

ఎక్కడ్నుంచి వచ్చామో
తిరిగీ నలిగీ అక్కడికే చేరడం
ఎప్పటికప్పుడు
మళ్ళీ మొదలవడం
@
నాలుగ్గువ్వలు వుండేవీ
నగరంలో
తలో చెట్టును వదిలి
నదినీ తల్లినీ
ప్రేయసినీ
#
తడిసిన రెక్కలతో
తటపటాయింపులు లేని
పటాపంచల పాటలు పాడాలనుకున్నాయి
$
పరధ్యానంలోనే గడిచింది జీవితం
అపర పరాజితై కూలుతోన్న కాలంలో
&
పరాధీనమైన దైనందినం
అన్యాకాంతమైపోయిన జాగా
%
దేనిపైనా పిర్యాది లేకపోవడం దుర్మార్గం
!
ఒక సంభాషణా
ఒక సాయంత్రమూ లేక
తెగిన తీగల దగ్గిర
ప్రసారం కోసం పడిగాపులు కాచీ
చని
పోయిన
ఆ గువ్వల
సమాధుల పైన
పరకల మధ్యా

" వచ్చి వెళ్ళిన వారు
అసలు రానట్టే
మరెవల్లూ పూడ్చలేని ఖాళీ
గుండెల్లో గుచ్చి వెళ్లక పోతే "

ఎక్కడ్నించి వచ్చామో
తిరిగీ నలిగీ అక్కడి నుంచే
మొదలవడం

పశ్చాత్తాపమా

ప్రాయహ్చిత్తమా

(ఏడు మే తొంభై తొమ్మిది)

No comments: