Friday, March 18, 2011

కబీరు పదాలు

మాను

కొమ్మ చివర
మునికాళ్ళలో స్వరం నింపి
ఆకుతో ముచ్చటించింది
మాను
ఇలా

పత్రమా!
విను నా మాటల శాఖను

చిగురు నవ్వు
పూలు రాలు
మాను మేని రీతి ఇదే
#

అహం

పొగరు రాలితే
చిగురు

రగిలే ఎద నది
ఎండితే
సత్య ప్రవాహం
#
అనంతం

ధనం
యవ్వనం
వచ్చి ఖర్చు అవుతాయంతే

...
మంది మంచి
నీ విడిది ఐతే
అనంతం
నీ
సంతకం
#
గమనం

ఇహం సుఖం
మది యోగం
లోక రీతి
కాల గమనం

నోటికి చేరేది కొంత
పంటికింద రాయి
కొండంత
#

బడాయి


పెదవి వెడల్పూ
నాలుక పొడవూ
శ్వాస లోతూ
అంతా అహంకారం

బడాయి రద్దు

వజ్రానికి సాన పట్తేన్తవరకూ
ఓర్పే

మెరుపు తురుపు
#
బోధి

పండితుడికి
కబీర్
ఏం నేర్పగలడు?

కబోది
ముందు
బోధి నృత్యం
#
అహం

అహం మాను
తేనె పలుకు

హృదిలో మిత్రుడు
మదిలో శత్రువు
మను
కాను
మాను
కానీ
మనమే కదా
#
ఓర్పు

నేలన పార
చెట్టున కొడవలి
పార, కొడవలి కలిసి
గొడ్డలి విసిరినా
నేర్వాలి
నెల నుంచి ఓర్పు
చెట్టు నుంచి ఓదార్పు
#
నది

మది శుప్త నది
సప్త పది
మది
నిరంతర చిరంతన

మది లిహం

రెక్కలల్లర్చినా
వివర్ణం కారాదు
జీవితం
#

No comments: