Monday, December 27, 2010
Friday, December 10, 2010
పునరపి
ఏ ఒక్కటీ
శిరసావహించదు
అన్నింటా
విరామమెరుగని
ఉరకలూ...గలగలలూ
శకలం
మరో శకలం
అంటు కడతాయి
చిగురు తొడిగి
వడివడిగా
నిటారుగా
తలెత్తినవన్నీ
అప్పటివరకూ
అపరిచితలు
పురుడుపోసుకున్న తర్వాతే కదా
నామకరణం
మళ్ళీ అవన్నీ
వెలిగి వంగి కుంగి జరిగి
లీనమైన తక్షణం
అపరిచితలే మళ్ళీ
#
అణువణువూ
అగ్నికీలల రేణువు
నింపాదిగా ఒకసారి
మరోసారి దూకుడుగా
పడిలేచి పాడే వేణువు
#
సూర్య గోళాలను చూస్తాను
తనాలనే తలకెత్తుకునే
తలాలనే వీక్షిస్తాను నేను
అయినా
తనాలూ
తలాలూ
వాటి మండే గోళాలూ
నిర్మలంగా లీనమవ్వాల్సిందే
తలతనపురాచేలాన్చల చంచలత్వంలోకి
అనంతం లోనికి
#
తల్లీ నేలమ్మా
సాగరాలు... తీరాలూ
నీ సామ్రాజ్యాలు
ఊర్లు పైర్లు ఏర్లు మైదానాలూ
నీ ఆనవాళ్ళు
నీ దిక్కులు.. నీ రుక్కులు
నీ తారాతీరాలు
నీ పాలపుంతలూ
నీ సకలం
నీ శకలం
పురుడుపోసుకున్నది
ఈ పుంతల
పులకింతనాలలోనే
ఇల
నీ లీల
నిర్నిమేష హేల
ఇలా ఇదంతా
#
ఏదీ లొంగదు
పైగా శిరసావహించదు
తెలిమంచుతెర రేఖలు కమ్మేసే
కడలి కెరటాల ఆరాటాలూ
పారే వెన్నెల మాటున
గులకల ఇసుకల మైదానాల
చీకటి చిరునామాలూ
ఈ అలల్లో
ఈ సైకతలాల్లో
వాటి మర్మ జన్మస్థానాల్లో
తరగ నురగ
వెలుతురు కొడవలితో
గిరిగీసేసుకుపోతుంది
మరో
అఖాతం
రెప్ప విచ్చుకుంటుంది
-----
డిసెంబర్ 9
(చావు పుటుకల పైన lukreetius)
Sunday, October 24, 2010
కాస్త
వీస్తాను.. ఇంకాస్త
కురుస్తాను
వీలు కాకున్నా పూస్తాను
కాలినిస్తాను
కాలనిస్తాను
పోడు చేస్తాను
నింగిలో మోపనిస్తాను
చితిలో పొడిపిస్తాను
భస్మంలో బదనిక బతుకు
అయినా
గాలి గానుగలా వీస్తాను
విత్తునూ మోస్తాను
చిటారులో విరుస్తాను
ఋతువులో
చనువుగా
కాస్తాను
కాయలా
రెమ్మలు వదిలిన
కొమ్మల్ల్లో పండునై
కవ్విస్తాను
కోసుకునే పరువాన్నిస్తాను
మాగి రాలి వేచి మళ్ళీ మొలుస్తాను
మారుక్షణం
---అక్టోబర్
Thursday, September 16, 2010
ప్రే... మ్మంటే?
ప్రేమలో
లెఖ్ఖల నొక్కులు తెలియక
యుద్ధంలో
లెఖ్ఖలు ఒఖటే తేలక
పగిలిన పగుళ్ళు ఎన్నో
తెమలని రాతిరుగుళ్ళూ అన్నే
#
యుద్ధం లాంటి
ఇంకా సిద్ధం కాని ప్రాయపు ప్రేమల్లోనూ
లెఖ్ఖ తేలని యుద్ధాలే
ప్రేమల్ని తలదన్నే
అలవి కాని అభిప్రాయపు
హద్దు జిద్దుల నడుమా
లేఖ్ఖలేని ప్రేమ ఫ్రేములు
అవిసీ అలసిన అలలు
డస్సిన
పిల్లల గలగలలు
#
ఓడి వాడిన
బంధ గంధం గుమ్మం ముందు
ఓటుపోయిన బంధన చందనం
కూడని ఏ రెండూ
మోకరిల్లకూడదెన్నడూ
తమ చాయల్లా
తతిమ్మాల బింబంలా
#
గజిబిజి అల్లికల
గువ్వల పోగు పేగు పొత్తిలినిండా
పగ రాతిరి చేరక
రాతి పగళ్ళకూ దక్కని
లే దిగుళ్ళ జిగిబిగి గూడుల నిండా...
ఏళ్ళు లేళ్ళు సెలయేళ్ళుగా
పారీ...
ఇంకీ....
కుంకీ.....
#
ప్రే...
మ్మంటే?
"నో ఎస్ ఇన్ఫితో పెరో
ఎస్ ఇన్ఫితో
ఎం కువాంతో దురా"
--విన్స్ దామ్మోరిస్ ( బ్రెజిల్)
అయినా సరే
కలిమిలో
కొలిమిలా
కనిపించే
అనంతమే
ప్రేమంటే
...
ప్రేమంటే
లేమిల్లోనూ
రాజేసుకునీ
కనీ
పెంచే
అనంతమే
-
(యూఅర్దో గలియనో రాసిన డేస్ అండ్ నైట్స్ ఆఫ్ లవ్ అండ్ వార్ చదివీ)
సంచారి
కనలి కదిలే ఆకాశాలు
మోసే మేఘాలు
నీ ఇంటి పైనా
ఖాట్మండూ లోనూ
నడయాడేదొఖటే
#
కానపుడే
కానలేనపుడే
సంచారం పంచన
నడకను ఎరుక చేసుకోవాలని అనుకుంటావు
బహుశా
#
నీ ఏటిని సమాధి చేసి
ఆగిన వాగుల ముందు
వినమ్రంగా
సజల నేత్రాన వంగి
నూటొక్క సలాములు సమర్పిస్తావు
#
ఓ నా పసికూన
గడిచిన రాతిరి
మలి నిదురన
మసలిన మెలకువలో
కడలి అలలపై
నురగ మొలిచిన చందాన
నీ
లో
నీటిలో
లోన
నీ నీలాకాశంలో
నీ నేల నడకలో
విప్పారుకున్న
చిత్ విలాసమే
సదరు సంచారమ్
-
తాటి పించం
ఈ రాతిరినే
నే
మగ తెగలా ప్రేమిస్తున్నాను
ఈ రాతిరి
దేహాన్ని
సాంగత్యాన్నీ
ఊసునూ
ఊపిరిలో
నలిగిపోని
నలుసునూ
నేన్ నే
తెగ్ గ
ప్రేమ్ ఇస్తున్నానంతే
చిక్కు చుక్కల చిక్కని ప్రశ్న ఒకటి
రాతిరిని
గదిలోకి
ఒంపు కోవాలా
లేక్ క
నా వయారి వూరి ఆరు బయట
మయూరి మహా నాట్యగత్తెలా
నయాగరాలు
నయగారాలుపోయే
తాటి శిఖ పించాల నఖలో
మోకరివ్వాలా
రేకనవ్వాలా
#
ఇదే రాతిరినీ
మున్నెన్నడో
భళ్ళున ద్వేషించాను
కప్పివుంచుకోలేకపోయినందుకు
అక్కున చేర్చుకునేందుకు రానందుకూ
చింపేయలేమి కలిమి క్షణాల బతుకమ్మ దిగుల పూతల చెదల్లో చిప్పిల్లిన సాంగత్యపు చీలునామాలు నజ్జై రెక్కర్చలేనిపోగుల మగ్గాల వడకలేని లడీలా అయిపోయినందుకు భళ్ళున ద్వేషించాను రాతిరినీ
#
ఈ రాతిరి
నిఝంఝాగానే
మాత్ర తప్పింది
పగలు దిగుళ్ళకూ
రాతిరిపగుళ్ళకూ
ఇక సెలవ్
-
రేఖా
మరే
ఏమీ లేదు
లేమీ లేని
వ్యోమగామిని
మోక్ష
జనాంతర్ గామిని
కామినీ
#
సోలీ సోలని మొహమ్తప్పా
తా కీతాకని మరపు నిప్పా
#
నియంత్రణ రేఖలు
రేఖల ప్రాయమడగకు
ఎన్నడూ
తను నడిపిస్తుందా
తనవు నుసి చేస్తుందా
నేనూ మేనూ తనూ మేమూ
నా మానాన వున్న
నా మానాన్ని రాజేస్తున్న
నా మానలేని కామానిదీ
రేఖ నియంత్రణ?
నియంత్రణ రేఖా?
#
రేఖతో
రేఖ పక్కన/లో
రేఖ పైనా
రేఖ కిందా
రే...
పో రా రే
#
రేఖ ప్రాయం అడగొద్దు
రేఖ దగ్గర బస రద్దు
-
నాయన
పరిగె మీద
తూనీగను
గురుతు పట్టమన్నట్టు
కొండల అంచున
కిరణాన్ని
వడిసి
పసిగట్టినట్టూ
తడారక ముందటి చెలిమ
ఇసుక రేణువు కైగట్టినట్టూ
గట్టున
ఒక తల్లి
తన బిడ్డకు
నేర్పిన
ద్రుగ్విషయమే
తండ్రి
-
ఆమె
విత్తనాన్ని
రహస్యంగా
కప్పి వుంచాలనుకుంది
మన్నుకప్పి
లోకం కనుగప్పి
కానీ
దాగినదేదీ
దాచిన ప్రతిదీ
శాఖోప శాఖల మానై
విరగాబూస్తుంది
ఒకనాటికని
కాన లేదు
ఆమె
-
Tuesday, September 14, 2010
లాలి
విడనాడని
నీడల్నీ
వాటితోపాటు
నిన్నూ
జుఫ్ఫ్ మని
ఎగరగలాలి
తగలెయ్యాలి
లేయాలి, పడాలి
ఉఫ్ఫ్ న
ఎగరెయ్యాలి
జెండాల్నే మోస్తున్న తలల్నీ
మొండాల్నే కోస్తున్న తనాన్నీ
జ్యప్తు చేసుకుపోతున్న
జ్ఞాపగతాలన్నీ
జలస్తంభన పర్వంలో
పూడుకుపోతున్న
జ్ఞాతుల
జినుల
మునుల వాటికన
కనలిన కతల్నీ
ఎగరెయ్యాలి
కసక్ న
కోరికేసేయ్యాలి
పశ్చా త్తాపపు గొంతుల్నీ
అట పడిగాపులు కాసిన
కాసిని పదాల్నీ
నరికెయ్యాలి
నిందల్నీ
కడ నిదురించిన నీతుల
కడుపుటల మొలకెత్తిన
కలుపులుల్నీ
రివ్ రివ్ మనీ
కూలాలి
లాలి
కూలీ
మనాలి
లాలీ జో జో
ఆలీ జో జో
ఐనా
మనాలి
-
కలవని కనుపాపలు
కలవని
మన కనుపాపలు
కనని పాపలు
కవలలు
వేరుగా
కాలం విసిరిన
రెండు వలల్లో
చిక్కి ఒక్కటైన
చిన్నారి చేపలు
రెండు
నిండు
పాపాలకు
రూపాపాయిలే
కదలని కథలనుకున్న
ఈ సమయాలు
సమాధి ఫలకాలాలే
వదలని
ఈ పెన్మత్తుమ్మెదలు
గతత్ కాలపు
చెదిరి
దరినీ కనలేనీ
నిలువునా
చీలిన
యవనికలు
కవనికలు
-
ఛాయల ద్వేషం
మిగులు దుఖం
అశేషం
ఈ నిర్వేదం
గురి తప్పి పోయిన
గుండె లయ
దిగులే నిమ్పబోతున్న
సాయం సంజ
ఏ సాయమూ
తలపని
తుమ్మెద ఎదల నిండిన
నీలాపనిందల హోరు
సర్దేసుకు పోలేని
ఈ సంచార జీవికిక
శమీ వృక్షాన
దక్కినవి కొన్ని
శతఘ్నులు
రెచ్చుకు విచ్చుకున్న
శతపత్రాలు
శ్వేతపత్రాలూ
శరీరం
శరం అయినా సరే
సంధించకు
గర్భం దాల్చిన కక్షల కక్ష్యల్లో
పరి పరిభ్రమించకు
రమించకిక ఇంచుకనయినా
నువ్ ఇలా
కౌగిలిలో మురిపెంగా
నాటిన విత్తనం పేరు
దూరం
మొలక
ఇక
పోల్చుకునే
తీరమే
నా చషకం
ఖాళీదని నిందించినా
నింపడం మాత్రం
మానకు
నువ్ మానువు
మానవివీ
అందుకే
ఇంకా ఈ రా రాతిరీ తెరుచుకునే వుంది
తలుపూ
తలపూ
-
Wednesday, September 8, 2010
వా హ్ న
ఈ వాన
వినాలి
పడే చుక్క
ప్రతీదీ
ఎగిసేపుడు
కదా
మనాలి
ఓహ్ వాన
లో వీణ
పైన
చినుకు చిందులు
విరుచుకు పడే
పై పై కురిసే
దోసిళ్ళ వాన
పడాలి
కనాలి
ఈ వాన
-
Tuesday, August 17, 2010
..నాయన.. ..నేనూ.. -వాడూ-
ఐదేళ్ళప్పుడు
నాకు
కలలో నాయన
నిదురలో వయ్యారంగా
అగ్గిపెట్టెలో బింగన్నలా
ఆకాశానికి కట్టిన బుడదంగిలా
#
ఐదేళ్ళప్పుడు
నిదురకు మూసుకున్న
వాడి కళ్ళ ఎదుటే
నాయన
....
మూసిన రెప్పలపై
మురిపెంగా వాలిందొక
సద్దు లేని ముద్దు
#
చూరు
ఒక వేలాడే టీగల తూము
సందేహాల సమూహం
నడి రేయి రేయి
ఏ జాములోనో
గుక్క తిప్పుకోలేని
పిలుపుకు
తచ్చాడే
పసి
పిడికిలి నిండా
తల వాల్చని నీడల రజను
#
అమ్మాంతం కుప్ప కూలింది
కప్పు లాంటి ఆకాశం
పొటుకులా
అశరీర వాణి
#
కుమారా
నీ నిలువుటద్దం
ఎదురుపడుతుంది
కనుబొమలే కొడవల్లుగా
గుమ్మం ముందే
#
మళ్ళీ మరో
రాతిరి
నీ ముడ్డి కడిగేసాక
నను చూడాలని
మదన పడీ
రెప్పలు అయిష్టంగానే
నువ్వు వాల్చి బజ్జుంటే
అటూ ఇటూ ఊగేస్తోంది
తొట్లే
జతగా జోల
నీ చూపు లాలికి
లయగా తిప్పేసి
పెనుగులాడి
వాల్చ్సింది
బుగ్గల నవ్వు హామీతో
#
తొట్లే లోంచి తొంగి చూస్తున్నాయి ఇంకా
పసి పాదాల వేళ్లు
మరి
ఈ వేళ్లు
చూరును కూల్చేస్తాయో
కుదురును
చూపుడు వేలుకి
గుచ్చుతాయో
- మే ౩౦, 2009
వొక సీతాకోక కల
అదృశ్య తంత్రిపై
రెక్కలు అల్లార్చిందో
సీతాకోక
#
కలత రాత్రి
కలకలాన్ని
వదిలించుకుందుకు
తెలి కాఫీ
తొలి సిప్
వణుకు చేతి కప్పు నుంచి
వంపుకుంటూ వుంటే
చెక్కిలి పై వాలినంత
పని చేసింది
#
నీరెండలో
వొక కంచెపైన
ఆ సీతాకోక నాట్యం చూసా
కల పోలిన ప్రార్థన ఒకటి
#
నిన్న మాత్రం
పట్టు పురుగు ఒకటి
ఇరుకు పిసినికాయె
తన లోకమంది
--
ఇంగ్లీష్- "బట్టర్ ఫ్లైస్ డ్రీం"
సర్గోయన్ బౌల్స్
లాలీ
కొన్ని రాత్రిళ్ళు
నిదుర పట్టదు
రాతిరి గూళ్ళు
#
ఇంకొన్ని పగల్లో
నిద్రను
దరి చేరనీయవు
దిగులు పగుళ్ళు
#
చేరగిలాలి కొంచెం
కాసింతే వొత్తిలాలి
కాసేపు వొడిలాలి మళ్లీ వినాలి
మళ్ళీ వొడిలో
లాలే వినాలి
ఎలా కా'పాడు' కోవాలే
ఈ 'పాడు' జీవితాన్ని
రా వా లాలై
లావా రాలీ
-
(పదిహేను, మే, 2010)
ఆమె
విత్తును
కన్నుగప్పి
మన్ను కప్పింది
#
దాగినదేదీ
దాచినప్రతిదీ
మాను మేనిపై
శాఖోపశాఖల్లో
విరగ బూస్తుంది ఒకనాటికి
అని
మాత్రం
కన లేదు
ఆమె
-- అనంతు
(మార్చి, ఎనిమిది, రెండు వేల పది)
ప్రవక్త
సత్యం
ఇలా చెప్పిందని తనతో
ప్రవక్త అన్నాడు మనతో:
" నేను సత్యాన్ని
ఉచ్చ నీచాల
గజిబిజి నడుమ
గడబిడల లోనూ,
నింగీ నేలల సంగమ
సింహాసనంపైనా
మన లేను నేను
#
సఖా
నేను
నిజం
నా వాక్కు ఖనిజం
నమ్మకం తొణికిసలాడే
దిటవు
గుండెను మీటు
నను
చూడాలని వుంటే
నీకు "
- జలాలుద్దీన్ రూమి
Friday, August 13, 2010
Monday, July 19, 2010
జయ 'ప్రభ' లేని అనుక్షణ ప్రయాసం
(జయప్రభ వ్యాస సంకలనం క్షణ క్షణ ప్రయాణం పరిచయం )
#
ఇదొక చెత్త పుస్తకం. సాహిత్యంలో ఇలాంటి అభిప్రాయాలను అహంకారంగా అపార్థం చేసుకునే ఆచారం చెత్తంత పాతది. పాతుకుపోయినది. ఇక పుస్తకం రచయిత్రిది అయితే ఈ అహంకారానికి ఆటోమాటిక్ గా 'పురుష' అన్నది ప్రిఫిక్స్అయిపోతుంది. ఈ ఒక్క వాక్యానికి వివరణ, ఆధారాలు ఇవ్వడానికే ఈ పుస్తక పరిచయం.
#
నేను ఏ సాహిత్య పేజీ చూసుకునే రోజుల్లోనో నాకు ఈ పుస్తకం చిక్కి వుంటే '' అల్ప సంక్యకులుగా మిగిలి పోయిన అగ్రహారసంస్కృత పాటకుల కోసం జయప్రభ రాసిన క్షణ క్షణ ప్రయాణం వ్యాస సంకలనం అందింది.'' అని రాసి ఊరుకునేవాడినిమొహమాటానికి.
కాని ఇప్పుడు ఇలా చేసే పరిస్తితి లేదు. కనుక ఇది ఎంత చేత్తదో, ఇందులో ఎంత శాతం చెత్త వుందో నిరూపించాల్సిన అగత్యంఏర్పడింది.
#
పట్టుమని పది వ్యాసాలు చదివే సరికి నేను అడ్డంగా మోసపోయానన్న సంగతి పదింతలుగా స్పష్టమైపోయింది . జయప్రభ ఈహాఫ్ బేక్ద్ మరియు వస 34 మోతాదు మించిన ఈ వ్యాసాలను పద్యాలుగా ప్యాక్ చేసి మన ముక్కులు పిండి అక్షరాలా 200 రూపాయలకు అమ్మజూపే ప్రయత్నం చేసిందన్న విషయం స్పష్టం అయిపొయింది. (అదే విదేశీయుల విషయంలో నయితే నోరుమూసుకుని పది అమెరికన్ డాలర్లకు వీటిని కొనాలన్నది మాంద్యం దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన శ్రావనమాసపు డిస్కౌంట్ స్కీంఅని యిట్టె అర్థం అయిపోతుంది. ) ప్రభ ఇంత మిస్ లీడ్ చేసినప్పటికీ వినమ్రంగా ఈ వ్యాసాలన్నిటినీ ఒకటికి రెండు సార్లుచదవాల్సి వచ్చింది.
బియ్యంలో రాళ్ళను ఏరడం తలకు మించిన పంయితే, తపీమని బియ్యాన్ని ఏరటం మొదులు పెట్టాలన్న మా నాయనమ్మఉపాయం అనుసరిన్చాల్సివచ్చింది. ఈ పుస్తకం మూలాన ఎక్కడో నక్కి దాక్కున్న నాలుగయిదు కవిత్వ సంగతులను వడిసిపట్టుకునేందుకు జాణతనం ప్రదర్శించిన నేను కనుగొన్న సత్యాలు ఇలా వున్నాయి.
- పుస్తకంలోని 34 పద్యాలలో ( ప్రభ బుకాయింపుకు క్షణ క్షణ మినహాయింపు.) 66 శాతం లిపి మనదే అయినా భాష పరాయిది.
- ఇవి పోగా దక్కిన 34 శాతంలో లిపి, భాష మనవే అనిపించినప్పటికీ నడక ఇసుర్రాయినీ, ఆత్మ డొల్లనీ, ప్రాసేచ్చ ప్రభందాలను, ఉద్వేగం తమిళ దర్శక నటకావతంసుడు విసునీ, శైలి ముక్త భావ గ్రశ్తాలంకారాన్నీ, తపన ఆర్ నారాయణ మూర్తి ప్రచారనియమావలినీ , శిల్పం ప్లాస్టర్ అఫ్ పారిస్ నీ క్నుకరిమ్చాయని అలవోకగా అర్థమై ఆనందం వేస్తుంది. ఈ వ్యాసాల పొరల్లోరెండు మూడు రిపోర్టులు కూడా దాగి వున్నాని కనుగొన్న తక్షణం సమ్మర్ హాలిడేస్లో దిన పత్రికల్లో రెండు బొమ్మల్లో ఐదుతేడాలను పర్ఫెక్టుగా చకచక కానీ పెట్టిన పిల్లల కేరింత నా స్వామ్తమయింది. వ్యాసాలు చదువుతుంటే క్లుప్తతకు కాలం చెల్లిందనిఅనిపించి దుఖమేదో వచ్చింది. ప్రతి వ్యాసమూ ముగిసిందని చెప్పేందుకు ఒక పువ్వు గుర్తును వాడింది రచయిత్రి. ఐతే ఈ గుర్తుఈ వ్యాసాలలో మనకు తారస పడటం మాత్రం చాల చాలా ఆలస్యమైంది. వ్యాసం ఫలానా చోట ముగిసిందన్న విషయాన్నికనుక్కోవడమే కదా రచయితలకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్. కృతి కృతకంగా మారుతున్న చోట స్వచ్చందంగావిరమిమ్చటం తెలియాలి.
"గట్టున నేను విశ్రమించి నన్ను నేను పరిసీలిమ్చుకోవడం నా కెంతో ఇష్టం!" - అని ప్రకటించుకున్న ప్రభ అల్లా ఈ వ్యాససంకలనంలో ఎక్కడా చేయలేక పోయింది. దాదాపు అన్ని వ్యాసాలలోను ఎక్కడో మొదలై దాని చుట్తో చక్కర్లు కొట్టి, చటుక్కునఏ పదమో, విశేషమో నచ్చి దాన్ని ఎత్తుకుని మళ్ళీ కాసేపు దాని వ్యామోహంలో మళ్ళీ గిరికీలు కొట్టడం... పుస్తకమంతా ఇదేవరస. కవిత్వం ఎలా ఉండాలో నాకు ఇంకా తెలిసిరావడం లేదు కాని, ప్యాసింజర్స్ ఎవరు చేయి లేపినా ఎక్కడ పడితే అక్కడఆపేసే గ్రామిని బస్సులాగా మాత్రం ఉండకూడదని నా గట్టి నమ్మకం. ఇది లేకే పుస్తకం నిండా ఎక్కడ పడితే అక్కడ గిరికీలుకొట్టడం ఎక్కువైపోయింది. రాసిన తర్వాత తనే మరొక్క సారైనా చదువుకుని వుండి వుంటే ఈ గిరికీలేరిగి వాత పెట్టడం ఏమంతకష్టసాధ్యమైన పని అయి వుండక పోయేది. అందుకే ఈ వ్యాసాలన్నీ కూడా కవితలు కావడానికి ముందు దశలో మూడోవెర్షన్లుగా మిగిలి పోయినట్టు అనిపిస్తాయి. ఒక దృగ్విషయానికి , అది మన మదిలో రేపే ఫీలింగ్ ని డైజస్ట్ చేసుకుని మనదిగాఅనువదించడమే కవిత్వమైతే... ఈ వ్యాసాలల్లో జీర్తి( డైజేషన్ ), అనువాదం( ట్రాన్స్లేషన్) అన్న రెండు ప్రధాన ముఖ్య స్తితులనుస్కిప్ చేసినవే 99 శాతం వ్యాసాలు. లేకపోతే పెరట్లో సంపెగని చూసి అడవిని ఊహించుకున్నంత కృతకంగానూ, బీటెక్కుర్రవాడి నివేదికకు మెలోడ్రామా మేళవించి తెలుగులోకి దించినట్టూ ఎందుకే డుశ్తాయ్.
ఇక పుష్టకం నిండా వెళ్లి విరిసిన మరొక ప్రయత్నా పూర్వక విన్యాసం- బలవంతపు ప్రాసలు. దీనికి పరాకాష్ట ' సృష్టి అనవరతం' అనే వ్యాసం. కీట్స్, కోకు, పుట్టపర్తి నారాయణాచార్యులు, గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీరంగం గోపాల రత్నం, నాచనసోమనాథుడు, అన్నమయ్య లాంటి వ్యక్తుల జ్ఞాపకంగానో, వారి ప్రజ్ఞ గురించో రాసినవ్యాసాలన్నీకూడా వాళ్ళ మీద మనకుఇదివరకు ఏర్పడిన అభిప్రాయాన్ని తునాతునకలు చేశ్తాయి. వీటన్నింటి లోనూ శ్రీ రంగం గోప్ల రత్నం గురించి రాసిన వ్యాసంమంచి మెతుకు. ఈ వ్య్యాసం ఎలా వుందంటే దిన పత్రికల మఫిసిల్ డెస్క్ లో రిటైర్మెంట్ కి దగ్గర పడుతూన్న ఓకే కల్చరల్కంట్రి బ్యూటర్ రాసి ఇచ్చిన సింగల్ కాలం ఐటెం కి చేయి తీట ఎక్కువ వున్న ఒకానొక ట్రైనీ సబ్ ఎడిటర్ రాసిన లీడ్ లాగుంది.
నా ఏక వాక్యానికి సమర్థనగా నేను ఇప్పటి వరకు చేసిన పరిచయం సరితూగు తుందని అనుకుంటున్నా.
చివరగా ... జయప్రభ చెప్పుకున్నట్టు (చూ, పే. 105) ఈ వ్యాసాలు " మహిమాన్వితమైనవీ, మొలకలు పైరులై, మంటలా, మట్టిలా రూపాంతరం చెందేందుకు మాత్రం మరో 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఆగి పోయాయి.
(తా.క: పరిచయ వాక్యాలు బాగా పొడవు అనిపిష్తే అది కేవలం జయప్రభావమే.)
- అనంతు
Thursday, July 15, 2010
ఒకో సారి
ప్రతి వేకువ
మరొకటే
తీరొకటే మారి
కప్పు వున్నది
రాత్రి ఒకతికే
పగలెలాగూ
కుశలం
#
చూడూ
ఆమె
వాసంపై
వెన్ను దన్నుగా
నిదరోతోంది బలే
కనీసం లెక్క పెట్టకుండా
.................................
english- Sometimes- ak ramanujam
పిక్స్
Subscribe to:
Posts (Atom)