Tuesday, August 17, 2010

..నాయన.. ..నేనూ.. -వాడూ-


ఐదేళ్ళప్పుడు
నాకు
కలలో నాయన
నిదురలో వయ్యారంగా
అగ్గిపెట్టెలో బింగన్నలా
ఆకాశానికి కట్టిన బుడదంగిలా
#
ఐదేళ్ళప్పుడు
నిదురకు మూసుకున్న
వాడి కళ్ళ ఎదుటే
నాయన
....
మూసిన రెప్పలపై
మురిపెంగా వాలిందొక
సద్దు లేని ముద్దు
#
చూరు
ఒక వేలాడే టీగల తూము
సందేహాల సమూహం
నడి రేయి రేయి
జాములోనో
గుక్క తిప్పుకోలేని
పిలుపుకు
తచ్చాడే
పసి
పిడికిలి నిండా
తల వాల్చని నీడల రజను
#
అమ్మాంతం కుప్ప కూలింది
కప్పు లాంటి ఆకాశం
పొటుకులా
అశరీర వాణి
#
కుమారా
నీ నిలువుటద్దం
ఎదురుపడుతుంది
కనుబొమలే కొడవల్లుగా
గుమ్మం ముందే
#
మళ్ళీ మరో
రాతిరి
నీ ముడ్డి కడిగేసాక
నను చూడాలని
మదన పడీ
రెప్పలు అయిష్టంగానే
నువ్వు వాల్చి బజ్జుంటే
అటూ ఇటూ ఊగేస్తోంది
తొట్లే
జతగా జోల
నీ చూపు లాలికి
లయగా తిప్పేసి
పెనుగులాడి
వాల్చ్సింది
బుగ్గల నవ్వు హామీతో
#
తొట్లే లోంచి తొంగి చూస్తున్నాయి ఇంకా
పసి పాదాల వేళ్లు
మరి
వేళ్లు
చూరును కూల్చేస్తాయో
కుదురును
చూపుడు
వేలుకి
గుచ్చుతాయో


- మే ౩౦, 2009














1 comment:

Hanumantha Reddy Kodidela said...

పద్యం బాగుంది. 'బింగన్న', 'బుడదంగి., 'పొటుకు'... ఊరి పలుకులు హాయిగా ఇమిడిపోయాయి. అనంతునూ, శీనునూ, సత్యనూ, మరి కొందరిని ఇలా(గైనా)కలుసుకో గలుగుతున్నందుకు ఇంటర్నెట్ కు కృతజ్ఙతలు చెప్పాలేమో! లేవు కదా, అప్పటి రికామీ ఇరానీ తేనీటి పొగలయినా! ఉండినవి ఒక్కొక్కటీ వదులుకుని, దానికి బదులుగా, ఏం పొందుతున్నాం? బోల్డంత దిగులుగా, ప్రేమగా...