Tuesday, September 14, 2010

ఛాయల ద్వేషం


మిగులు దుఖం
అశేషం
నిర్వేదం

గురి తప్పి పోయిన
గుండె లయ

దిగులే నిమ్పబోతున్న
సాయం సంజ

సాయమూ
తలపని
తుమ్మెద ఎదల నిండిన
నీలాపనిందల హోరు

సర్దేసుకు పోలేని
సంచార జీవికిక
శమీ వృక్షాన
దక్కినవి కొన్ని
శతఘ్నులు
రెచ్చుకు విచ్చుకున్న
శతపత్రాలు
శ్వేతపత్రాలూ

శరీరం
శరం అయినా సరే
సంధించకు
గర్భం దాల్చిన కక్షల కక్ష్యల్లో
పరి పరిభ్రమించకు
మించకిక ఇంచుకనయినా

నువ్ ఇలా
కౌగిలిలో మురిపెంగా
నాటిన విత్తనం పేరు
దూరం

మొలక
ఇక
పోల్చుకునే
తీరమే

నా చషకం
ఖాళీదని నిందించినా
నింపడం మాత్రం
మానకు

నువ్ మానువు
మానవివీ
అందుకే
ఇంకా రా రాతిరీ తెరుచుకునే వుంది
తలుపూ
తలపూ
-

No comments: