Thursday, September 16, 2010

ప్రే... మ్మంటే?




ప్రేమలో
లెఖ్ఖల నొక్కులు తెలియక
యుద్ధంలో
లెఖ్ఖలు ఒఖటే తేలక
పగిలిన పగుళ్ళు ఎన్నో
తెమలని రాతిరుగుళ్ళూ అన్నే
#
యుద్ధం లాంటి
ఇంకా సిద్ధం కాని ప్రాయపు ప్రేమల్లోనూ
లెఖ్ఖ తేలని యుద్ధాలే
ప్రేమల్ని తలదన్నే
అలవి కాని అభిప్రాయపు
హద్దు జిద్దు నడుమా
లేఖ్ఖలేని ప్రేమ ఫ్రేములు
అవిసీ అలసిన అలలు
డస్సిన
పిల్లల గలగలలు
#
ఓడి వాడిన
బంధ గంధం గుమ్మం ముందు
ఓటుపోయిన బంధన చందనం
కూడని రెండూ
మోకరిల్లకూడదెన్నడూ
తమ చాయల్లా
తతిమ్మాల బింబంలా
#
గజిబిజి అల్లికల
గువ్వల పోగు పేగు పొత్తిలినిండా
పగ రాతిరి చేరక
రాతి పగళ్ళకూ దక్కని
లే దిగుళ్ళ జిగిబిగి గూడుల నిండా...
ఏళ్ళు లేళ్ళు సెలయేళ్ళుగా
పారీ...
ఇంకీ....
కుంకీ.....
#
ప్రే...
మ్మంటే?
"నో ఎస్ ఇన్ఫితో పెరో
ఎస్ ఇన్ఫితో
ఎం కువాంతో దురా"
--విన్స్ దామ్మోరిస్ ( బ్రెజిల్)

అయినా సరే
కలిమిలో
కొలిమిలా
కనిపించే
అనంతమే
ప్రేమంటే
...
ప్రేమంటే
లేమిల్లోనూ
రాజేసుకునీ
కనీ
పెంచే
అనంతమే
-
(యూఅర్దో గలియనో రాసిన డేస్ అండ్ నైట్స్ ఆఫ్ లవ్ అండ్ వార్ చదివీ)
























No comments: