Tuesday, October 6, 2015

అంతర్ గామి

లేమి స్ఫురణ లేనిగదులనే
అతని తచ్చాట
*
1
వసంతం:
చిగురును
వేరునుంచి
వేరు చేసి
పల్లవించాడు
2
శిశిరం:
రాలుటాకుల
లెక్క లేదు
అతని వద్ద
మోడు చెట్టు కిందా
తల ఎత్తే వున్నాడింకా
3
హేమంతం:
చలికీ
చెలికీ
స్వాగత వచనం
పలకడం మానివేయలేదు
తన మౌనధారల్లో
4
గ్రీష్మం:
శుష్క ప్రచండత నచ్చక
సంజె మలయ మారుతాల
సావాసం మరిగాడు
5
వర్షం:
కాసేపు కేరింతల్లో
కొంచెం దు:ఖంలో
తడిసి మోపెడయ్యీ
రెక్క విప్పాడు
నింపాదిగా
6
శరత్తు:
చలి చీకటి ఆకాశాలకు
చుక్కల రెక్కలు అద్ది
నెగడు వేసాడు
యధేచ్ఛగా
*
అతను
రుతుగామి కాడు
*
లోటునూ
సంబరిస్తున్న
జీవని
అతనిది
....................................................

No comments: