ఎపుడు?
ఎలా?
ఎక్కడ?
అనే
నా విన్నపాన్ని
నీవు విన్న ప్రతి సారీ
నా చెవులకు చేరిన
నీ అనంత కీర్తన
‘‘బహుశా... బహుశా... బహుశా...’’
*
జాములు ఇలా
పొద్దులు అలా
కుంగుతున్నాయి
వొంగుతున్నాయి
ఇంకా
చెక్కుచెదరదుగా
నీ మది జవాబు
‘‘బహుశా... బహుశా... బహుశా...’’
*
నిరంతర చింతనలలో
ఏమిటి నీ కాలయాపన?
మాను సఖా
దయచేసి
దయ... చేసి
జాము జారుతున్నది
పొ ద్దు ఇంకుతున్నదీ
ఇంకా సద్దుమణగదేమీ
నీ మది
అయినా
అదే కదా
జవాబు దానిది
*
‘‘బహుశా... బహుశా... బహుశా...’’
..............................................
(క్యూబన్ పాటగాడు : ఓస్వోల్దో ఫార్రిస్
దాన్ని ఆంగ్లాన్న కైగట్టిన వాడు : జో డేవిస్)
No comments:
Post a Comment