Thursday, September 16, 2010

ప్రే... మ్మంటే?




ప్రేమలో
లెఖ్ఖల నొక్కులు తెలియక
యుద్ధంలో
లెఖ్ఖలు ఒఖటే తేలక
పగిలిన పగుళ్ళు ఎన్నో
తెమలని రాతిరుగుళ్ళూ అన్నే
#
యుద్ధం లాంటి
ఇంకా సిద్ధం కాని ప్రాయపు ప్రేమల్లోనూ
లెఖ్ఖ తేలని యుద్ధాలే
ప్రేమల్ని తలదన్నే
అలవి కాని అభిప్రాయపు
హద్దు జిద్దు నడుమా
లేఖ్ఖలేని ప్రేమ ఫ్రేములు
అవిసీ అలసిన అలలు
డస్సిన
పిల్లల గలగలలు
#
ఓడి వాడిన
బంధ గంధం గుమ్మం ముందు
ఓటుపోయిన బంధన చందనం
కూడని రెండూ
మోకరిల్లకూడదెన్నడూ
తమ చాయల్లా
తతిమ్మాల బింబంలా
#
గజిబిజి అల్లికల
గువ్వల పోగు పేగు పొత్తిలినిండా
పగ రాతిరి చేరక
రాతి పగళ్ళకూ దక్కని
లే దిగుళ్ళ జిగిబిగి గూడుల నిండా...
ఏళ్ళు లేళ్ళు సెలయేళ్ళుగా
పారీ...
ఇంకీ....
కుంకీ.....
#
ప్రే...
మ్మంటే?
"నో ఎస్ ఇన్ఫితో పెరో
ఎస్ ఇన్ఫితో
ఎం కువాంతో దురా"
--విన్స్ దామ్మోరిస్ ( బ్రెజిల్)

అయినా సరే
కలిమిలో
కొలిమిలా
కనిపించే
అనంతమే
ప్రేమంటే
...
ప్రేమంటే
లేమిల్లోనూ
రాజేసుకునీ
కనీ
పెంచే
అనంతమే
-
(యూఅర్దో గలియనో రాసిన డేస్ అండ్ నైట్స్ ఆఫ్ లవ్ అండ్ వార్ చదివీ)
























సంచారి


కనలి కదిలే ఆకాశాలు
మోసే మేఘాలు
నీ ఇంటి పైనా
ఖాట్మండూ లోనూ
నడయాడేదొఖటే
#
కానపుడే
కానలేనపుడే
సంచారం పంచన
నడకను ఎరుక చేసుకోవాలని అనుకుంటావు
బహుశా
#
నీ ఏటిని సమాధి చేసి
ఆగిన వాగుల ముందు
వినమ్రంగా
సజల నేత్రాన వంగి
నూటొక్క సలాములు సమర్పిస్తావు
#
నా పసికూన
గడిచిన రాతిరి
మలి నిదురన
మసలిన మెలకువలో
కడలి అలలపై
నురగ మొలిచిన చందాన
నీ
లో
నీటిలో
లోన
నీ నీలాకాశంలో
నీ నేల నడకలో
విప్పారుకున్న
చిత్ విలాసమే
సదరు సంచామ్
-















తాటి పించం



రాతిరినే
నే
మగ తెగలా ప్రేమిస్తున్నాను
రాతిరి
దేహాన్ని
సాంగత్యాన్నీ
ఊసునూ
ఊపిరిలో
నలిగిపోని
నలుసునూ
నేన్ నే
తెగ్
ప్రేమ్ ఇస్తున్నానంతే
చిక్కు చుక్కల చిక్కని ప్రశ్న ఒకటి
రాతిరిని
గదిలోకి
ఒంపు కోవాలా
లేక్
నా వయారి వూరి ఆరు బయట
మయూరి మహా నాట్యగత్తెలా
నయాగరాలు
నయగారాలుపోయే
తాటి శిఖ పించాల నఖలో
మోకరివ్వాలా
రేకనవ్వాలా
#
ఇదే రాతిరినీ
మున్నెన్నడో
భళ్ళున ద్వేషించాను
కప్పివుంచుకోలేకపోయినందుకు
అక్కున చేర్చుకునేందుకు రానందుకూ
చింపేయలేమి కలిమి క్షణాల బతుకమ్మ దిగుల పూతల చెదల్లో చిప్పిల్లిన సాంగత్యపు చీలునామాలు నజ్జై రెక్కర్చలేనిపోగుల మగ్గాల వడకలేని లడీలా అయిపోయినందుకు భళ్ళున ద్వేషించాను రాతిరినీ
#
రాతిరి
నిఝంఝాగానే
మాత్ర తప్పింది
పగలు దిగుళ్ళకూ
రాతిరిపగు
ళ్ళకూ
ఇక సెలవ్
-





రేఖా


మరే
ఏమీ లేదు
లేమీ లేని
వ్యోమగామిని
మోక్ష
జనాంతర్ గామిని
కామినీ
#
సోలీ సోలని మొహమ్తప్పా
తా కీతాకని మరపు నిప్పా
#
నియంత్రణ రేఖలు
రేఖ ప్రాయమడగకు
ఎన్నడూ

తను నడిపిస్తుందా
తనవు నుసి చేస్తుందా
నేనూ మేనూ తనూ మేమూ
నా మానాన వున్న
నా మానాన్ని రాజేస్తున్న
నా మానలేని కామానిదీ
రేఖ నియంత్రణ?
నియంత్రణ రేఖా?
#
రేఖతో
రేఖ పక్క/లో
రేఖ పైనా
రేఖ కిందా
రే...
పో రా రే
#
రేఖ ప్రాయం అడగొద్దు
రేఖ దగ్గర బస రద్దు
-

లేమి



చ్చం
స్త్రీలూ
పిల్లల్లాగే

పూలూనూ

ఏర లేము
కోయనూ లేము
-

నాయన



పరిగె మీద
తూనీగను
గురుతు పట్టమన్నట్టు
కొండల అంచున
కిరణాన్ని
వడిసి
పసిగట్టినట్టూ
తడారక ముందటి చెలిమ
ఇసుక రేణువు కైగట్టినట్టూ
గట్టున
ఒక తల్లి
తన బిడ్డకు
నేర్పిన
ద్రుగ్విషయమే
తండ్రి
-


ఆమె



విత్తనాన్ని
రహస్యంగా
కప్పి వుంచాలనుకుంది
మన్నుకప్పి
లోకం కనుగప్పి
కానీ
దాగినదేదీ
దాచిన ప్రతిదీ
శాఖోప శాఖల మానై
విరగాబూస్తుంది
ఒకనాటికని
కాన లేదు
ఆమె
-

Tuesday, September 14, 2010

లాలి




విడనాడని
నీడల్నీ
వాటితోపాటు
నిన్నూ
జుఫ్ఫ్ మని
ఎగరగలాలి

తగలెయ్యాలి
లేయాలి, పడాలి

ఉఫ్ఫ్
ఎగరెయ్యాలి
జెండాల్నే మోస్తున్న తలల్నీ
మొండాల్నే కోస్తున్న తనాన్నీ

జ్యప్తు చేసుకుపోతున్న
జ్ఞాపగతాలన్నీ
జలస్తంభన పర్వంలో
పూడుకుపోతున్న
జ్ఞాతుల
జినుల
మునుల వాటికన
కనలిన కతల్నీ
ఎగరెయ్యాలి

కసక్
కోరికేసేయ్యాలి
పశ్చా త్తాపపు గొంతుల్నీ
అట పడిగాపులు కాసిన
కాసిని పదాల్నీ

నరికెయ్యాలి
నిందల్నీ
కడ నిదురించిన నీతుల
కడుపుట మొలకెత్తిన
కలుపులుల్నీ
రివ్ రివ్ మనీ
కూలాలి

లాలి

కూలీ
మనాలి

లాలీ జో జో
ఆలీ జో జో

ఐనా
మనాలి
-

కలవని కనుపాపలు




కలవని
మన కనుపాపలు
కనని పాపలు
కవలలు

వేరుగా
కాలం విసిరిన
రెండు వలల్లో
చిక్కి ఒక్కటైన
చిన్నారి చేపలు
రెండు
నిండు
పాపాలకు
రూపాపాయిలే

కదలని కథలనుకున్న
సమయాలు
సమాధి ఫలకాలాలే
వదలని
పెన్మత్తుమ్మెదలు
గతత్ కాలపు
చెదిరి
దరినీ కనలేనీ
నిలువునా
చీలిన
యవనికలు
కవనికలు
-







ఛాయల ద్వేషం


మిగులు దుఖం
అశేషం
నిర్వేదం

గురి తప్పి పోయిన
గుండె లయ

దిగులే నిమ్పబోతున్న
సాయం సంజ

సాయమూ
తలపని
తుమ్మెద ఎదల నిండిన
నీలాపనిందల హోరు

సర్దేసుకు పోలేని
సంచార జీవికిక
శమీ వృక్షాన
దక్కినవి కొన్ని
శతఘ్నులు
రెచ్చుకు విచ్చుకున్న
శతపత్రాలు
శ్వేతపత్రాలూ

శరీరం
శరం అయినా సరే
సంధించకు
గర్భం దాల్చిన కక్షల కక్ష్యల్లో
పరి పరిభ్రమించకు
మించకిక ఇంచుకనయినా

నువ్ ఇలా
కౌగిలిలో మురిపెంగా
నాటిన విత్తనం పేరు
దూరం

మొలక
ఇక
పోల్చుకునే
తీరమే

నా చషకం
ఖాళీదని నిందించినా
నింపడం మాత్రం
మానకు

నువ్ మానువు
మానవివీ
అందుకే
ఇంకా రా రాతిరీ తెరుచుకునే వుంది
తలుపూ
తలపూ
-

Wednesday, September 8, 2010

వా హ్ న




వాన
వినాలి
పడే చుక్క
ప్రతీదీ
ఎగిసేపుడు
కదా
మనాలి
ఓహ్ వాన
లో వీణ
పైన
చినుకు చిందులు
విరుచుకు పడే
పై పై కురిసే
దోసిళ్ళ వాన
పడాలి
కనాలి
వాన
-