1
ఆమె లేదా నేను
నా కన్నులు
గువ్వల్లా
చిగురునుంచి వేరుదాకా
నీ మేని మానుపై
వాలడమా
నా మోహ చిరునామా
2
నేను లేదా ఆమె
పెదాలు
మధురోహల్లో
చిప్పిల్లి
మేని వనాల్లో
దారి తప్పిన
లేత పిచ్చుకల్లా
దిక్కుతోచక
విహరించడమా
కాంక్ష ఆనవాలు
3
ఆమె లేనీ నేను
వేళ్ళమొనలు
మత్తిలి
చేరగిలి
వొడిసీ
పర్యంతాంతాన్ని
పర్యటించే
ప్రతి స్వేద బిందువుల
మెరుపులని
చెరిపేస్తూ
కలిపేస్తూ
స్పర్శ
గ్రోలడమా
ప్రేమకు
అందని
వరాలు
4
నేను లేకే ఆమె
మోహ చిరునామాలు
ఆనవాలు లేని కాంక్షలూ
కురవని వర్షాలూ
ఇరువురి
వరాలు
అవీ
అనాధలు
యింకా
5
ఆమె లేకా నేనే
కన్నులు
మాను కోసం
రెక్కలుచాస్తున్న గువ్వలే
యింకా
6
నేనూ ... ఆమే
నా పెదాలు
మేనివనాల్లో
గూడింకా చేరని
పిచ్చుకుల రాతిరి చూపులు
7
ఆమే ... నేనూ... లేనీ ... లేమీ
వేలి మొనలు
దేహ చిత్రాంతాలకూ
అర్రులు చాస్తున్న
విచ్చిన కుంచెలే
యీ నేటికీ
(November 24, 2015, Manikonda)
3 comments:
బుచికోయమ్మ బుచికి. ఏంది బయ్యా. తవికలంటె జుగుప్స. లేదు ఈ జబ్బుకు చికిత్స.
nice post about ""అర పుష్కరం... లేదా అనంతరం""
Thanks,
Crude Oil Jackpot call
'కన్నులు/ మాను కోసం/ రెక్కలుచాస్తున్న గువ్వలే/ యింకా'... ఏడు గుర్రాలూ బాగున్నాయి కొత్త సూర్యుడా!
Post a Comment