Wednesday, August 26, 2015

సహేలూ


ఓసి నా సూర్యమా!
తన రజను జిలుగు

వయ్యారి చంద్రమా!
డజను చిలుకు

ప్రసరించండి
తన నాలో
నా తనలో
లోలో  పైపై

నా తెలి వెచ్చని సైకతమా
తన పాద కవళికన సుగమం సలుపు
నా గుప్పిట దాచిన చిరుగాలిలో
తన తనువు విరిసేందుకు

రుతుపవనమా!
దాహపడ్డ తన పెదాలతో
తడుపు నావి

చెలి నేత్ర ద్వయం
నను మాత్రమే కాంచే వేళలను పెంపు సేయి
కిరణమా!

కాలమా!
ననే మరి మరి గమనించనీయ్
తన కనురెప్ప ఆర్పని క్షణాల ద్విగుణీకృతాలనూ

నన్నొక్కడికే
తన కన్నొకటికిరెండూ కెటాయించనీ
పథమా!

పరువమా!
తన అధర ద్వయం
తమ సాహచర్యాన్ని కనుగొననీయ్ నాలో

నా పెదాలపైన ప్రసరించనీయ్
తన చుంబన బింబాన్ని
జీవితమా
మరొకమారు.


(25.08.15)

No comments: