Sunday, August 30, 2015

Oh My DOG


A pandemonium gained momentum
among a few sects of people.
Their tussle is all about God, I suspect.

*

'Majority' in the crowd proclaimed ‘HE’ exists!

Sporting Golden tridents,
Silver crucifixes,
And Green crescents;
milled around, snarling about in righteous fury.

*

A fistful of people
unarmed and lost in shock yelled with tireless tenacity
'No God!’

*

The great polemic debate, and these babel arguments and accusations,
just fit in for an age old time pass play.

Is it not so?

*

Then thundered an Oracle from the skies above religiously, and spoke to these two camps thus:

“Whether your divinity
sans feature and form exists or not;

Do Pray,
Do Namaaz,
Do Puja,
for each other,
that you Won't need HIM
till you lead a life on this planet, as humans."

*
Irked by the oracle’s arbitration,
all the factions got united and
crucified it,
speared it,
and 'blood laden' crescents stabbed the abdomen of the atonic voice.

*

From that day,

All prayers by Human to GOD turned selfish

And all prayers by human to his fellow became redundant.
.............................................................................................

Telugu : Anantu
English : anantu and Kumar Narasimha

Thursday, August 27, 2015

Oh My DOG


కొందరు గొడవందుకున్నారు
వారి గలాటా
దేవుడి గురించేనట
*
గుంపులో చాలా మంది దబాయించారు
‘‘ వున్నాడు’’ అని.

వారంతా
పసిడి త్రిశూలతో
వెండి శిలువలతో
ఆకు పచ్చని నెలవంకలతో
ధుమధుమలాడుతున్నారు

*
నిరుత్తరులయీ
నిరాయుధులయీ
పిడికెడు మంది
‘‘లేడు’’
అని తెగేసి అనేసారు.

*
చాలదా కాలక్షేపానికి
ఈ దూషణం
ఈ భాషణం
ఈ వాదనం

*
అపుడు
ఆకాశవాణి
ఈ ఇరు మూకలతో ఇలా పలికింది
‘‘మీ నిర్గుణ నిరాకారం
వున్నా
లేకున్నా
మనుష్యులుగా
ఈ ధరిత్రిపై
మీరున్నంత వరకు మాత్రం
ఆతని అవసరం రాకూడదని
పరస్పరం
దువా చేయండి
లేదా ప్రార్థించండి
కనీసం మొక్కులు తీర్చండి’’
అంటూ మాయమైపోయింది.
.
*
అన్ని కూటములూ ఏకమై
మూకుమ్మడిగా
ఆకాశవాణిని శిలువ వేసారు
ఆ అశరీరవాణి ని శూలంతో పొడిచారు
అమూర్త వాణి పొత్తిలి నిండా నెత్తుటి నెలవంకలే

*
ఆ నాటి నుంచే
దేవుడికి మనుషులు చేసే ప్రార్థన స్వార్థంగా
మనుషులు మనుషులకు సలిపే ప్రార్థన వ్యర్థంగా
మారింది.
...................................................................

) “-? :తె, లు. ! సా; ’’ (


తమకు
స్వర్గ ఛాయ

మరి
మలుపు,

పోనీ
వి:
శ్రాం?
తి’’
యి
మీరా... నీడా వివస్ర్త(

లో
కాకుల
లో

డినోమా

కాకూడదెన్నడూ‘‘

పవనం
వొక నైరూప్య జ(ల)గం‘

కవనం దాని
హస్త ’యోని;

తొలి
మస్తిష్క సంబంధి

చషక బందీ
మలి
నం

...............
సుదీర్ఘ కవితా
ఎం ఎస్ నాయుడూ
అనంతూ
...............
15.తూచ్.15
................


Wednesday, August 26, 2015

సహేలూ


ఓసి నా సూర్యమా!
తన రజను జిలుగు

వయ్యారి చంద్రమా!
డజను చిలుకు

ప్రసరించండి
తన నాలో
నా తనలో
లోలో  పైపై

నా తెలి వెచ్చని సైకతమా
తన పాద కవళికన సుగమం సలుపు
నా గుప్పిట దాచిన చిరుగాలిలో
తన తనువు విరిసేందుకు

రుతుపవనమా!
దాహపడ్డ తన పెదాలతో
తడుపు నావి

చెలి నేత్ర ద్వయం
నను మాత్రమే కాంచే వేళలను పెంపు సేయి
కిరణమా!

కాలమా!
ననే మరి మరి గమనించనీయ్
తన కనురెప్ప ఆర్పని క్షణాల ద్విగుణీకృతాలనూ

నన్నొక్కడికే
తన కన్నొకటికిరెండూ కెటాయించనీ
పథమా!

పరువమా!
తన అధర ద్వయం
తమ సాహచర్యాన్ని కనుగొననీయ్ నాలో

నా పెదాలపైన ప్రసరించనీయ్
తన చుంబన బింబాన్ని
జీవితమా
మరొకమారు.


(25.08.15)

Quizas, Quizas, Quizas

అతనికి
మాయమైన తన శిథిల శిశిరాలు
ఇంకా బాగా గురుతే
*
తుప్పు మూగిన
దుమ్ము మూసిన
ఆ గవాక్షాల్లోంచి
అతనే
ఆ ఉత్సవ వత్సరాలను
నెమరు వేసుకుంటాడు
*
మూసివున్న అదే కిటికీ ఊచలపై
రెక్కలూ అల్లార్చలేని చిట్టి గువ్వ మల్లే సోలి
గింజల్లా పోగేసుకుంటాడు
బతికిన క్షణాల మధురిమను

సోగుల్లా పేనుకుంటాడు
పడుగూ పేకా తనే అయి
పెనవేసుకుంటాడు బదనికలా
*
అతనిపుడు గురుతెరిగాడు
గతం దర్శించతగినదేననీ
స్పృశించ తరము కానిదనీ
*
ఇపుడంతా
అతని కంటికి
ఇన్నేళ్ళ
లో సాలీడు అల్లిన బూజు వెనుకే
మెల్లగా మసకబారుతున్న జతులు ఆ సంగతులు
*
అతనిక
గతం
దాచుకోలేడు
దాల్చలేడు
పోల్చుకోలేడు
రాల్చ లేడూ
కాల్చనూ లేడు
*
అతనితో
ఈ మహత్తర
రహస్యమూ
తనువు చాలించనుంది
కాలం చేయనుంది.
.......................................................
(Quizas, Quizas, Quizas అంటే బహుశా, బహుశా, బహుశా అని అర్థం.
అది స్పానిష్ కవి జో డేవిస్ రాసిన కవితా శీర్షిక.
దర్శకుడు వాంగ్ కార్ వై తీసిన చిత్రం in the mood for love లో ఈ పాట వాడారు.

ఈ నా కవితకు ప్రేరణ ఆ సినిమా ముగింపు వాఖ్యాలే.)