లోకాన
వాంఛలెరుగక
కలయ తిరిగాడు బైరాగిలా
గుంపుల్లో పిపాసిలా
ఏకాకి తనాల అంచులలో ధ్యానిలా
తీవ్ర మోహలేమి వీధుల్లో నడివయసు గణికలా
తీరని కలల మలుపు దారుల్లో వైకల్య బాటసారిలా
ఘోరమైన దాష్టీక రాత్రిళ్ళలో
గూడు ఎరుక మర చిన గువ్వలా
పటా టోప దైనందినాల్లో
అంధభిక్షువులా
అలుపెరుగక తిరుగాడాడు
అతనే
ఒఖడిగా
వొంటరిగా
ద్రిమ్మరిగా
సంచారిలా
అనామకుడిలా
అనాధ ప్రేతంలా
మరేం పర్వాలేదు
ఈ హీన
చరితుడిని
గుర్థించవచ్చు తేలికగా
తొలి మలి సంజెల్లొ
సుదీర్ఘ సంతకం సలిపే
చాయే
ఆతని ఆనవాలు
............
యువకకి
No comments:
Post a Comment