నీ మిత్రులు
నిను కనిపెట్టాలి
నీ శత్రువులు
నిన్ను గమనించాలి
నీ అమిత్రులు నిను కాపు కాయాలి
నీ మిత్రేతరులు
నిను ఒక చూపు చూడాలి
నీ కేవల
పరిచితులు నీకు దిష్టి తీయాలి
నీ ఆగంతుక
మిత్రులు నీవెంట నీడల్లా తచ్చాడాలి
నీ పైకి
ఆయుధం విసరబడినప్పుడు
విసిరిన
కన్నునీకే తెలవాలి
కొన్నిసార్లు
మౌనమూ ఆయుధం కావచ్చు
నీ రక్తం
చిందినపుడు
రువ్విన
చేతులు నీకే కానరావాలి
కొన్నిసార్లు నిర్లక్షమూ హంతక చేతులు తొడగవచ్చు
నీ లోతైన
గాయాన్ని చేసిన దుండగుడి
మనసు
నీవే గురుతెరగాలి
కొన్నిసార్లు
మనసు ద్వేషానికి బహువచనం కావచ్చు
ప్రియ
మిత్రమా
యుద్ధానికి
సంసిధ్ధం అయిన తర్వాత
ఎదురు
శిబిరంలో
మిత్రులెవరు
ఎవరు
అమిత్రులు
శత్రువులెవరు
ఎవరు
బంధువులు
నా ప్రియ
మిత్రమా
యుద్ధానికి
సిద్ధం అయిన తర్వాత
సంధించడమే
తరువాయి
................................................................................................అనంతు
(దెంచనాల
శ్రీనివాస్ కు)
No comments:
Post a Comment