Sunday, March 31, 2013

కాస్త సెక్స్ చేసు 'కొందామా'?







సెక్స్ కూడా వినిమయమే. వినియోగమే.
స్థూలంగా సెక్స్ జరిగేది రెండు రకాలుగా.
1. పరిచితుల మధ్యా( వివాహ, వివాహేతర సహచరులతో,వెబ్ క్యామ్ లతో, ఫోన్లతో)
2. అపరిచితుల మధ్యా (వేశ్యలతో, వెబ్ క్యామ్ లతో, ఫోన్లతో)
సెక్స్ ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ అనే జిగ్మంట్ బౌమన్ వర్గీకరణకు కొంచెం సవరణగా నేను సెక్స్ విత్ నోన్ అండ్ విత్ స్ట్రేంజర్ అని ప్రతిపాదించాను. 
అంటే ఇంకొంచెం నెట్టీ-నిటిగ్రిటీ తో చెబితే పెయిడ్ సెక్స్ (వేశ్యలతో- cash and carry), ప్రీ పెయిడ్ సెక్స్ (దంపతుల మధ్యా- commitment/loyalty is payment), పోస్ట్ పెయిడ్ సెక్స్( దంపతేతరుల మధ్యా- exchange/sharing is payment) అని మూడురకాలుగా సెక్స్ వుంటుంది.
పెయిడ్ సెక్స్, పోస్ట్ పెయిడ్ సెక్స్ 'అక్రమం' అయితే ప్రీ పెయిడ్ సెక్స్ 'సక్రమం'.
మనం కోర్టులను పడక గదుల్లోకి ఇంకా రానివ్వలేదు కాబట్టి అక్రమానికీ, సక్రమానికీ మధ్య కండోమ్ తొడుగంత మందం గీత కూడా లేదు.
అయితే 'అక్రమార్కులకు'  దొరికేలోపు "దొరకునా ఇటువంటి సేవా" అని పాడుకునే వీలుంటుందంతే. 
సో సెక్స్ కూడా ఒక కమోడిటీనే.
అంటే శరీరాలను డబ్బులకు విడివిడిగా కూడా అమ్ముకునే వేశ్యల గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు.
వివాహ, వివాహేతర సంబంధాల్లోని ఇద్దరి ఆడామగల మధ్య కూడా సెక్స్ ఒక కమోడిటీ మాత్రమే.
అయితే వేశ్యలకు కొంత మొత్తం ముడుతుందంతే.
అదే వివాహ, వివాహేతర సంబంధాల్లో అయితే కనిపంచని కరెన్సీ వుంటుందంతే.
ఇక్కడ డబ్బుల రూపంలో కాకుండా మరేదో మారకం జరుగుతూ వుంటుంది.
మరేదో అంటే?
అవసరమో, అగత్యమో, సాంగత్యమో, ప్రమాదమో, కోరికో, బలహీనతో, బలమో అనే అర్థం.
ఇవేవీ cash కాదు 'kind' అంతే!
పేరేది పెట్టుకున్నా సెక్స్ సందర్భంలో జరిగినా అది ఇద్దరు పరిచుతుల / అపరిచితుల మధ్య ఒక వినిమయ, వినియోగ వస్తువే.
అయితే ఆధనిక (కొమ్ములోపం అప్పుతచ్చు కాదు - ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకోవడమే కదా విత్తులో ఆధునికత అంటే అనే అర్థంలోనే) మార్కెట్ వినిమయ / వినియోగ సూత్రాల ప్రకారం ఇక్కడ అమ్మకం దారు, కొనుగోలుదారు వేరువేరు కాదు.
లేదా ఇద్దరూ రెండూనూ.
సెక్స్ అనే కమాడిటీకే కాదు ఇతర అన్ని వస్తువులకూ నియమాలు వర్తిస్తాయి.
కావాలంటే సెక్స్ ప్లేస్ లో టీవిని పెట్టి చూడండి.
సిసలైన చానల్ ఓపెన్ అవుతుంది.
సెక్స్ మరింత సెక్సీగా రుచిస్తుంది.
మనం పలానా సాంసంగ్ టివిని కొనుగోలు చేయకముందే మనల్ని సాంసంగ్ టివి కొనేసి వుంటుంది.
ఇలాగే సెక్స్ కూడా. 
సెక్స్ చేయడానికి ముందే సెక్స్ ఫిక్సయిపోయివుంటుందా? లేదా?
చోటు, సమయం, వ్యవధి, సామాగ్రి, సరంజామా అన్నీ సెక్స్ కు ముందే పక్కాగా ఫిక్సా కాదా?
సెక్స్ అనే వస్తువుకు అటు, ఇటు అమ్మకం దారూ వుంటారు. కొనుగోలు దారూ వుంటారు.
అందుకే సెక్స్ అన్నది వివాహం లోపలా, బయటా, వేశ్యల దగ్గరా (అంటే ప్రీపెయిడా, పెయిడా, పోస్ట్ పెయిడా) అన్నది కేవల సాంకేతికం.
మానవ సంబంధాలనే సర్వర్ లో సెక్స్ ఒక సర్వీస్.
అయితే ఆడ మగా ఇద్దరూ - ప్రొవైడర్స్, యూజర్స్.
అయితే మనం ఇస్తున్నామా(అమ్ముతున్నామా)?
పుచ్చకుంటున్నామా(కొనుక్కుంటున్నామా)?
లేక ఏక కాలంలో రెండూనా?
అన్న ప్రశ్నలకి ఒక చిన్న వాణిజ్య ప్రకటన అంత వ్యవధి (అంటే మరేం లేదు 30 సెకన్లని కవి హృదయం) కూడా వుండదు.
దీన్నే నయా కన్ జ్యూమరిస్ట్ ధోరణిలో క్విడ్ ప్రో కో అంటాంటాం.
లేదా నయా బార్టర్ విధానం అంటారు.
సాంప్రదాయికంగా చెప్పుకుంటే ఇచ్చిపుచ్చకోవడం అనే.
రకంగా desire generates/regulates desire.

ఒక ఎక్స్ ట్రీమ్ ఉదాహరణే తీసుకుందాం.
సెక్స్ అమ్మే ఒక వెబ్ సైట్ ను చూడండి. (కర్టసీ జిగ్మంట్ బౌమన్)
అక్కడ ఒక వేశ్య (మగ / ఆడ) తన శరీరాన్ని విడివిడిగా  sexually enticing commodities ని చేసి అమ్ముకోవచ్చును గాక!
ఆమెకూ / అతనికీ ఇంతా కష్టపడి ఒక కస్టమర్ని 'కొనుక్కోవాల్సిన' అగత్యం మాత్రం ఎప్పటికీ వుంటుంది.
ఎన్ని వేషాలు వేసినా, విన్యాసాలు చేసినా సెక్స్ అమ్ముకోవాలంటే కస్టమర్ ని (కనుక్కుంటే సరిపోదు) కొనుక్కోవాలి.
అందుకే సెక్స్ అనే వాణిజ్యానికి అటు ఇటూ వున్న ఇద్దరూ అమ్మకం దారులే, వినియోగదారులే. 
దారులే వేరంతే. దారాలూ వేరంతే. (strings attached)
అందుకే desire consumes desire.

ఇక్కడ సుఖం, సంతృప్తి అన్న విషయాలకు భరోసా ఇరుపక్షాలూ ఇవ్వడం లేదు. పైగా కోరడమూ లేదు.
దాంపత్యంలోనూ అంతే. బయటా ఇంతే.
'భరోసా లేని తనాన్ని' కూడా తమ కొనుగోలు / అమ్మకం ప్యాకేజీల్లో (ఇచ్చిపుచ్చుకోవాడాల్లో) బాహాటంగానే ప్రకటించుకుంటారు; బాహాటంగానే ఊహించుకుంటారు. 
ప్రకటనలు, ఊహలు వేశ్యలు, విటులకే కాదు దంపతులూ, కాని వారికీ వర్తిస్తాయి.
ఇక్కడ సెక్స్ ఒక అనివార్య అవసర మారక వస్తువు.
ఇందులో లేమి నుంచి పుట్టిన కలిమి వుంది.
ఎందుకంటే desire manufactures desire.

వేశ్యలు సెక్స్ అమ్మేందుకు ప్రదర్శించే టిట్స్, బట్స్, సైజులూ, రంగులూ, ఎత్తులూ, పల్లాలూ - ఇవన్నీ కూడా విడివిడిగానే ఇద్దరి మధ్య సెక్స్ ను ప్రభావితం చేస్తున్నప్పుడు మన ఉద్దీపనలకు, స్తంభనలకు కారణభూతాలైన ఇవన్నీ ఒకే చోట (the mall called body) దొరకవన్న 'సత్యం' సెక్స్ లో పాల్గొనే ఇద్దరికైనా ముందే తెలుసు.
'సత్యం' మార్కెట్ ఉత్పత్తి.
అంటే మరేం లేదు అది మన డిమాండే.
సత్యాన్నే సెవెన్ జి బృందావన్ కాలనీ సినిమాలో హీరో ఇలా అంటాడు.
" లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే అందరూ ఐశ్వర్య రాయ్ లే"
నిజానికి హీరో మనలో చాలా శాతానికి  సాంప్రదాయ ప్రతినిధి.
రాత్రి మాత్రమే, చీకటిలో మాత్రమే 'పని' చేస్తాడు.
అందుకే లైట్లు, స్విచ్ గొడవ.
అయినా చీకట్లో ఏం డిటైల్స్ వుంటాయి?
ప్చ్! మెజారిటీ సెక్స్ పరమ నాన్-డిటైల్ యాక్టివిటీ కదా!
అది వేరే గొడవ.
అలా సహచరుల దేహాల్లో మనం రాత్రిళ్ళు చూడలేని, చూడాలనుకోని, మిస్ అయ్యే 'అంగ'రంగ వైభవం చూసేందుకు ఇంటర్ నెట్ మెరక వీధుల్లో   కళ్ళార్పకుండా తచ్చాడుతుంటారు.  చీకటి వ్యవహారం వల్లే వేశ్యల వెబ్ సైట్ ప్రకటనల్లోముక్కలు ముక్కలుగా ఆరబోసి వున్న అందాలకు మచ్చిక అవుతారు. ఇలా isolated గా blink అవుతున్న అందాలు ఒకే మాల్ లో(దేహం) ఉండాలనీ అనుకుంటాం.
అలా లేక పోతే నిరుత్సాహం లేదు ... కల్పన వుండనే వుంది.  
ఎవరీ కల్పన అని అడగొద్దు. ఆమెకూ, అతనికీ బాగా సుపరిచితమే కల్పన.
ఇంతకీ సెవెన్ జీ బృందావన్ కాలనీ హీరో ఏమన్నాడు?
తనకు దక్కని హీరోయిన్(దేహం) స్థానంలో తన 'కల్పన' అయిన ఐశ్వర్య రాయ్ కి కబురంపాడు.
అందుకు అతను చేసిందల్లా స్విచ్ ఆఫ్ చేయడమే.
ఇలా చాలా పడకగదుల్లో కూడా కాల్పనిక పార్ట్ నర్స్ తో సెక్స్ జరిగిపోతుంటుందన్నమాట.
అన్నమాట కాదు ఉన్నమాటే. 
అందుకే చివరికి వేశ్య లు కూడా desire  నుంచి  emancipate కాలేరు.  
దంపతుల గురించి, కాని వారి గురించీ వేరే చెప్పాలా?

గురూ! desire desires desire.
కండిషన్స్ అప్లై.
---------------------------------------------------------------------------------
coming up
single ready to mingle
 

 

4 comments:

seshu said...

Never let the little head do the thinking for the big head.

generally...The big difference between sex for money and sex for free is that sex for money usually costs less.
lol... cheerssss

Anonymous said...

You reminded me my guru words on Love. Pls watch 2 min video

http://www.youtube.com/watch?v=v27OsO0f0QA

SriRam

Anonymous said...

zigmunt said that love(sex) is like a liquid, it goes where it can be comfortble, comfort is payment here, payment has many forms like emotion, material,entertainment,performance or cash etc..-GK.

Zilebi said...

Paulo Coelho పుస్తకం - Eleven Minutes అని ఒకటి ఉన్నది. అది చదివినట్టు ఉన్నది మీ టపా !

సెక్సు కొన్నా, కున్నా, అనంత 'రమ్' ఇచ్చు కిక్కు !

The oldest profession that's continuing for time immemorial.

ఇక, జీవిత పు సెక్సు గురించి- Thats the only thing humans do naturally