Saturday, March 30, 2013

యస్ అంటే సెక్స్


క్కడ సెక్స్ అంటే -సెక్స్ అని కాదు.
ఆడ-మగల మధ్య సంపర్కం. సంభోగం అనే.
అంటే ...ఉపరతి(అంగాల స్తంభనం, ఉద్దీపనం), యోనిప్రవేశం, భావప్రాప్తి, స్కలనం(లేదా అటుది ఇటు), రత్యానంతర ఇబ్బందికర మౌనం కలిపి సంభోగ ప్రక్రియ అనే అర్థంలోనే.
మరి ఎవరు యస్ అంటే సెక్స్ సాధ్యం? ఎవరు నో అంటే అది అసాధ్యం?
ప్రశ్న కూడా మనం దాటవేసే అనేక ప్రశ్నల్లాంటిదే.
అందుకే ఇది చాలా సార్లు కండోమ్ తొడుక్కునే ఎదురుపడుతుంటుంది.
లేదా ఒక వేళ ప్రశ్న తలెత్తినా తల దించుకునే, అదే చీకట్లోనే, అదే పడకపైనే, అదే ఇద్దరే, అదే కార్యాన్నేముగించేసుకుంటుంటారు.
అందుకే ప్రశ్నకు తొడుగులు తీసేసి జవాబు వెతకాలి.
సెక్స్ ఇద్దరి మధ్య సాధ్యం కావాలంటే ఎవరు ఓకే చేయాలి?
ఎవరో ఒక్కరే ఓకే చేస్తే చాలా?
ఇద్దరి సమ్మతితోనే కదా ఇష్టరతి సాధ్యం!
(లేకపోతే కేసు కదా భారత శిక్షాస్మృతి ప్రకారం)
ఇంతకీ రతికి "ఓకే" చేయడాలేంటి? అనేదే కదా చికాకు.
మాయాబజార్ లో చెప్పినట్టు రస పట్టులో తర్కం నిజానికి కూడదు.
కానీ, మనం వద్దనుకున్నా పడగ్గదికి ప్రవేశించకుండా వుంటుందా తర్కం?
ఆకర్షణలూ, కవిత్వాలు, ప్రశంసలూ, సానుభూతులూ, వ్యామోహాలు, కామాలు, అవసరాలు, పటాయించడాలు - ఇలాంటివే ఇంకొన్ని మార్గాలు ఇద్దరి మధ్యా ' గీతను' చెరిపేస్తాయి.
లేదా గీత చెరిగేందుకు ఇవన్నీ తమ వంతు సాయం చేస్తాయంతే.
జాబితాలో ఏక్స్ డియోడరెంట్ నుంచి ఫ్లేవర్డ్ కండోమ్స్ (యాడ్ల) దాకా,
వేసవి జాజి మల్లెల నుంచి ఏవీ వేసుకోని సన్నీ లియోన్ డెమో పోర్నోలదాకా - అన్నీ కూడా సెక్స్ వినియోగదారులకు ఉడతా సాయాలే.
ప్రేమ ఎలాగయితే అలవోకగానో, ప్రమాదవశాత్తో, స్పాంటేనియస్ గానో, లేదా మెరుపు మెరిసినట్టో, పోనీ 'ఎక్కడో' బెల్ మోగినట్టో జరగదో సెక్స్ కూడా అంతే.
ప్రేమలో పడటం ఇద్దరూ చాలా ఉద్దేశ్యపూర్వకంగా స్పృహతో తీసుకునే నిర్ణయమే.
సెక్స్ కూడా అలా'గే' సాధ్యం!
అయితే మనం మాట్లాడుకునే సెక్స్ సాధ్యం అయ్యేందుకు రెండు భిన్న జాతి శరీరాలుంటే సరిపోదు.
రెండు శరీరాల మధ్యా కోరికో, అవకాశమో, అవసరమో, కామమో, అలవికాని తాపమో వుంటే కూడా సరిపోదు.
నిజానికి రెండు శరీరాలు సెక్స్ కు సిద్ధంగా వున్నా సరే అంతిమ నిర్ణయం ఒక్కరే తీసుకుంటారన్న అంతిమ సత్యం తెలియడం చాలా అవసరం.
ఎందుకంటే వాళ్ళు యస్ అంటేనే సెక్స్ సాధ్యం / అసాధ్యం అవుతుంది.
మరి ఆడా - మగా శరీరాల్లో శరీరం యస్ అంటే సెక్స్ సాధ్యం?
శరీరం  నో అంటే సెక్స్ అసాధ్యం?
 *
కండోమ్ తొడగని ప్రశ్నకు సమాధానం రాబట్టేందుకు మన ఇతిహాసాలను ఒకపరి ఒకపరి వయ్యారంగా తవ్వుకుందాం.
రామాయణ, భారతాల్లో రామాయణం కొంచెం పాతదని ఒక అభిప్రాయం చెలామణీలో వుంది కాబట్టి తవ్వే కార్యక్రమం రాముడినుంచే షురూ చేయాలి.
రామాయణం కథలో యుద్ధం జరగడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి,
1. రావణుడు సీతను కోరుకోవడం
2. శూర్పనక రాముడిని కోరుకోవడం

రెండు కోరికలల వెనుక ఉద్దేశ్యం సెక్సే.
లేదా కొంచెం పంచధార పూసుకుంటే సెక్సువల్ రిలేషన్ 'షిప్' ఆధారిత దాంపత్య / వివాహ/ కుటుంబ బంధాన్ని ప్రతిపాదించడమే.
తీరని రెండు కోరికల వల్లే రామాయణంలో యుద్ధం అనివార్యం అయ్యింది.
'నన్ను ఏలుకో' అని రావణుడు, అతని చెల్లి విడివిడిగా దంపతులయిన సీతారాముల ముందు 'ఇండీసెంట్ ప్రొపోజల్' పెట్టారు.
సీత 'నో' అంటే కిడ్నాప్ జరిగింది.
రాముడు 'నో' అన్నందుకు 'అటెంప్ట్ టు రేప్' కేస్ ఓపెన్ అయ్యింది.
ఒక వేళ సీతో, రాముడో 'యస్' అని వుంటే ఏం జరిగేది? ఏం అయ్యుండేది?
మన పిచ్చి కానీ చరిత్ర అయినా, ఇతిహాసమయినా మనకు 'ఏమయ్యుండేది' (what if ?)  అన్న అవకాశాన్ని ఇస్తాయా?
నిరాకరిస్తాయి.
ఒక వేళ అలా అయివుంటే గింటే మాత్రం రామాయణంలోని వావి వరసలు మారిపోయేవి.
ఫలితంగా యుద్ధం లేకుండా ఇరు సమర శ్రేణుల పలువరసలు చెక్కుచెదరకుండా వుండేవి.
ఇతి హాసం పక్కనపెట్టి ఇక సెక్స్ లో  యస్/నో యవ్వారానికి వద్దాం.
సింపుల్ గా సీత 'నో' అనింది.
సీతక్క(ఆరుద్రను అడగండి) బాటలో నడిచిన మంచి బాలుడూ 'నో' అన్నాడు.
అయితే రాముడి ముళ్ళబాటలోనే సీత నడిచిందని మ్యాచ్ ఫిక్స్ చేయడం దాంపత్య జీవితంలో ఎనిమిదో మట్కా.
(అంటే " కమిషే విష్ణు స్త్వాన్వేతు
ద్వే ఊర్జే విష్ణు స్త్వాన్వేతు
త్రీణి వ్రతాయ విష్ణు స్త్వాన్వేతు
చత్వారీ మాయా భవాయ విష్ణు స్త్వాన్వేతు
పంచ పశుభ్యో విష్ణు స్త్వాన్వేతు
షడృతు భో విష్ణు స్త్వాన్వేతు
సప్త సప్త బ్యో హోత్రాభ్యో  విష్ణు స్త్వాన్వేతు".... అంటూ హిందూ దంపతులు నడిచే  ఏడు అడుగులు దాంపత్య జీవితానికి ఏడు హామీలు, బాధ్యతల్లాంటి చిట్కాలు. వెస్ట్ రన్ కల్చర్ ని కాపీ కొట్టే మాస్టర్లకీ, కల్చర్ మస్కట్లకీ ఎనిమిదో అడుగు చిట్కా కాకుండా మట్కానే అవుతుందనే అర్థంలో)
అందుకే రామాణం అంటే 'రంకు' పడుద్ది.

*
ఇక కురుక్షేత్రం కూడా రెండు యస్ లూ, రెండు నోల మధ్యే జరిగింది.
1. సుయోధనుడు ద్రౌపదిని కోరుకోవడం
2. ద్రౌపది కర్ణుడిని కోరుకోవడం

మయసభలో తనని చూసి పరిహసించిన అయోనిజను ఎలాగయినా 'దెబ్బ'తీయాలనుకున్నాడు సుయోధనుడు.
నిజానికి సుయోధనుడికి ద్రౌపది 'పరిహాసమే' సెక్స్ అప్పీల్.
(అప్పట్లో ఫేస్ బుక్కూ లేదు, అందులో లైకు ఆప్షనూ లేదు)
అందుకే నవ్వే చాలు పూబంతీ మాలతీ అనుకుంటూ పకపకలాడిన అవమానాన్ని పక్కనపెట్టాడు సుయోధనుడు.
నిజానికి పరిహాసం అంటే 'నో' అని అర్థం. ఒక స్త్రీ అవమానించినా తెలుగులో మగవాడికి అదే అర్థం.
కాబట్టి లాభం లేదనుకుని ద్రౌపదిని జూదంలో గెలుచుకుని 'నో' ని 'యస్' గా మార్చుకోవాలనుకున్నాడు సుయోధనుడు.
అది బెడిసికొట్టే కదా యవ్వారం కురుక్షేత్రం దాకా వెళ్ళింది.
ఇక కర్ణుడి గురించిన ద్రౌపది కోరిక కూడా ఇంతే తింగరి యవ్వారం.
ద్రౌపదికి తన తీరని కోరికల జాబితాలో మొదటిది కర్ణుడి కలయిక.
పంచపాండడవుల్లోకెల్లా 'పెద్దాయనా...పెద్దాయనా' అయిన కర్ణుడి మీదే పడింది ద్రౌపది కన్ను.
అయినా భారతంలోని రెండు కోరికలూ 'నో' అనిపించుకున్నాయి.
ఒక వేళ (what if; again) ఇవే గనుక 'యస్' అయి వుంటే కూడా వావి కానీ వరస కానీ మారేది కాదు అని గమనించగలరని మనవి.
( ప్రకారంగా వావి వరసలు పట్టించుకోని 'యస్/నో' లు రామాయణంలో, పట్టించుకున్నవి భారతంలో వున్నాయని కూడా సవినయ మనవి. పైగా రామాయణాలూ, భారతాలూ మనవే.)
ప్రకారంగా 'యస్/నో' లయవ్వారమే ఇటు రామాయణంలోనూ, అటు భారతంలోనూ ప్రధాన భూమిక పోషించింది.
శూర్పనకకీ, ద్రౌపదికీ పోలిక వుంది - వాళ్ళ కోరికల్లో.
ఎందుకంటే వాళ్ళు ముందే 'ఎస్' అనేసుకున్నారు.
అయితే 'నో'ర్మూయించబడింది.
అదే యుద్ధాలకూ కారణం అయ్యింది.
ఇక సీత గీత దాటినా 'నో'ర్మూసుకుంది.
యుద్ధం మాత్రం డిటో.
సారాంశం -  ఇద్దరి మధ్య ఇతిహాసాల్లోనయినా, పరిహాసాల్లోనయినా, అతిహాసాల్లోనయినా సెక్స్ సాధ్యం కావాలంటే అయితే సీతో, కాకపోతే శూర్పనకో, ద్రౌపదో యస్ అనో, నో అనో అనాలి తప్ప ఇతరులకు అంత సీన్ లేదు. వుండదు. వున్నా వర్కవుట్ కాదు.
రాత్రి వర్షం బాగా కురిసి వాతావరణం అనుకూలించినా, కోరికలు కాగడాలై రగిలినా, ఉద్దీపనాలు గంగవెల్లువలా చెలరేగినా, స్తంభనలు మేనంటి తారాస్థాయికి చేరుకున్నా సెక్స్ సాధ్యం కావాలంటే మాత్రం  ఒకరికే యస్ అనో, నో అనో అనగలిగే అధికారం వుంటుంది.
నిర్ణయాధికారం  కించిత్ అంతిమంగా మాత్రం సీతలకీ, శూర్పనకలకీ, ద్రౌపదిలకీ మాత్రమే వుండేది. వుందీ. వుంటుంది.
ఆడవాళ్ళ అంతిమ అంగీకారమైన ఎస్, నోల గీతలకివతలే మగవాళ్ళ ఆకర్షణలూ, కవిత్వాలు, ప్రశంసలూ, సానుభూతులూ, వ్యామోహాలు, కామాలు, పంచుకోవాడాలు, అవసరాలు, పటాయించడాలు ఆగిపోతాయి. పోవాలి. పోకపోతే బ్రిటిష్ - ఇండియన్ పీనల్ కోడ్ చూసుకుంటుంది.
చెప్పొచ్చేదేంటంటే ఎరక్షన్ కు ఎస్ నోల గొడవ లేదు. (ఆకాశమే హద్దు.)
పెనట్రేషన్ కే కావాలి. కావాలి. కావాలి. (హద్దే ఆకాశం.)
అందుకే మగవాళ్ళు మహా అయితే తలుపు(లు) తట్టవచ్చు.
తలుపు(లు) తీసేది, తీయకుండా వుండేది మాత్రం ఆడవాళ్ళే.

Of the two human species,
 man is the weaker gender to the core,
for all the hegimony attached to and manifested as 'masculinity' 
is only a subterfuge born out of his 
lacking the decisive womb.
- anantu

 -----------------------------------------------------------------------------------------
coming up
కాస్త సెక్స్ చేసు 'కొందామా'?

1 comment:

koduri vijayakumar said...

బాగుంది అనంతూ...ఇదేదో ఇలా కొనసాగించు ....
సరే గానీ, రెండు సజాతి దేహాల మధ్య కూడా మొగలి పొదలు రగులుతోన్న కలి కాలం లో జనాలకు ఇదంతా ఆసక్తిగానే ఉంటుందంటావా?....