Tuesday, January 15, 2013

k...k...s...

వొక వొంటరి
గ్రాండ్ పియానో
స్వరం
చిర పరిచిత
honky-tonk  నుంచే

గదిలో
నుదరు ముందే
ఖాళీ
గది ముంగిలి
మరో

గడీ... నుడీ

వొంటరిదే తల్లి
వెన్ను వెంటే సంక్రాంతీ తెచ్చీ
మళ్ళీ నింపమంటుంది
పరంపరగా ఓ పదకేళి
పరిచేస్తూ


ఎదురుపడిన ప్రతి
గడీ
     నుడీ
నేనెప్పటికీ
               తోడు లేక
                            నింపలేని
వొంటరి
          ప్రహేళిక

పదాలు నిండుకున్నాయి
కేళి
     సలపలేక
పెదాలు తిప్పుకున్నాయి
నుడికారం
              తలదిండుగా

వొంటరి పియానో స్వరం
honky-tonk నుంచే

    కాంతత్వంలో!
కొండెక్కింది
ఏ 

    కాంతంలో?

గడీ
       నుడీ
               గదీ
                          కేళీ
రెండింతలుగా
చిన్నబుచ్చుకున్నాయి
 

ఈ ప్రహేళికలో
పదాలు తప్పి
బంధాలు ఖాళీలయిపోతూ...


నాయినా

కూతురు 
              ముందే
నిఘంటువులో

తల్లి 
         తర్వాతే
బతుకులో

-
 16 jan13


(kks  అంటే కల్లు కాంపౌండు సమయాలు  అనీ నా ఎల్లారెడ్డి గూడాలో)