Tuesday, October 23, 2012

పిల్ల చేపల కలల కడలి

మాయా
నాగరికత అంతం
క్యాలెండర్ కాండ్రించింది

ప్రేమ పేజీ తిప్పేసింది
ప్రేయసి మరో రోదసి

కానుక అనుకున్న జీవితం 

గానుగ

మన్నిక  కావాలి
                    మచ్చిక  కావాలి
లేదా
మనలేం
               మానలేం
                           
#

ఆపాలనుకున్న ఏదీ కాదు అంతం
ఆగటం అగత్యం
గతం అనంతం
ఆకర్షించే అహం స్పృహ
ఆహ్వానించదనేకదా
ఇంత బాధా!

#

కొండ చివరన
పాదం కొన మోపినప్పుడు
కాసిన
నీ వొక్కడిదీ
వొంటరి కాదు చూపు
నీ పాదం ఇంకా కానని
లోయ
          వైశాలి
 

కనుగొన్నదేదీ కన్నుదే కాదు
చూపు విస్తరి

#

దృశ్య దేహాలు మరుగున పడనీ
దేహాతీత దృగ్విషయాలే
మక్కువ వలయాలు
దరహాస హోమం ముందు
మృదుమాస గాయం
 

సోయ హొయలు అనిర్జీవమ్
ఎక్కడిదయినా సరే
ఓ రాత్రిని ఈ రాతిరికి
కొన్ని కలల సేదకు
అక్కున కునారిల్లనీయ్

#

బరువు జీవితం
అరువు కాగితం
సిరా కరిగే కడలి
వీపున శిలువే తీరం
మనో ఏకాంతరం నడుమ
మరో ద్వీపాంతర
                        వాసాలు
దిక్కు దీపం ఆర్పినా
దరి దారి కాలిని కననీయ్

#

స్నేక్స్ సాక్స్ విడిచినా
విషం సశేషం
తేలియాడే ఆడ ఆట
                            అవాక్యం

అమాటలేగా మిగిలేవీ
అకలలేగా మసిలేదీ

కని
      కరించని సత్యాలనే
కఠోరంగా అను
                   సరించాలి

#

ఆ పిర్ర నునుపు వంకరే
ఆ పిట్ట మనసు ముక్కెరే
 
ఎరిగే
ఎగిరే నిశ్శబ్ద దహన కాంక్షా వృత్తాల్లో

ఇటు విరిగి ఒరిగాం అంతే

అతి ప్రాతః మృత్యు కారాగారంలో
సరికొత్త ప్రాణ వాయువు

శ్లోకించు
స్తోత్రిం
చు
నును దేహ రశ్మి రజనును
 

వెనుతిరగడం నిషేధం

అద్దంలో నిరాకరించబడిన
వెన్ను దన్నుఆమేనా?

చూపెప్పుడూ
ఆరని నెత్తుటి దస్తూరీ

#

అధరం మాటున అచిత్రం
దేహ భాష వంచన ముఖచిత్రం
చేరాల్సిన రాల్చిన పగల్చిన
అద్దాల్లో
అదాహ ఆకృతి

పిల్లల పిలుపెక్కడ?
పిలుపులోని పిల్లలెక్కడ?

తోడు దిగులుగా
నీడ మిగులుగా
ఈ రాత్రి
             ఈ చెట్టు
                             గర్భవతి

పిల్లలే
ఏ అనుమతీ అక్కర్లేని
రెక్కలల్లార్చిన పిట్టలు

#

తిరగుతున్ననేలపైన
వాలలేని వానలే ఆనవాలై
దేహాలు ఆరబెట్టుకుంటున్న మేఘాలు
చడీ చప్పుడూ లేని
మౌనాలోచనాలు
ఎప్పటికప్పుడు
తలతిప్పేసుకునే
రక్త పాతరలు

#

వృక్ష వక్షోజాలపైనా
కుదురు ఎరుక రాకపోతే
చుట్టూ కల తిరుగు కనీసం
ఏదో మొక్కు వున్నట్టు
ముక్కలు ముక్కలుగా
మొక్కలు మొక్కలుగా
పగిలి విత్తులా
 

నిప్పుకు పుట్టిల్లే
విత్తు వళ్ళు
             కను

#

మరో వాలు తిరిగిన ఆకాశాన్ని
మరో చినుకు అడిగింది పాదముద్ర

దరి చేరే గాలి కలలో
సకాలం ఎవరిది?
విసర్జించని అక్షరాల్లో
మౌనం ఎవరిది?

మరో గాలం
జాలరి జీవితం
జారే వలే
చేప కలల కడలి

------------------
 

అనంతు
ఎం ఎస్ నాయుడు
అక్టోబర్ ఇరవై రెండు. పన్నెండు












5 comments:

Padmarpita said...

చాలాబాగుందండి.

ఎం. ఎస్. నాయుడు said...

allowing me to write with you is a great privilege. thank you.

satyasrinivasg said...

nice culmination

Anonymous said...

కవితను గురించి అభిప్రాయం
కవితను తిరిగిరాసి ఖరాబు చేయడమే.

వీళ్ళిద్దరూ ఇంత సరళమైన వాక్యాలు
ఇంతకుముందెప్పుడూ రాయలేదేమో
చదువుతున్నంతసేపూ పారవశ్యమే
ఏం చెప్పారో తిరిగి చెప్పమంటే నోరెందుకో
రాయైపోతుంది
తెలిసిన మాటలే, వాక్యాలే
మళ్ళీ చెప్పలేకేమో - మూగవాని నోట్లో
బెల్లం గడ్డ

సరే ఇంతా చేసి
వీళ్ళిద్దరు విప్పి చెప్పుకున్నారు
ప్రశ్నలనో సమాధానాలనో
ఒకరినొకరు మార్చి తొడుక్కున్నారు

ఎవరో ఒకరు - పాదముద్ర
అంతా గానుగ కానుక జీవితం
దీనితో మనలేమూ
దీనిని మానలేమూ
ఇంకా ఇదొక
బరువు జీవితం , అరువు కాగితం
కనికరించలేని సత్యాలనే
కఠొరంగా అనుసరించాలి
వీపున శిలువే తీరం
మనో ఏకాంతరం నడుమ
మరో ద్వీపాంతర వాసాలు
స్నేక్స్ సక్సులు విడిచినా
విషం సశేషం

ఇంకెవరో మరొకరు - ఆకాశం

కొండ చివరన పాదం కొన మోపినప్పుడు
పూచిన ఒంటరి చూపు నీ ఒక్కడిదీ కాదు
కనుగొన్నదేదీ కన్నుదే కాదు - చూపొక విస్తరి
దిక్కు దీపం ఆర్పినా దరిదారి కాలిని కననీయ్

ఈ రాత్రి ఈ చెట్టు
తోడు దిగులుగా నీడ మిగులుగా
గర్భవతి

ఎక్కడిదయినా సరే
ఓ రాత్రిని ఈ రాతిరికి - కొన్ని కలల సేదకు
అక్కున కునారిల్లనీయ్

ఇంకెవరో ఒకరి అడిగిన ముద్ర
సరే ఇవన్నీ ఎప్పటికీ నీవి నావి

ఇంతకీ దరిచేరే కలలో సకాలం ఎవరిది
విసర్జించని అక్షరాల్లో మౌనం ఎవరిది

ఎవరో ఒక ఆకాశం మళ్ళీ

మరో గాలం
జాలరి జీవితం
జారే వలే
చేప కలల కడలి

Anonymous said...

eka kaalamlo 10 vibhinna bhasha chitralu chusinattuga anipinchindi. aadukunnaru iddaru... aruvu kaagitam pi karuvu aksharalato.. bhava vispotanam srustincharu. keka...