Monday, June 18, 2012

కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె
కెంపాయనె ఎల్లలు కెంపాయనె

పగటేల పైడికంటి
పగడాల పాటల్ల
ఊరూ ఏరూ మురిసి కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె

బాలింత బుగ్గాన
నీరెండ గోరింట
సెలకా సెలమాలన్నీ కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె

గోధూళి వేళల్లో
గోవుల్ల దారుల్లో
నీడా నింగీ తోడై కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె

మాపటేల గోగురిచ్చా
సెట్టుల్ల ఆటా సూసీ
పైరు పాపిటలన్నీ కెంపాయనె

కెంపాయనె ఎల్లలు కెంపాయనె


( షార్ట్ ఫిల్మ్ " పీర్లు" కోసం నే రాసిన పాట)

3 comments:

the tree said...

chaalaa chakkaga raasarandi.
best of luck for the best short film

ఎం. ఎస్. నాయుడు said...

ఈ పాట వినే అదృష్టం అందరికీ కలగాలని
నా అభ్యర్ధన

Anonymous said...

గోధూళి చరణం తప్ప చాల బావుంది