ఇద్దరే
1
ఇద్దరూ
రెండు భువనాలు
రెండు భవనాలు
చేరుకోలేని దీవులు
చేరువ కాలేని ద్వీపాలు
ఇద్దరూ వొరవడిలో కొట్టుకుపోయారంతే
ఇద్దరూ ఒక వొరలో ఇమడలేకపోయారంతే
2
ఇద్దరే
వొకరు వృత్తాంతం
వొకరు లుప్తాంతం
వ్యాసంలో గిరికీలు
వ్యాసార్థంలో పల్టీలు
రెండు గీత గీయల్లేని గుండు సున్నాలు
రెండు నేత నేయలేని సన్న పన్నాలు
3
ఇద్దరూ
వొకరు భూగోళం
వొకరు ఖగోళం
రెండు శ్వేత పత్రాలు
రెండు స్వాతి ముత్యాలు
ఇద్దరూ కిరణం గుమి కూడని జన్యువులు
ఇద్దరూ మరణం చవిచూడని ధన్యువులు
4
ఇద్దరే
వొకరు హరిత పత్రం
వొకరు పత్ర రహితం
రెండు మరణాలు
రెండు చరణాలు
ప్రాయపు వయాగ్రహాంతర వాసులు
అభిప్రాయపు జలాంతర వ్యోమగాములు
ఇద్దరూ రెండు జోస్యాలు
ఇద్దరూ రెండు భాష్యాలు
5
ఇద్దరూ
వొకరు వాయిదా
వొకరు ఫాయిదా
రెండు దురాక్రమరణాలు
రెండు శాఖాచక్రమరణాలు
నీలాప నిందలు
ప్రేలాప సుందులు
ఇద్దరూ దోఖే బాజీలు
ఇద్దరూ బట్టేబాజీలు
6
ఇద్దరే
ఒకరు ఏహ్యం
ఒకరు లేహ్యం
రెండు పలాయనాలు
రెండు చెలామణీలు
ఇద్దరూ తెగిన గాలి పటాలు
ఇద్దరూ ఎడతెగని గాయ ఫలాలు
7
ఇద్దరూ
వొకరు పచ్చల పిడిబాకు
వొకరు మచ్చల బాకు పిడి
రెండు వేరులు
రెండు వేరులు
ఇధ్దరూ శిధిల తేరులు
ఇద్దరూ శిశిర తీరులు
8
ఇద్దరే
వొకరు వీడుకోలు
వొకరు వేడుకోలు
రెండు పడకూడని మచ్చలు
రెండూ పొడవలేని పచ్చలు
ఇద్దరూ చెరో సగాలు
ఇద్దరూ చెరో జగాలు
9
ఇద్దరే
వొకరు తరం
వొరు నరం
రెండు కలవని తలాలు
రెండు మెరవని తనాలు
ఇద్దరూ ఆనవాలు చూలాలు
ఇద్దరూ వానవాలుకు మూలాలు
10
ఇద్దరే
వొకరు ధగ్దం
వొకరు భగ్నం
రెండు కనికట్టులు
రెండు మణికట్టులు
ఇద్దరూ వట్టి రక్త మాంసాలు
ఇద్దరూ వుట్టి రాగ ద్వేషాలు
11
ఇద్దరూ
వొకరు తప్పు
వొకరు తుప్పు
రెండు రజనులు
రెండు భజనలు
ఇద్దరూ శంఖు వంకలు
ఇద్దరూ శంక వంకలు
12
ఇద్దరు
ఒకరు విత్తు
ఒకరు చిత్తు
రెండూ అందని కవి సమయాలు
రెండు అందమైన సమాధి ఫలకాలు
ఇద్దరూ కుదరు బతుకు నోచుకోని కలతలు
ఇద్దరూ రుతువు అక్కున చేర్చుకోని మొలకలు
1
ఇద్దరూ
రెండు భువనాలు
రెండు భవనాలు
చేరుకోలేని దీవులు
చేరువ కాలేని ద్వీపాలు
ఇద్దరూ వొరవడిలో కొట్టుకుపోయారంతే
ఇద్దరూ ఒక వొరలో ఇమడలేకపోయారంతే
2
ఇద్దరే
వొకరు వృత్తాంతం
వొకరు లుప్తాంతం
వ్యాసంలో గిరికీలు
వ్యాసార్థంలో పల్టీలు
రెండు గీత గీయల్లేని గుండు సున్నాలు
రెండు నేత నేయలేని సన్న పన్నాలు
3
ఇద్దరూ
వొకరు భూగోళం
వొకరు ఖగోళం
రెండు శ్వేత పత్రాలు
రెండు స్వాతి ముత్యాలు
ఇద్దరూ కిరణం గుమి కూడని జన్యువులు
ఇద్దరూ మరణం చవిచూడని ధన్యువులు
4
ఇద్దరే
వొకరు హరిత పత్రం
వొకరు పత్ర రహితం
రెండు మరణాలు
రెండు చరణాలు
ప్రాయపు వయాగ్రహాంతర వాసులు
అభిప్రాయపు జలాంతర వ్యోమగాములు
ఇద్దరూ రెండు జోస్యాలు
ఇద్దరూ రెండు భాష్యాలు
5
ఇద్దరూ
వొకరు వాయిదా
వొకరు ఫాయిదా
రెండు దురాక్రమరణాలు
రెండు శాఖాచక్రమరణాలు
నీలాప నిందలు
ప్రేలాప సుందులు
ఇద్దరూ దోఖే బాజీలు
ఇద్దరూ బట్టేబాజీలు
6
ఇద్దరే
ఒకరు ఏహ్యం
ఒకరు లేహ్యం
రెండు పలాయనాలు
రెండు చెలామణీలు
ఇద్దరూ తెగిన గాలి పటాలు
ఇద్దరూ ఎడతెగని గాయ ఫలాలు
7
ఇద్దరూ
వొకరు పచ్చల పిడిబాకు
వొకరు మచ్చల బాకు పిడి
రెండు వేరులు
రెండు వేరులు
ఇధ్దరూ శిధిల తేరులు
ఇద్దరూ శిశిర తీరులు
8
ఇద్దరే
వొకరు వీడుకోలు
వొకరు వేడుకోలు
రెండు పడకూడని మచ్చలు
రెండూ పొడవలేని పచ్చలు
ఇద్దరూ చెరో సగాలు
ఇద్దరూ చెరో జగాలు
9
ఇద్దరే
వొకరు తరం
వొరు నరం
రెండు కలవని తలాలు
రెండు మెరవని తనాలు
ఇద్దరూ ఆనవాలు చూలాలు
ఇద్దరూ వానవాలుకు మూలాలు
10
ఇద్దరే
వొకరు ధగ్దం
వొకరు భగ్నం
రెండు కనికట్టులు
రెండు మణికట్టులు
ఇద్దరూ వట్టి రక్త మాంసాలు
ఇద్దరూ వుట్టి రాగ ద్వేషాలు
11
ఇద్దరూ
వొకరు తప్పు
వొకరు తుప్పు
రెండు రజనులు
రెండు భజనలు
ఇద్దరూ శంఖు వంకలు
ఇద్దరూ శంక వంకలు
12
ఇద్దరు
ఒకరు విత్తు
ఒకరు చిత్తు
రెండూ అందని కవి సమయాలు
రెండు అందమైన సమాధి ఫలకాలు
ఇద్దరూ కుదరు బతుకు నోచుకోని కలతలు
ఇద్దరూ రుతువు అక్కున చేర్చుకోని మొలకలు
2 comments:
who are those two?
''ఇద్దరూ కుదరు బతుకు నోచుకోని కలతలు
ఇద్దరూ రుతువు అక్కున చేర్చుకోని మొలకలు''
ఇది నిజం
Post a Comment