అడుగు అడుగు కలిపీ
తోడై నీడై కదిలీ
నడిచిన దారుల్లోనా
కంటికి రెప్పకు దూరం
ఇంతే ఇంతే ఇంతేనా
ఇంతే ఇంతేఇంతెలే
కలవని కనుపాపల్లోనా
కల చెదిరిన రుతువుల్లో నా
కడ తేరిన బాటల్లోనా
చిగురుకి మోడుకి దూరం
ఇంతే ఇంతే ఇంతేనా
ఇంతే ఇంతేఇంతెలే
చెరి సగమే విడి జగమైతే
ఇరు ఆశలు ఆడియాసైతే
ఎద పాటే ఎడబాటై తే
చెలిమికి లేమికి దూరం
ఇంతే ఇంతే ఇంతేనా
ఇంతే ఇంతేఇంతెలే
-----------------------------------
టైటిల్ సాంగ్
ఇంతే
షార్ట్ ఫిల్మ్
15 జూన్ 2013
----------------------------------
listen this title song stanza -1 at
http://youtu.be/4vu36JjsVVE

No comments:
Post a Comment