Wednesday, July 30, 2014

వుందా? లేదా?


మిగులు లేదు
దిగులు లేదు
పగల లేదు
పగలూ లేదు
పలుగో... పారో

ac

తనువు లేదు
తనివి లేదు
చనువు లేదు
చదును లేదు
కలిమో... లేమో

ac

నివాసం లేదు
విలాసం లేదు
కలశం లేదు
కుశలమూ లేదు
చావో... రేవో

ac

పనీ లేదు
మనీ లేదు
పాటా లేదు
బాటా లేదు
వర్గమో... మూలమో

ac

ఆర్తి లేదు
కీర్తి లేదు
మూర్తి లేదు
స్ఫూర్తి లేదు
పర్వమో... గర్వమో

ac

శేషం లేదు
వేషం లేదు
దోషం లేదు
లేశం లేదు
మీనమో... మేషమో

ac

అద్దం లేదు
శుద్ధం లేదు
పద్యం లేదు
మద్యం లేదు
దూరమో... తీరమో

ac

అదీలేదు
ఇదీ లేదు
గతీ లేదు
మతీ లేదు
దవనమో... కవనమో

ac

ఇంతి లేదు
సంతు లేదు
పంక్తి లేదు
గెంతు లేదు
             అంతమో... అనంతమో



 ac

Thursday, July 24, 2014

బహుశా


బహుశా నేనెవరితో
కలవనేమో
బహుశా నేను
కలువనేమో

f


బహుశా నేనెవరితో
నిలువనేమో
బహుశా నేను
నిలువునేమో

f

బహుశా నేనే
చిలువనేమో
పలువనేమో
బహుశా నేనే
విలువనేమో

f

బహుశా నేనే
పిలువనేమో
తలవనేమో
బహుశా నేనే
శిలువనేమో

f

బహుశా నేను
పిలుపునేమో
తలపునేమో
తలుపునేమో
బహుశా నేను
బలుపునేమో

f

బహుశా నేను
నిందనేమో
రందినేమో
బందీనేమో
బహుశా నేను
బాదరబందీనేమో

f

బహుశా నేను
పరుగునేమో
పురుగునేమో
చిరుగునేమో
విరుగునేమో
బహుశా నేను
చిగురునేమో

f

బహుశా నేను
తరుగు నేమో
తరగనేమో
బహుశా నేను
తరగనేమో

f

బహుశా నేను
తప్పునేమో
ఒప్పునేమో
తుప్పునేమో
బహుశా నేను
ఒప్పనేమో

f

బహుశా నేను
గెలవనీనేమో
బహుశా నేను
గెలుపునేమో

f

బహుశా నేను
బహుశా నేమో
 f

(శ్రీ జయ దక్షినాయణ గ్రీష్మ ఆషాడమాస బహుళ చతుర్దశి అమృతఘడియలలో)