Friday, October 18, 2013

నిరంతరం


వొక రాత్రి 
తలపు తట్టినపుడూ
తలుపు తట్టనప్పుడూ
చప్పుడు 
                వినాలి

వొక వుదయం
మేలు కొలిపినపుడూ
మేలు కోరనప్పుడూ
పిలుపు
కావాలి

వొక మధ్యాహ్నం
చెరిగి పోనపుడూ
చేరువ కానప్పుడూ
గురుతు
వుండాలి

వొక సాయంత్రం
తచ్చాడినపుడూ
నిచ్చెన అయినప్పుడూ
సావాసం
మనాలి

వొక మలి జాము
వొలికినపుడూ
వోర చూడనప్పుడూ
ఏకాంతమే
    కురవాలి

-----------------------------