సూరీడుని చేరుకోవాలి
చందురుడినీ తాకాలి
మోకరిల్లాను
దిక్కులు మొలవని
రెక్కలు తెరవని
దేహం ముందే
"అపరిచిత కొలనుల్లోనే
దివారాత్రాలూ
యీదులాడు" అంది దేహం
లోకొలనునే అనుస్వరిస్తూ
"ఎందకు?"
అడిగింది నా సం దేహం
"అక్కడే
అక్కడ మాత్రమే
రెక్కలు దిక్కులు అవిసి
దిక్కులు రెక్కలు అల్లార్చి
తాకుతావు
సూర్యుణ్ణే
నీకు నువ్వే
చేరుతావు
చంద్రుణ్ణే
నువ్వు నీకై"
ఉబలాటంగా వున్న
సఖుల కోసం
ఎగరడం మాని
పడిగాపులు కాస్తున్న
ఆగంతకుల ఊహల్తో
దూకేస్తాను
ప్రతిసారీ
ఏవేవో కొలనుల్లోకి
అనంతబాహువుల్ని
మాత్రమే
సాచి
---------------------------
(feb7, 2013, 1 pm)
చందురుడినీ తాకాలి
మోకరిల్లాను
దిక్కులు మొలవని
రెక్కలు తెరవని
దేహం ముందే
"అపరిచిత కొలనుల్లోనే
దివారాత్రాలూ
యీదులాడు" అంది దేహం
లోకొలనునే అనుస్వరిస్తూ
"ఎందకు?"
అడిగింది నా సం దేహం
"అక్కడే
అక్కడ మాత్రమే
రెక్కలు దిక్కులు అవిసి
దిక్కులు రెక్కలు అల్లార్చి
తాకుతావు
సూర్యుణ్ణే
నీకు నువ్వే
చేరుతావు
చంద్రుణ్ణే
నువ్వు నీకై"
ఉబలాటంగా వున్న
సఖుల కోసం
ఎగరడం మాని
పడిగాపులు కాస్తున్న
ఆగంతకుల ఊహల్తో
దూకేస్తాను
ప్రతిసారీ
ఏవేవో కొలనుల్లోకి
అనంతబాహువుల్ని
మాత్రమే
సాచి
---------------------------
(feb7, 2013, 1 pm)