ఇప్పుడు తెలుగు సాహిత్యానికి కథే vanguard. తెలుగు కథకులు సంఘటిత బృందం; కవులలాగా అసంఘటితం కాదు. అంటే కవులకు వుండిన cardholderism, political affiliation అన్న అంశాలు ఒక mandate ఏ మాత్రమూ కాదు కథకులకిప్పుడు. ఇది గత పదేళ్ళలో వచ్చిన మంచి మార్పు. మంచి - ఎందుకంటే సృజన పరిధి, దృక్పథ విస్తృతి మరింత విశాలం అయ్యింది కనుక. అలా అవ్వకపోవడం వల్ల కినుక మనకు వుండింది కనుక.
కవిత్వానికీ, కథకూ పోలిక ఎందుకంటే పదేళ్ళ ముందు ఈ ప్రక్రియల మధ్య పోటీ, కించిత్ వైరమూ వుండినాయి కనుక.
$
రాజకీయ దృక్పథం లేని సృజన లేనేలేదు, వుండదు. పైగా మాకు ఏ రాజకీయ దృక్పథమూ లేదని ఏ సృజనకారులయినా అంటే మాత్రం చెలామణీలో వున్న లేదా వ్యవహారంలో వున్న (statusquo- యథాతథ) దృక్పథంతో సదరు బృందానికి ఏ పేచీలేనట్టే అన్న మాట!
అయితే కేవలం రాకీయ దృక్పథమే తనంతకదే సృజన కాలేదు, కాదు. ఇప్పుడు కథ నడుస్తున్న వాతావరణం చాలా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైనది అని ధీమాగ చెప్పగలను.
ఎందుకంటే మొనోపొలీ దృక్పథాల కచ్చడాలను కథ దాటింది ఇప్పుడు. అంటే ఆ కచ్చడాలు కథని దాటలేదు సరి కదా, కనీసం తాకలేదని అర్థం. అందుకే ఇది మంచి పరిణామం.
$
పట్టుమని పది-పదైదు లైన్ల కవిత ప్రచురణకే నోచుకోక, దిన, వారపత్రికలల్లో సాహిత్యం space బాగా తగ్గిపోయిందని పదేళ్ల ముందు నుంచీ బాధపడ్డాం అంతా. అయితే అన్ని పత్రికల్లో సాహిత్యానికి హక్కుగా వుండాల్సిన ఈ space ని కథ పదింతలు పెంచింది. ఇది కథ అనే నిడివి ఎక్కువ వున్న ప్రక్రియ విజయం మాత్రమే కాదు, మొత్తంగా తెలుగు సాహిత్య విజయం. మార్కెట్ విజయం కూడా. లేదా కథ చేసుకుంటున్న మార్కెటింగ్ విజయం కూడా. ఇంకా చెబితే కథ ఇప్పుడు నడుస్తున్నది ఒక రకమైన sponsored ambiance లోనే.
ప్రజాస్వామ్యంలో సృజనకు వుండాల్సిన public spaceని కథ పరిణామాత్మకంగానే కాదు, గుణాత్మకంగా కూడా సాధించింది, పెంచింది, పోషిస్తోంది గత పదేళ్ళుగా. ఏ జాతి అయినా సరే కథలతో సంభాషించే తత్వాన్ని అలవరచుకుంటుందంటే ఆ జాతి అభివ్యక్తి గవాక్షాలు విశాలమవుతున్నాయని లెక్క. ఇదీ తెలుగు కథ, కథకులు సాధించిన ఘన విజయం.
కథ రాస్తే చాలు- అది మంచిదయినా, కానిదయినా సరే ముందు వెలుగు చూసే వెసులుబాటును తెలుగు కథకులే కష్టించి కల్పించుకుంటున్నారు.
ఒకరకంగా చెబితే, ఇప్పుడు తెలుగు కథ చదవకపోతే తెలుగు సాహిత్యం, జీవితం miss అవుతున్నట్టే. ఇది పైకి sweeping statement గా అనిపించినా ఇదే వాస్తవం.
తెలుగు సామాజిక భౌతిక వాస్తవికతను ప్రతిబింబిస్తున్న బలమైన, విశాలమైన, ఏకైక తెలుగు సాహిత్య ప్రక్రియ ఇప్పుడు తెలుగు కథ మాత్రమే.
జీవితంతో సంబంధం తెగిపోయిన ఉద్యమాలు నడుస్తున్న కాలంలో వస్తున్న వాస్తవికథలివి. ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధం, అనుబంధం లేని కథకులు సృష్టిస్తున్న నికార్సయిన జీవితాలు ఇవి. ఇలా social concerns, social protests, dynamics of life and esthetics of living ని తెలుగు కథ ప్రతిఫలించడం ఒక నిశ్శబ్ద విప్లవమే.
$
ఇప్పటి తెలుగు కథలో chronicling, commenting పాళ్ళు కొంచెం ఎక్కువే. ఇందులో కేవల నివేదన(plane reporting- reporting the unreported), documentation(for the sake of documentation), అస్పృశ్య జీవన ఆవిష్కరణ(exploring the unexplored) లాంటి లక్షణాలు తెలుగు కథలకు కొత్త వెలుగులు ఇచ్చాయి, తెచ్చాయి.
అయితే ఈ లక్షణాల వల్ల నవీన జీవిత ఘర్షణ, మారిన సంఘర్షణాత్మక సామాజిక సంబంధాల ఆవిష్కరణ జరగవలసినంత నిర్మొహమాటంగా తెలుగు కథల్లో జరగలేదు. అయితే ఆ జీవితాల, ఆ ఘర్షణల గురించిన కొత్త వివరాలు మాత్రం విరివిగా తెలిసాయి. ఇదేం తక్కువగా చేసి చూడాల్సిన విషయం కానేకాదు. ఒకరకంగా కథ journalistic/featuristic genre ని కూడా బలంగా ఒక ప్రక్రియగా ముందుకు తీసుకువచ్చింది. ఇలాంటి లక్షణం వున్న కథలు ఈ 20 ఏళ్ళలో చాలానే వచ్చాయి. ఈ మాటలేవీ చిన్నచూపుతో అంటున్నవి కావు. ఈ రచనాశైలులు కూడా కథకూ, కథకులకూ చాలా అవసరమే. కానీ ఇందులో కూడా తమను తాము తర్ఫీదు చేసుకోలేని(చేసుకోలేకపోతున్న) రచయితలే ఎక్కువగా తాజాగా తారసిల్లుతున్నారిప్పుడు.
నిజానికి journalistic/featuristic రచనా శైలి కూడా కథా కథన సంవిధానాన్ని enhance చేసే ఒక బలమైన toolగా వాడుకున్నారు చాలా దేశాల్లో కథకులు. అయితే కథకు ఇది కూడా మరొక నగ అని చెబితే ఒప్పుకునే స్థితిలో చాలా మంది తెలుగు కథా రచయితలు లేకపోవడం వెనుక కొద్దిమంది కథకుల దాదాగిరీ కనిపిస్తోంది. ఇది దురదృష్టకరమే. పైగా వాళ్ళ రచనలు journalistic/featuristic గా వున్నాయని కితాబు ఇస్తే అది తిట్టుగా భావించే రచయితలే చెలామణీ అవుతుండటం కొంచెం పాఠకులను కించపరచడమే.
కథన శైలికి సంబంధించిన ఇలాంటి పొరలు వర్తమాన కథా రచయితలు తెలుసుకుంటే వస్తువుకు సంబంధించిన చాలా పొరలు తమంతట తామే తెరుచుకుంటాయి. ఈ మాట ఇప్పటి కథకులు నమ్మకపోవచ్చు. ఎందుకంటే కథకుల పుట్టుక, గిట్టుకా మార్కెట్ నిర్ధరిస్తోందిప్పుడే.
వీటిని గతంలో తెలియజెప్పి, చర్చించి నిగ్గుతేల్చిన కథా విమర్శ ఇప్పుడు దాదాపు గైర్హాజరే. ఐక్యరాజ్య సమితిలో నమోదు అయిన, ఇంకా కాని ఏ దేశ సాహిత్య చరిత్రలోనైనా సాహిత్య విమర్శ మరణం కథకులకు సోపానమవుతుందేమో కానీ కథకు మాత్రం కాదు.
తెలుగులో కథా విమర్శ total absence వల్లే దేని కదే(థే) compartmentalize అయ్యింది.
ఒక విప్లవకారా కథలో దళిత స్పృహ వున్న పాత్రను, అంటే కుల వివక్ష గురించిన చర్చ చేసే పాత్రను ఊహించలేం. లేదా ఓ ముస్లిం వాద స్పృహ వున్న కథలో దళిత క్రిష్టియన్ వెతలను చూడలేం. పోనీ ఓ ఫెమినిస్ట్ తన కథలో చేసే ఆర్గ్యుమెంటేషన్ లో social upbringing లో జెండర్ ఎలా మగతనం, ఆడతనం అయిపోయి విడిపోతోందో అన్న స్పృహ లేమి బాగా కనిపిస్తుంది. ఈ avoidance లో కొంచెం అజ్ఞానంతో కూడుకున్న బెరుకు వుంది. . ఫలానా వాదం ఫలానా వారే చూసుకుంటారు, మనకెందుకు అన్నట్టు నడుస్తుంటాయి చాలా కథల్లో పాత్రలు. దీని వల్ల ఆ జీవిత సంఘర్షణ, ఆవిష్కరణ censor అయిపోతూ వుంది. ఈ compartmentalization పోవాలంటే కథకులు తరచూ కలుసుకోవడం కాకుండా కథకుల ఆలోచనలు కలుసుకోవాలేమో. ఆ సంగమ స్థలిలోనే, ఆ ఇచ్చిపుచ్చకోవడంలోనే కదా కథ విస్తరించేది, కథకులు పరిణితి చెందేది.
Identity polemics ఒక బృందానికి assertion ఇవ్వడంతో పాటు ఇతరుల identity తాలూకు జీవితాన్ని చూడకుండా కట్టడి చేస్తోంది. అందుకే ఈ specialized రచయితల రచనలు అర్థ సహితాలే కాదు అర్ధరహితాలు కూడా.
ఈ compartmentalizationని తమ specialization అనుకునే రచయితలు ఎక్కువవుతున్నారిప్పుడు. పైగా తమ కుటుంబం, తమ ఊరు, మతం, కులం, తమ వాతావరణం తప్ప, తాము చూసిన జీవితం తప్ప ఇంకేది రాసినా పాపమే అనుకుంటారు ఈ తరహా కథకులు. ఎందుకంటే వీళ్ళు తమని తాము outsiders అని అనుకుని ఆగిపోయి అదే తమ శైలి అని కూడా అనుకుంటున్నారు. ఈ ధోరణి తెలుగు కథకు చాలా చెడ్డ చేసింది, చేస్తోంది. తాము చూసిన జీవిత వివరాల చిత్రణకు పరిమితం కావడంలో తప్పేమీ లేదు. కానీ ఇతర జీవిత చిత్రణ, అధ్యయనం కొరవడితే ఇక కల్పనకు(fiction), ఊహకు (imagination) తావెక్కడ వుంటుంది. అసలు ఒక నివేదికకు, కథకూ వున్న తేడా అంతా అందులోని కల్పన, ఊహ వల్లే వస్తుంది అన్న విషయాన్ని మరచిపోతే ఎలా? ఇప్పుడు చాలా కథల్లో కొరవడింది ఈ కల్పన, ఊహ అని బలంగా చెప్పగలను. ఇవి లేక పోవడం వల్లే చాలా కథలు బలహీనంగా తయారయ్యాయి.
$
ఆధునికత మన మూలాలను uproot చేస్తుంది. ఉద్యోగం, ఉపాధి ఎప్పుడూ వలసలనే కంటుంది. ఈ ఆధునికతే తెలుగు ఆధునికథల్లో విస్తారంగా పరుచుకుని వుంది. ఈ displacement నుంచి వచ్చిన సృజన తెలుగు కథను సుసంపన్నం చేసింది, చేస్తోంది, చేయాలి కూడా. ఈ అంశమే ఇప్పుడు తెలుగు కథను ఒక బలమైన, చర్చచేయకుండా వుండలేని సాహిత్య ప్రక్రియగా నిలబెడుతూ వుంది.
గ్లోబలైజేషన్ అనే పడికట్టు జడబంధంలో ఆధునికత, అభివృద్ధి సృష్టించిన భీభత్సాన్ని తెలుగు కథ చర్చ చేస్తున్నంతగా మేలైన మెతుకులతో పట్టి ఇస్తోందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఆధునికతతో పురుడు పోసుకున్న వలసలు, మూలాలను కోల్పోవడం, ఆధునీకరించబడటం అనే తతంగం అంతా మన ఐచ్ఛికతతో సంబంధం లేకుండా జరిగిపోతున్న ఒక అనివార్య సామాజిక పరిణామం అనుకుంటుంటాం. అయితే మన జీవితాలు ఒక మెగా సామాజిక పరిణామ ప్రక్రియలోని లాజికల్ ఎండ్ కు నెట్టివేయబడుతున్నాయనీ, ఆ బాటలో మనం ఏ సామాజిక నిరసనా తెలుపకుండా ప్రయాణిస్తున్న కేవల బాటసారులుగా మిగిలిపోతున్నామనీ మన కాళ్ళకు మరింత బలంగా, సరళంగా ఎరుక పరుస్తోంది కొంచెం తక్కువతెలివితోనయినా కథ అనే ప్రక్రియ మాత్రమే తెలుగులో. నిజానికి ఈ పని సామాజిక వ్యాస రచన, polemical writing తెలుగులో చేస్తూ వుండాల్సింది. కానీ ఆ polemics ని కూడా కథే తన భుజాన వేసేసుకోవాల్సిన అగత్యం పట్టింది. ఇది బాధ్యతా రాహిత్యంగా కాలం వెళ్ళబుచ్చుతున్న తెలుగు విమర్శకుల విఫల కథ.
$
ఏ వలస అయినా nostalgia కు జన్మనిస్తుంది. అందుకనే nostalgia నేపధ్యాన్ని వలసల వెలుగులోనే కనాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే రొమాంటిక్ గతానికి అబ్బురత ప్రదర్శించడంతోనో, మక్కువ పెంచుకోవడంతోనో ఆగిపోగళం. గత వైభవం లేదా నిన్నటి కష్టసుఖాల లోంచీ, ఆ తెలియని జీవిత వివరాల్లోంచీ పుట్టిన పాత్రల చమత్కారాలకు పడిపోయి, బాగా ఫిదా అయిపోయీ చప్పట్లు కొడుతూ వుండిపోతాం. ఆ అబ్బురతతో కూడా, ఆ చప్పట్లలోనూ తెలుగు కథ ఆవిష్కరిస్తున్న అనూహ్యత ఒక మంచి గెంతు మాత్రమే అని నమ్ముతున్నాను. అయితే ఆ గెంతే ఒక విప్లవం అనుకునేంత తృప్త ఆత్మలమయిపోతున్నారేమో కొదరు కథా రచయితలు అనిపిస్తోంది. ఈ తృప్తి అప్పుడే కొందరి కథకుల్లో, కొన్ని కథల్లో కనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదం. ఈ ప్రమాదం ఊరికే వుండదు, ప్రమాదకరమైన కథకులనూ, వాళ్ళ అంతే దుర్మార్గమైన పాత్రలనూ కనబోతోంది రానున్న రోజుల్లో. ఆ కథా కాలుష్యం మన ముక్కుపుటాలకు అప్పుడే సోకుతోంది.
కథకులుగా, సామాజిక ఆలోచనాపరులుగా మనం contemporary కావడానికి ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం- చరిత్రకు ఇంత వరకు తెలియని బతుకులను బలంగా తెలియజెప్పే వాహికగా కథను వినియోగించడమే. ఇందుకే కథలే రాస్తున్నాం, చదువుతున్నాం. అయితే తమ కథన చాతుర్యంలో (రాయడానికీ, చదవడానికీ) పడిపోయిన కొందరు కథా రచయితలు తమ కథలను వారికి తెలీకుండానే ఒక గత జీవిత సామాజిక విజ్ఞాన వినోద యాత్రగా ముగించిన సందర్భాలకూ మనమే పాఠకులం కాదా?
వెనక్కి తిరిగి శోధించి, తోడి, గాలించి తమ ముందున్న గ్యాలరీ కోసం మాత్రమే రాయాలనుకునే విచిత్ర విన్యాసానికీ ఇంకొందరు కథకులు లోనయిపోయీ, లోబడిపోయిన సందర్భాలూ వున్నాయి. పైగా అలా లోబడిపోవటమే ఒక కొత్త బడి (school of thought) అనుకునే తప్పుకూడా చేసారు మరికొందరు కథకులు. అయితే అది ఒక వొరవడే కానీ దానికదే ఎంత మాత్రం బడి కానే కాలేదు. అయితే ఈ తీవ్రవాదం ఇక్కడితో ఆగలేదు. ఇంకొందరు కథకులు వెనక్కి తిరిగి చూసుకుంటూ తమకు తామే తెగ మురిసిపోయి ఇక ఎన్నటికీ తల ముందుకు తిప్పుకోలేక కుప్పకూలిన తతంగమూ మనమే చూస్తున్నాం కదా?
గత ప్రభల ప్రవర వ్యాపారమైపోవడమూ ఇప్పుడొక ట్రెండ్. ఈ ట్రెండ్ వల్లే కథకులు కాలాతీత పుడింగులయి కూర్చుంటున్నారు పాఠకుల నెత్తులమీద.
ఒక్కసారి ఏదైనా సరే వ్యాపారమైపోతే ఇక మంచి చెడులేముంటాయి. మహా అయితే లాభనష్టాలుంటాయి కానీ. గత కష్టాలూ. చమత్కారాలు, మిరియాలూ లేదా ఇప్పటి లాభ నష్టాలూ మాత్రమే కథ కాదు కదా? చూపు వెనక్కి సారించినా తల ముందుకు తిరగాలి కదా! లేకపోతే కాలికింద కరుగుతున్న నేల కనిపించడం కాలం నిరాకరిస్తుంది.
కథకుడు, మరీ ముఖ్యంగా వర్తమాన తెలుగు కథకుడు forward planning ని విస్మరించకూడదని బలంగా నమ్ముతున్నాను. nostalgia మాత్రమే currency అయిపోయిన కాలానికి కొట్టుకుపోకూడదు, తలవొగ్గ కూడదు ఏ కథకుడైనా. ఆ మజాలో, ఆ మార్కెట్లో, ఆ మాయలోనే వుండాలనుకునే కథ, తమను తాము ఆ మత్తులోనే వుంచుకోవాలనుకున్న కథకులూ కుంటుపడతారు. కుంటుతారు.
nostalgic writing అయినా, post-global వాతావరణంలో forward planners గా వైచిత్రి వున్న techniqueలతో రాస్తున్న ఆధునికథకుల (most-modern story presenters) రచనలయినా గ్లోబలైజేషన్, ఆధునికత సృష్టించిన, సృష్టిస్తోన్న అనివార్యతలను, భీభత్సాన్నీ ఒకే మోతాదులోనే శక్తిమంతంగా నమోదు చేస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే వర్తమాన కథల్లో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలూ, సంబంధాలూ ఇంకా మొహమాటానికే గురవుతున్నాయనిపిస్తోంది. ఇందులో కూడా కథకుల self censorship వుంది. రచయిత జీవితంతో సంబంధంలేని మానవ సంబంధాల చిత్రణో, రచయిత పాటించని, నమ్మని విలువలున్న పాత్రల చిత్రణో చేస్తున్నప్పుడు ఈ censorship మరింత ఎక్కువగా మొహమాటాల రూపంలో బయటపడుతుంటుంది. నిజానికి ఈ మొహమాటానికి మూలకారణం చాలా సార్లు అజ్ఞానమే. తెలుసుకోవాలని లేని తనం, చొరవలేమి లోంచే ఈ అజ్ఞానం పుడుతుంది.
Exposure వల్ల మాత్రమే ఎవరి tolerance levels అయినా పెరుగుతాయనకుంటా. అప్పుడే మన objectivity మరితం విశాలం అవుతుందనుకుంటా. నిజంగా అప్పుడే కథనంలో maturity ప్రతిఫలిస్తుందనుకుంటా. ఈ exposure ఇతర భాషల సాహిత్యానికి కావచ్చు, నాటకం, సినిమా లాంటి ఇతర ప్రక్రియలకూ కావచ్చు, కొత్త జీవనబంధనాల ఘర్షణకీ కావచ్చు. కానీ కథకులకు exposure మాత్రం అవసరం. కథకులు నిరంతరం తమకు అపరిచిత అంశాలను(unfamiliar) అనంత బాహువులతో ఆలింగనం చేసుకునేందుకు పరిశ్రమ చేయాలి, సాహసించాలి, విశాలించాలి. ఇందుకు అన్నింటికన్నా ముందు మొహమాటాలను గాలికి వదిలేయాలి. తర్వాతి తప్పు ఒప్పులను విమర్శకు వదిలేయాలి. మరక మంచిదే.
కొత్త సంఘర్షణనీ, చర్చనీ వివాదాలను, గందరగాళాలనూ అమాయకంగా, ఆత్మీయంగా ఆహ్వానించగలిగే వాతారణం, వివేకం ఇప్పుడు తెలుగు కథ మాత్రమే సృష్టించగలదని బలంగా నమ్ముతున్నాను నేను. అందులోంచయినా కొత్త కథా విమర్శ పురుడు పోసుకోవాలని కలకందాం. అలాంటి నికార్సయిన కథా విమర్శ లోంచే కొత్త సొబగులనూ, తాజా రచనా శైలులనూ, కథన దారులనూ తెలుగు కథ అద్దుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.