ఇద్దరు
రెండు అద్దాలు
ఎదురు పడితే
కోటి నువ్వుల్లో
కోటి నేనుల్లు
కింద పడితే
బింబోత్సవం
#
ఇద్దరు
వొకరు గాజు
మరొకరు అద్దం
ఒకరు చూపునిస్తారు
మరొకరు చూపిస్తారు
#
ఇద్దరు
ఒక్కే అద్దం
ఇంద్రియాలకు
అబద్ధాలూ
నిబద్ధాలూ
నేర్పించారు
#
ఇద్దరే
ఒకే గాజు
అతుకుకు భయపడి
పగలడం మానేశారు