Wednesday, December 28, 2011
వొక తల్పం ...అంతస్తులు రెండు
ఆకస్మికంగా ప్రతీక అందదు
ఇప్పటికయితే
గాలికూగు ధాన్య గుచ్చమూ
కల తిరుగు పిచ్చుక
పోనీ పునరావృతమయిన
అనాచ్ఛాదిత సంజెలు
పరస్పరం తర్ముకున్న
చలనిశ్చల అవయవాల సంభాషణ
సల్సల తోలు రక్తనాళాల బిగిదోబూచులల్లాట
జన్మాంతర దప్పికని
అంతర్జల బావుల
పూడిక తీత కూలీలయి
పరస్పరం తవ్వుకున్న
తర్వాతర్వాతర్వాతర్వాత
తూలిన గడియారపు గట్టు మీదొక
తీగల జతల తలమై
జుయ్ జుయ్ మని వెళ్తున్న
దేహమమై సమయాన
దోసిలి పడతావు కానీ
లాక్కున్న జ్ఞాపకం తగలదు
-
నామాడి శ్రీధర్
అనంత్
( 18 జూన్ 1997)
Wednesday, December 21, 2011
Next day of rest of my life
కొంచెం మత్తిలాలి
కొండలా తూలాలి
గుండెలో బాణాసంచా పేల్చాలి
నావూరి పొలిమేరల
బాల్యపు వాగులా
ఆగడం మరవాలి
వాలినా సరే
మరోసారి మనోదారిలోనే ఎదురుడాలి
పాత పరిచయంతో
కొత్త భయంలో
నైతిక కంచెల్నీ
కంకాళాల్నీ
తూచ్ అనగల గలగలల్ నే
మాలగా అల్లాలి
ఇవన్నీ ఈది
తననే చేరాలి
చెప్పాలి
విప్పాలి
లోనదంతా తోడెయ్యాలి
పోగెయ్యాలి
ప్రేమలో పడటం మాటలా మరి
మాటల్ని ప్రేమలో పడేసి
కాసేపు మనం ఎగరెయ్యాలి
కేవల చూపుల్లో మాడి మసైపోవాలి
పిచ్చి మత్తులో కళ్ళప్పగించాలి జ్వరానికి
అహానికి ఇహానికీ పుటం పెట్టేయాలి
పడాలి ప్రేమలో
ఎంత సరదా
చిన్న పరదా చీల్చాలంతే
మిరమిట్ల మనో వీణియ మెట్లు ఎగబాకి
పీల్చేసేయాలంతే
సమస్త తంత్రుల్నీ
అసంబద్ధం
ఒక అబద్ధం
యుద్ధంలో
మరియూ
ప్రేమలో
-------------
(3-feb-2008)
Tuesday, December 20, 2011
అందనివి
గిరికీలాడే
రెండు రెక్కల సయ్యాట
కంటికి అందదు
@
గుసగుసలనూ
దవ్వున రువ్వే గాను అలికిడినీ
వినేందుకు
చెవులను తర్ఫీదు చేయొచ్చును
కానీ
గరికె సవ్వుడులు
దానికెన్నడవ్వాలి
పదనిసలు
@
గింగిరాల వొత్తయిన జుత్తు
వంకీలను అందుకునేందుకు
సాచే చేతులు
వేళ్ళను పురమాయిస్తాయే కానీ
గాలిలో గమకాలాడే
సఖుల వూసుల
సయ్యాటకు సై అనలేవు
@
ఏ మూలన
ఏం కాలినా
గురుతెరిగి ఎగిరే
ముకుపుటాలు
భయానికి మాత్రం
ఇంకా
తెలియని
పుటలే
-----------------
ఇంగ్లీష్- బ్లైండ్ స్పాట్స్-
ఎకె రామానుజం
Monday, December 19, 2011
untitled
లేకుండా
పిల్లలే
నాకుంటే
బాగుండనిపిస్తుంది
నా కోసమే వున్నారనుకున్న
పిల్లలు
ఎన్నడయినా
తల్లుల్ని తలచుకుంటే
బాధేస్తుంది
పిల్లల కోసమే ప్రార్థించే తండ్రులున్నా
పిల్లలే లేరని చింతించే తల్లులున్నా
దిగులే వీస్తుంది
పిల్లలు ఎల్లల్లేని చేపలు
మరి
తల్లులయినా
తండ్రులయినా
కనగలరా
ఏ మునిమాపయినా
పిల్లల్లా
'''''''''''''''''''''''''''''''''''''''''''''
(12-dec-2004 )
Friday, December 16, 2011
ఫస్ట్ డే ఆఫ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్
యింతా చేసీ
ఈ రాత్రీ ముగించేది
నక్షత్రాలు రాలిన
మాటల రాతిరితో
ముచ్చటిస్తూనే
మవునంలో
తెరల్ పొరల్ గా
నెత్తుటి యోచన
రెక్కలేస్తుంది
లోన ఎక్కడో
ఇ
ద్దరిలో
యిసుక మేటలపై
ముప్పిరిగొన్న పసిపాదమే
జాలిగల పురా ప్రవక్త వోదార్పు
ఛిద్రమైన విలాసమూ
బీటలువారిన సంశయాత్మా
కొన సాగదూ
తలదాచుకోనివ్వదూ
సంచారీ
యిదే వేళ
వొక వృత్తం పరి పక్వమయిన ప్రతిసారీ
తొలిసారే
పాకుడు శేషం కురచ కుబ్జ కంకర
కుతంత్రం అబంధం అస్నేహం
అసంబంధనాలమీంచి
బయలుదేరాలి
వొఖడివే
ప్రతిసారీ తొలిసారిలానే
యిక
మళ్ళీ
తిరిగి
పరిసమాయత్తమవాలి
కలసి నడవడం
కలిసి రాలేదు
యిది
అశేష జీవితపు తొలిజామే
(12 january 2003 and 2011)
Wednesday, December 14, 2011
వొఖణ్ణే
దుఃఖంలో
దుర్మార్గంతో
దూరంగా
వొఖణ్ణే
చీకటిలో
చింతల్తో
శబ్దంలా
వొఖణ్ణే
దప్పికలో
ఆకల్తో
వొంటరిగా
వొఖణ్ణే
మోహాల్లో
మొహమాటాల్తో
రద్దీగా
వొఖణ్ణే
లోయల్లో
లోతుల్లో
కేకల్లా
వొఖణ్ణే
చిత్తుల్లో
మత్తుల్లో
గమ్మత్తయి
వొఖణ్ణే
కాలంతో
కామాల్లో
మొండిగా
వొఖణ్ణే
రాగాల్లో
గారంగా
పగిలినా
వొఖణ్ణే
కంచెల్లో
వంచనతో
భయంగా
వొఖణ్ణే
దారాల్లో
దారుల్తో
తప్పినా
వొఖణ్ణే
రాళ్ళలో
ప్రియురాళ్ళతో
రంజుగా
వొఖణ్ణే
దిగులుగా
పగిలినా
పలుగుతో
వొఖణ్ణే
కూడలిలో
కూటమితో
శిథిలంలా
వొఖణ్ణే
గురుతుల్లో
గాయాల్తో
కస్కసిగా
వొఖణ్ణే
మాటల్లో
బాకుల్తో
మవునంగా
వొఖణ్ణే
చరితల్లో
చిరుగుల్తో
దర్జాగా
వొఖణ్ణే
స్నేహాల్లో
హేయాల్తో
మచ్చికగా
వొఖణ్ణే
ఒలికినా
ఒరిగినా
లేచినా
పడినా
ఓడినా
వొఖణ్ణే
మళ్ళీ
వొఖణ్ణే
(21-july-2003)
Wednesday, November 16, 2011
అడొనిస్
నిప్పు చెట్టు
నదిని ఆనుకుని
ఓ చెట్టు
దాని కంటి నిండా ఆకుల బొట్లే
తీరం వెంట
ఒక్కొక్కటిగా రాల్చుతోంది
#
జ్వాల రాజుకునేది
ఈ వొరిపిడికే:
ఇది చెట్టు ప్రవచనం
నది మదికి
#
నేను ఏ చూపులకూ ఆనని
ఆఖరి ఆకును
బహుశా
నా వాళ్ళంతా
ఆనవాలే లేని జ్వాలల్లా
చని
పోయి
వుంటారు.
2
రోజులు
కనులు అలసి పోయాయి
వచ్చీ పోయే రోజులకోసం
పోయీ రాని రోజుకోసం
కనులకు వచ్చే
అలుపు కాదది
#
అయినా
ఎప్పటికీ ఇలా
రోజుల గోడలను
ఒకదాని తర్వాత మరొకటి
దాటుకు పోయే విన్యాసం
మరో ప్రభాతం కోసం
చేస్తూనే వుండాలా?
అసలు మరోసారి పొద్దు పొడుస్తుందా?
నిజంగా
మరోసారి
తెల్లవారుతుందా?
3
దారి
జీవితం పంచమని
జ్వాలనూ
మంచునూ
అర్థించాను
మంచు అక్కున చేర్చుకోలేదు
జ్వాల లీనం చేసుకోలేదు
అయినా
శిలల్లా నిటారుగా నిలిచి
పూలలా ఎదురు చూస్తూ
నా ప్రశాంత చిత్తాన్ని కోల్పోలేదు
ప్రేమలో
నన్ను నేనే కోల్పోయాను
నే కలగన్న జీవితానికీ
నే బతికిన ఓ చంచల కలకీ
మధ్య
లహరిలా... లాహిరిలా
కొట్టుకుపోతుంటే
నేను
భగ్నమై
నిరీక్షించానంతే
4
మగ కల
ఆమె అల
నేను ఆమెలా
ఆమె ముఖ చిత్రం
నా జీవన చైత్రం
ఆమె
అలా
అలలా
తీరం కనని నావలా
ముత్యపు చిప్పల అడుగున
రేవుకు తడబడిన త్రోవలా
#
ఆమె ముఖ చిత్రం
నా జీవన చైత్రం
నేను అల
ఆమె నన్ను కోల్పోయి
అలా
దీపస్థంభమై
ఎదురు చూస్తూ వుందలా
నా పిచ్చి ద్రిమ్మరి సరంగు రక్తం కోసం
5
నేలమాళిగ
మా రెప్ప పాటులో
నగరాల
మను
గడ
చింది
ముఖాల
అభిముఖాల వెనుక
మా పొలికేక:
" ప్రతి నగర శ్మశాన వాటికలో
చక్కని గుల్లల్లో
మెత్తని నత్తల్లా
వున్నాం.
నిరాకరణ నగరాల్లారా!
రండి
కనండి
కనుక్కోండి
మమ్మల్ని"
6
నిద్ర ముద్ర
ఈ రోజు
అరచేతులు చాస్తున్నాను
చావు కనురెప్పల వాలక ముందే
ఈ నేల తన సువిశాల
చర్మం కింద
నా తనువును కప్పేసి
నా చేతుల్లోనే
శాశ్వత నిద్రలోకి జారుకోక ముందే
చాస్తున్నాను
నా అరచేతులనే
The Passage Of Day and Night by Adonis (Arabic Poet)
Translated by Samuel Hazo
Friday, November 4, 2011
వన వాసి
రంగూ
వాసనా
వైల్డ్
బోర్
కొడుతోంది
*
తల్లెలో
తల్లిలా
తాళిలా
తూలి ఇలా
బోర్
వైల్డ్ గ తోచింది
*
వీగిపోయిన పల్లెలా
వీడిపోయిన పిల్లలా
బోలెడంత వైల్డ్ బోర్
చారెడంత బోర్ వైల్డ్ గ
అరగని
వైల్డ్
తరగని
బోర్
*
Sunday, October 30, 2011
ఒక మనిషి ... మరో పిట్టా... ఇంకో చెట్టూ
ఎవరో చెవులతో నివసిస్తున్నారు
ద్వారబంధాలు కూలిన అక్షరాల్లో
కూడలి గోడల
కుంగిన ఓడల మధ్య
విలాసాలను
కూడబలుక్కుంటున్నారింకెవ్వరో
విలాస పదాలే విశాలంగా లేవు
మనసే కదలదు
ఏ పదాల్లోనైనా
తిరిగి చూసే భవిష్యత్తే
గతమై అందరి ముందూ
2
ముందుకు రాని కాలం
తొడుక్కోలేని
నీ స్కూలు నిక్కరు చొక్కా
దరి చేరవు నిశ్శబ్దాలు
ఉదయాలే భయానక మౌనం
ఊపిరి ఊహలే
ఊగిసలాడే ఊలు ఊళలు
సరిపడదు ఏ సలుపూ
సరి తూగదు ఏ మలుపూ
3
చేజారే అద్దాల్లోపల
అద్దంకై వెతకాలి
చూపు మరో నేల కంటిపై
అపుడు తెరెస్తుంది
నిదురపోయే ఆకసానికీ
నిద్ర లేపే రెప్పలకీ
మధ్య ఒక చూపు
అద్దం డంబమనీ
అర్థం దాని బింబమనీ
కనుబొమన కడుతుంది
నేలా ఆనని చూపొకటి
మిణుగురుల మెరవణి నడుమ
కొనమొనతేలి నడక సాగని
ఏరుల తేరు
ఏమయ్యిందీ పాడు లోకానికి
తిరనాల జీవితాన్ని
పంచదెందుకు తలా ఇంత
4
పంచుకునే పతనమేదో
మహోన్నతం ప్రతి నిశ్శబ్దంలో
దరి ఎవరున్నారో
దవ్వున ఎవరు చేరారో
చూడలేని పతన మైత్రది
పవళింపు రాగమే మరో శోకం
ఎవరు నిద్రించారులే ఏ కలలోనైనా
ఎక్కడికి చేరామో
ఎవరికోసమో చేరేది
ఎక్కడెక్కడికో
ఎవరు చెబుతారో
వారి నాలుకపై ఉమ్మివేయండి
వారి ఉమ్మితో కన్నీళ్ళని కడగండి
మరో పిట్ట నాలుక కింద
(కొంచెం నీడ చూపించండి
కొంత నిద్ర పోయే సూర్యుడి కోసమే
జీవించే ఆశని దరి చేర్చండి)
5
తెలవారే
ఓ చెట్టుతో
చెప్పాపెట్టకుండా వెళిపోయింది ఆ పిట్ట
అపరిచితలే చెట్టూ పిట్టా
నడి ఎండలో
బడాయిపోతూ
చెట్టును బులిపించింది పిట్ట
"అతిథీ నీ పేరేంటి?"
పిట్టను అడిగింది చెట్టు
ఎగురుతూ విడిపోతూ
రెట్టిస్తూ వెళిపోతూ
చెట్టుపై రెట్ట వేసి చెప్పింది పిట్ట తన పేరు
"'పాట"
సాయం సంజెలో
వాలింది మళ్ళీ పిట్ట
రెమ్మల నీడల చీకటిలో
రెక్కలు ముడుచుకుంది చలిలో
దాచుకుంది బిక్కచచ్చి
హోరుగాలిలో
కొమ్మలు అల్లాడుతుంటే
రెమ్మలు చెల్లాచెదురవుతుంటే
బెంగగా పిలిచింది పిట్టని చెట్టు
"పాటా"
పిట్ట పలకలేదు
చెట్టు నిదుర పోలేదు.
6
మరలిన మౌనపు మాటలకేం తెలుసులే
మాసిన మోసపు మూస మూతల మోహాలు
ఖండిత జ్ఞాపకాలే
రేపటి జ్ఞాపికలు
ఎటో చేరిన చెట్టులో
ఏ కొమ్మ ఏ పిట్టదో
ఎవరకి మాత్రం తెలుసు
పదాల పెదాల్లోని కీటకాలుల
ఏ పిట్ట నోటికో
ఎప్పటికీ చెప్పొద్దు
కలలోని కీటకాల్నీ తినే పిట్టని చూడాలి
పిట్టల్ని తినే స్వప్నాన్ని చూడాలి
స్వప్నాల్ని ఆరగించే మనుషులే
ఇప్పుడు లేరు
ఇక పుట్టరు
7
మనిషి వెతుకుతున్నాడు
ఎడారిలో పిట్టను
పిట్ట నిరీక్షిస్తోంది
నింగిలో మనిషి పాదముద్రల కోసం
చెట్టు కనుల కాయలుకాసింది
వాలే పిట్ట ఆనవాలుకు
*
-ఎం ఎంస్ నాయుడు
అనంతు
Tuesday, October 25, 2011
చెదిరిన కూటమి
మేం తయ్యారు
మాకు ఇల్లేదో చూపించారు
అతిథి అనుకున్నాడు:
చల్లగా వుండాలి
నీ లోన మురికి వాడలేవో
@
చర్చి లోపల
వికల విశ్వాస బాహువు చుట్టూ రజనులా
పాల తెలుపులో
స్తంభాలూ
విలువంపులో కట్టిన సరంబి
@
చర్చి లోపల
భిక్ష పాత్ర వొకటి
నేల నుంచి అమాంతం లేచి
బల్ల ముందు తేలియాడుతుంది
@
అయితే చర్చి గంటలే
నేల మాళిగలో
పీతి నాళికల్లో
ఎపుడేం చెయ్యాలనుకున్నా
ఖంగ్ మంటాయి
@
నిద్రలో నడిచే
నికోడిమస్
దారిలోనే వున్నాడు
చిరునామా వైపే అడుగులేస్తూ
మరి ఎవరి దగ్గరుంది చిరునామా?
తెలీదు
కానీ అక్కడికే
మా ప్రస్థానం
-------------------
"The scattered congregation"
english-robert bly
swedish- Tomas Transtromer
Wednesday, October 19, 2011
అయినా సరే
తమవి తప్ప
తక్కినవేవీ పట్టని మూర్ఖులు
ఒక పద్ధతీ పాడూ వుండదు.
తలా తోకా వుండదు
పోనీలే
వాళ్ళను క్షమించేసేయ్
@
నువ్వు జాలి, దయ చూపితే
జనం నిన్ను స్వార్థపరుడని అనుకోవచ్చు
నీవు ఏదో ఆశించి అలా చేస్తున్నావని
లేని పోనివి నీకు ఆపాదించి
నిన్ను నిందించనూ వచ్చు
అయినా సరే
చిటికెడు కరుణ పంచు
@
విజయం నిను వరిస్తే
కల్లబొల్లి నేస్తాలూ
కపటి శతృవులూ
నీ పంచన చేరుతారు
ఆరునూరైనా
ఓడలు బండ్లయినా
ముందుకే నడు
@
నువ్వు
నిజాయితీగా ముక్కుసూటిగా
అడుగులేస్తున్నప్పుడు
జనం నిన్ను
నిలువునా ముంచేస్తారు
అయినా సరే
తడబడకు
తగ్గకు
@
ఏళ్ళ తరబడి నువ్ నిర్మించుకున్నది
ఏ ఆగంతకులో
రాత్రికి రాత్రే
కుప్ప కూల్చేయవచ్చు
పోతే పోనీలే
కట్టడం మాత్రకు మానకు
@
నువ్వు నిలువెత్తు
నవ్వు పువ్వులా వుంటే
జనం నిను చూసి
అసూయ పడొచ్చు
కానీ
నీ నవ్వు మాత్రం చెరగనీకు
@
నేడు నువ్వు చేసిన మంచిని
జనాలు
రేపటికే మర్చిపోవచ్చు
అయినా నువ్ మంచిని మరువకు
@
ఈ లోకానికి
నువ్వు చేసేది ఏపాటిదో
అయినా సరే
చేయడం మానకు
@
ఇదంతా
నీకూ నాకూ మధ్య జరిగే విషయం అనుకునేవు
ఇది
నీకూ
దేవుడికి మధ్య వ్యవహారం
-
మదర్ థెరిస్సా
Tuesday, October 11, 2011
అరిగిలి దుఃఖం
మే నెలలో
ఓ వెన్నల రాత్రి
తీరం వెంట నడక
వెండి రంగులో గడ్డీ, పూలూ
అయినా ఆకు పచ్చని వాసనే
*
కారు చీకటి రాత్రి
కొండవాలుకు మారింది
కాలినడక
జాబిలిని చూపుతున్నట్టు
తెల్లని రాళ్ళు
*
ఆ వ్వవధిది
కొద్ది క్షణాల దూరం
58 సంవత్సరాల విశాలం
*
నా వెనుక
అలలపై
పసి కిరణాలకు అటు
ఆవలి తీరం
అక్కడే పాలకులు
*
అక్కడే
ముఖాలకు బదులు
భవిత వున్న జనం
-
స్వీడిష్ - టోమస్ ట్రాన్స్ ట్రోమర్
(2011 నోబుల్ సాహిత్య విజేత)
ఇంగ్లీష్ అనువాదం - మైఖేల్ మెక్
(గొండోలా అంటే చేత్తో చేసుకునే అరిగిలి లేదా తెప్ప. వెనిస్ నగరంలో తొమ్మిది వేర్వేరు కలపలతో గొండోలాను చేసుకుంటారు.వివాహం, అంత్య క్రియలకు గొండోలాను వాడతారు.
Monday, October 10, 2011
హక్కు
అన్నిఅసేంద్రీయ విశ్వ విద్యాలయాల్లోని శాఖోపశాఖలన్నింటినీ గంపగుత్తకింద కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చారట. ఏ ఎండకా గొడుగు కామన్ సిలబస్ విడివిడిగా చెప్పేందుకు కష్టమైపోయి. ఇప్పుడు కొత్త శాఖకు కొత్త పేరు పెట్టేందుకు మల బద్దకమేసి ముద్దుగా పురావస్తు అని వ్యవహరిస్తున్నారు. అలా నామకరణం చేసిన తర్వాత మధ్యయుగాల శిలాజాలపైన యుపిఎస్ సి లోకల్ శాఖ పెట్టిన చైల్డ్ ఫ్రెండ్లీ పరీక్షలో మెదటి పది ర్యాంకులు ఎప్పటిలాగే గొడుగు యూనివర్సిటీ అమ్మాయిలవే. వాళ్ళలో ఏడుగురు ఆసిడ్ దాడికి గురైన వాళ్ళున్నారు. ఇక పద కొండో ర్యాంకు నుంచి ఇరవయ్యో ర్యాంకు వరకు ఆసిడ్ దాడులు చేసిన మన యూతే కావడమే తమాషా. వాళ్ళలో ఇద్దరు కన్నవారిని గొంతు నులిమి చంపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తక్కిన వాళ్ళలో మరొకడు రిజల్టు వచ్చిన ముందు రోజు రాత్రే ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.
అతని చనిపోక ముందు ఒక ఉత్తరం రాసాడు అందమైన దస్తూరీతో. ఆ ౩౩ పేజీల ఉత్తరం లో వున్న లక్ష వాక్యాలు ఒకేలా వున్నాయి.
ఆ ఆకతాయి రాసిన ఉత్తరంలోని వాక్యం ఇదీ.
"నా చావుకు నా తల్లిదండ్రులు, మాగురువులు, మా ఇటు అటు పక్కింటి వాళ్ళూ, వాళ్ళ బంధువులూ, ఇంకొంత మంది(అంటే షుమారు వంద కోట్ల మంది) పురమాయించారు."
ఇప్పుడు ఈ కేసులన్నీ త్రీ టౌన్ కమ్మ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుల వల్లే వెలుగు చూసాయి.
అదే కొసమెరుపు.
ఆ రిపోర్టులే ఇప్పుడు చాలా కీలకం.
అయితే ఎవరికీ రానన్ని కష్టాలు ఒక్క పోలీసులకు మాత్రమే రావడం చాలా అన్యాయం.
ఇంతకీ విషయమేమిటంటే ఆ నివేదికల్లో ఒకటి కన్నీళ్ళు పడి, మరొకటి రక్తం మరకలు పడి కీలకమైన నాలుగు లైన్లు కనిపించకుండా పోవడంతో పోలీసుల అసలు కష్టాలు మొదలయ్యాయి.
ఇప్పుడు కన్నీళ్ళ తడిపిన ఆ లైన్లు, రక్తం చిమ్మిన ఈ లైన్లు చదవకపోతే కేసే పక్క దారి పట్టే ప్రమాదం వుంది.
కన్నీటి గురించి చిలకజోస్యం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రక్తం గురించి హస్త సాముద్రిక శాఖ తాపీగా సమర్పించే పంచరత్నాల గురించే ఇప్పుడు అందరి బెంగా. ఆ తర్వాత విచారణ జరిగితే గిరిగితే కుమ్మరి వీధి కోర్టు జడ్జి షణ్ముఖ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల యావజ్జీవ విలాసవంత కారాగార శిక్ష విధించే అవకాశం వుందని www.కాపు సత్తా బ్లాగ్ స్పాట్ డాట్ క్రై లో సభ్య సమాజం చదవలేని లిపిలో జికె శాస్త్ర్రి అనే అనామక బ్లాగర్ ఎవరో కుమ్మేసాడని గుసగస.
ఇక ఇంకో విద్యార్థికి తక్కిన పరీక్షలతో పాటు జెండర్ పరీక్షలూ నిర్వహిస్తున్నట్టు వినికిడి. అయినా మ్యాటర్ ఎటూ తేలనట్టే లెక్క. తేలినా నిండా మునిగినట్టే.
@
మళ్ళీ అలజడి పెరిగిపోతోంది. జ్వరం రగిలిపోతోంది.
కంపరం రెండింతలవుతోంది.
టీవీ జర్నలిస్టుల ఆకలి చావులు అంతకంతకూ పెరిగిపోతున్నాయని, డెత్ టోల్ మినిమం యాభై వేలని అన్ని టివీల్లో ఒకటే స్క్రాలింగ్.
మల్టీ నేషలన్ కంపెనీలన్నింటికీ ఉప్పు కారం పైన పదకొండు వైవిధ్యభరితమైన పేటెంట్ హక్కలు దక్కాయని బ్రేకింగ్.
ఎటియం కార్డు కొన్న వారికిచ్చే రాయితీలు రాబోతున్న వరదకాలపు రాజ్యసభ బడ్జెట్ గలాటాల్లో భారీగా తగ్గబోతున్నాయన్న పుకారు భగ్గుమంది.
ఈ పుకారుకు స్పందించిన రెడీమేడ్ నిరసకారుల ఆవేశానికి ఆహుతైన జనాల్లో నెలకు ౩౩ వేలు సాలరీ వచ్చే వలస కూలీలే ఎక్కువ మంది అట. దాదాపు ఈ దాడుల్లో 356 మంది మృత్యువాత పడ్డారని మరో తిరుగులేని వార్తా కథనం. ఎన్నడూ ఎలాంటి ఎమోషన్ కూ గురి కాని మిస్టర్ తెల్లతుండు వాగ్గేయ TV95లో ఊగిపోతూ సైగలు చేసి మరీ చర్చ గెలిచి అక్షరాల ఐదు వేల రూపాయల ప్రైజ్ మనీ ఎగరేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ...
"పరిస్థితి ఎంత విషమించిందో మీరు ఇట్టే ఊహించుకోవచ్చు" అని లైవ్ కెమెరాలో చెప్పాడు.
సాఫ్ట్ వేర్ ప్రొఫషనల్స్ గత రెండున్నరేళ్ళ నుంచీ తమ జన్మ హక్కులా జరుపతున్న కరువు దాడులను సమర్థిస్తూ గే క్లబ్ వాళ్ళు లింగాయతుల హైకోర్టులో వాదించి కేసు గెలిచారు. అయితే ఈ తీర్పు చెల్లదని మరో తెలుగుదేశం జడ్జి ఏక పక్షంగా కొట్టపారేశాడట. దీన్ని కూడా సవాలు చేస్తూ లైసెన్స్ డ్ ప్రాస్టిట్యూట్స్ ముందుగా కింది కోర్టులో , ఎందుకయినా మంచిదని సుప్రీం కోర్టు లో పోలీసు ప్రయోజనాల వ్యాజ్యం వేసారట. వ్యాజ్యాలతో తగవు ఎప్పటికీ తీరదన్న నిరాశకు గురైన న్యూ డెమొకసీ రెవెల్యూషనరీ అలయెన్స్ పాలిట్ బ్యూరో సభ్యుడిగా లొంగిపోక ముందు చిలిపి పని చేసిన జడ్జి సాగర్ అలియాస్ ధర్మన్న అలియాస్ గంగులు ఆత్మ హత్య చేసుకున్నాడు.
దాంతో ఇటు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, అటు లైసెన్స్ డ్ వేశ్యలూ ముక్త కంఠంతో గర్జించారిలా...
"మా బతుకు రెంటికి చెడ్డ రేవడి అయ్యింది బాబయ్యా."
వాడెక్కా!
ఇట్లా ఆహ్లాదంగా ఎవురన్నా సరే చించుకుని పొలికేకలు పెడితే 108 సైరన్ లాగా సమ్మగా వినిపిస్తుంది మనసుకు.
*
ఇప్పుడు జ్వరంతో పాటు కల మొదలైంది. కల కాదు కలలు.
"Power is like a violin. It is held by the right hand and played by the left".... అని గణేష్ బీడీ రెడాక్సైడ్ లో ముంచి మా ఇంటి ఎదురుగా వున్న కూలిన గోడపైన ఎవరో ఎడమ చేత్తో రాస్తున్నట్టు కల.
యిలాంటదే ఇంకో కల.
కల లోపల కల పోలిన మరో కల. కలగలసిన కల.
కకావికలమైన కల కలం.
కలం చితికిన కాలంలో ఈ కల.
అలజడి...జ్వరం...కలవరం...
సడన్ గా ఫోన్ మోగుతోంది.
రింగ్ టోన్ అలవాటయినదే. పైగా అసైన్డ్ టోన్ అది.
మోత. ఎలా పెరిగిపోయిందంటే నా చెవులు ఆ డెసిబెల్స్ ని గుర్తించలేనంత.
కర్ణభేరి కనీసం నూరు సార్లు చిట్లిపోయేంత మోత.
Lift man... take my call- అంటున్నట్టు వుంది రింగ్ లోన్ హోరులో కొట్టుకుపోయిన ఆకుపచ్చని నినాదంలాంటి అవతలి గొంతు.
కలకు అడ్డం తగులుతున్న రింగ్ టోన్ మోత. కల కంటిన్యూ కాకుండా మోత.
కళ్ళు తెరుచుకోవడం లేదు.
నా రెప్పల్ని ఎవరో ఫెవికాల్ తో అతికించారు.
కల కుదిపేస్తోంది.
ఆ ఫోన్ మోత నా వంట్లోని శక్తినంతా పీల్చేస్తోంది స్లోగా.
ఎందుకు నా చెయ్యి ఫోన్ దగ్గరికి పోవడం లేదు.
ఎందుకు నాకు మెలకువ రావడం లేదు.
ఠప్ మని కళ్ళు తెరుచుకున్నాయి.
అర గంట నుంచి నా మెదడు పంపుతున్న సంకేతాలు నా కంటికి చేరకుండా దారి మళ్ళిస్తున్నారెవరో.
ఎవరు?
హమ్మయ్య ! ఇప్పుడు సిగ్నల్ అందింది.
కళ్ళు తెరుకున్నాయి.
ఫోన్ ఇంకా మోగుతోంది.
చుట్టూ చూసాను.
షిట్! అది నా ఇల్లు కాదు.
అంటే ముందు రోజు రాత్రి కూడా నేను నా ఇంట్లో పడుకోలేదా?
ఎవరో లిఫ్ట్ ఇస్తే ఇలా ఈ నగరంలో రోజుకో ఇంట్లో పడుకుంటున్నానా?
మరి నాకు రోజూ లిఫ్ట్ ఇస్తున్నది ఎవరు?
ఫోన్ ఇంకా తెగ మోగుతోంది.
నగరంలో అందరూ పడుకునే వున్నారు ఎప్పటి లాగే పట్ట పగలు.
నాదే కాదు అందరి ఫోన్లూ మోగుతున్నాయి. మోత మూడింతలు దద్దరిల్ల్లు తోంది.
బహుశా నేను ఆ క్షణం ఫోన్ ఎత్తక పోతే ఆ రింగ్ ఆగిపోయేదేమో.
బహుశా అదే ఆఖరి రింగ్ అనుకుంటా.
ఎత్తేసేయాలి. ఎలా?
ఓసినీ మెదడూ సంకేతాలు పంపు... చేతులు వెయిట్ చేస్తున్నాయి.
మోత కాదది ఝంఝ.
కాదు కాదు గర్జన.
వసంత కాల మేఘ గర్జన.
ఫోన్ ఎత్తేసాను.
ఎలా ఎత్తానో హేతువుకు అందలేదు కానీ ఫోన్ ఎత్తేసాను. చివరి రింగుకు నానో సెకను ముందు.
ఛ! అది ఇన్ కమింగ్ కాల్ కాదు.
"హలో"
ఇంత సేపూ అవతలి వాయిస్ హలో అంటూనే వుందా?
నీ యబ్బ! అయితే నేనే చేసానా ఫోన్. ఛ
ఒక్క కల చిందరవందర చేసింది.
ఒకే ఒక్క చెత్త కల. రాకూడని కల. రావద్దనుకున్నా వచ్చి కమ్మేసింది ఆ కల.
"హలో" అనేసాను.
ఒక్క సారి దిమ్మ తిరిగిపోయింది.
అసలు ఫోన్ ఎందుకు చేసానో గుర్తు లేదు.
అసలు ఫోను నేనే చేసానో లేదో కూడా తెలియదు.
ఏ మవుతోంది నాకు.
"హలో" అంటోంది ఇంకా అవతలి గొంతు.
బహుశా నేను మాట్లాడకపోతే ఫోన్ కట్ అయిపోయేదే.
"సార్ వున్నారా?"
ఏం అడగాలనుకున్నాను? ఏం అడిగాను? ఏం అన్నానో తెలీదు.
"బాలగోపాల్ ఇప్పుడే స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాడు"
అపుడపుడే తెలవారుతుంటే హాయిగా వినిపించింది ఆ గొంతు.
*************************************************
Monday, September 26, 2011
ఊరూ...వాడా...బతుకూ
పుస్తక పరిచయం
"మీరు చరిత్ర రాయడం మానేసి గ్నాపకాలు రాయండి" అని.
"నీవన్నంత సులభం కాదు వాటిని విడదీయడం" అన్నట్టు నవ్వారు. ఆయన అవేవీ రాయలేదు తన శతపత్రంలో.
మరోసారి కలిసినపుడు మళ్ళీ నిలదీసాను.
"ఎన్నని రాస్తాం"- అని పెదవి విరిచారు.
"ఏది రాయకూడదనుకుంటున్నారు మీరు" - అడిగాను
సమాధానంగా అద్భుతమైన అనిక్ డోట్స్ చెప్పారు.
"రాయండి ఇవన్నీ"- అన్నాను.
"ఓపిక లేదు. అనుకున్నదే రాయలేకపోతున్నాను"-అని తన పెన్షన్ క్లియరెన్స్ కోసం రాసిన పేద్ద ఉత్తరం ఇచ్చారు.
అలా శతపత్రంలో రెక్కలు తొడగని గ్నాపకాలెన్నో.
ఆ శతపత్రం తర్వాత దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ఈ శ్వేతపత్రం చదువుతుంటే బిగ్ ఫిష్ సినిమా గుర్తుకువస్తుంది.
ఈ రెండు కథల్లాంటి ఆత్మల్లో అదొక్కటే పోలిక.
గడియారం రామకృఫ్ణ శర్మ లోకానికి తన శ్వేతపత్రం సమర్పించక ముందే అతని జీవితానికి వేల రెక్కలు తొడిగిన కమలమ్మ సెలవంటూ వెళ్ళిపోయింది.
తెల్లారిన వేళ పొడిచిన చందమామతో మొదలై కలికి గాంధారి వేళ విరిసిన కమలంతో ముగుస్తుంది దేవులపల్లి కృష్ణమూర్తి గాధ. అక్కడా ఇక్కడా రెక్కల లెక్క మాత్రం వందే. ఆ వందే మా తరమ్ కాదు.
@
ఇది పితృస్వామ్యం. కాబట్టే నేను సీమవాసిని అయ్యాను. కానీ ననుకన్న గొట్టుముక్కుల సామ్రాజ్యలక్ష్మిది కొల్లాపురమే. తల్లి తెలంగాణ. పిత్రార్జితమే రాయల .... సీమ. మగ్గాల లడీల మారు మోతల నడుమ గడిచింది కోడుమూరులో నా బాల్యం. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు వరకు నేశోళ్ళే నా నేస్తులు.
కొత్త సామాజిక బాధ్యత నెత్తిన వేసుకున్నట్టు పోజు కొట్టే చాలా మంది ఆత్మకతాత్మక రచయితల్లా కాకుండా నింపాదిగా, నిమ్మలంగా, సాదాసీదాగా పూసగుచ్చినట్టు గ్నాపకాలను గుర్తుకు తెస్తున్న కొత్త నేస్తమే ఈ దేవులపల్లి కృష్ణమూర్తి.
@
గూగుల్ సెర్చ్ లో అస్సలు దొరకదీ గుల్ మొహర్ గ్రామం. పేరు అనంతారం. మొదటి పేజీ మొదలు పుస్తకం తిప్పుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో దాసరి రాములు తన లోగొంతుకలో సన్నగా సందమామను పొడిపిస్తాడు. అదీ పొదలపొదల గట్ల మీంచి. అంతే... అక్కడి నుంచి మీకు పలు పాటలు రాసిపెట్టి వున్నాయి ఈ పుస్తకం నిండా.
పాటలే.. పాటల్.
@
బొట్ల బొట్ల చీర కట్టి మగ్గం ఆడిస్తూ కాపోడు అయిన తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకునేందుకు బోనగిరి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడకు రైల్లో వెళ్ళి కలిసే ప్రియురాలి నోస్టాల్జిక్ బాట ఒక పాట.
తనతో నడిపే ప్రతి యవ్వారానికి ఒక రేటు పెట్టే ఒక జాణ పాటలో టారీఫ్ ని తారీఫ్ చేయకుండా ఎలా వింటాం?
నల్లది, పొట్టిది అయిన ఇంకో నల్ల పిల్ల(తమిళ అర్థంలో) -హమ్ కాలే హై తొ క్యా హువా దిల్ వాలే హై-అంటూ ఇంటికి ఇన్ వైట్ చేస్తుంది. ఎంటైస్ చేస్తుంది పాట పాడి మరీ...
@
బుర్రకథ, బాగోతాలు, కలుపు పాటలు, అలుపు రాకుండా రోకటి పాటలు, నిద్ర రాకుండా జాగారం పాటలు, కవ్వించే పాటలు, అణచుకున్న కోర్కెను మనసారా కైగట్టే పాటలు, పాటలే పాటలు... గాజులోడి పబ్లిసిటీ పాటలు, గాజుల కోసం పడిగాపులు కాసే అమ్మాయిల పాటలు...
ఓహ్ కృష్ణమూర్తీ నీ పాటల్....
ఆలస్యంగానయినా పాడుతున్న అరుదైన, అపురూపమైన నీ పాటే ఈ పుస్తకం.
గ్రామాల గురించి మూల మూలనా మూరలతో కొలిచినట్టు, జాడలతో తూచి నట్టు ఈ 70+కృష్ణమూర్తి తన బాల్యం గురించి నిన్న అన్నంత తాజాగా స్వ్కేర్ ఫీట్ బై స్వ్కేర్ ఫీట్ కైకట్టడం రేర్ ఫీట్.
ఇది పక్కా రెవెన్యూ వ్యూ.
పల్లెల్లో కులాలు, వాటి కింది కులాలు, వాటి ఆశ్రిత కులాలు, వాళ్ళ పని విభజన. శ్రమకు విలువ చెల్లించే ఆచారాల్లాంటి బాధ్యతలూ... చిన్న చిన్న వివరాలు. చీకూ, చింతా, పస్తూ తెలియని బతుకుల పల్లె ఇంతలా తెలిసిన మాతృమూర్తి... కృష్ణ మూర్తి.
@
ఆంధ్రా నుంచి వలస వచ్చిన ముస్లిం అమ్మాయి, పైగా పిల్ల తల్లి; ఆపై చెప్పేది ఝాన్సీ లక్ష్మి బాయి బుర్రకథ. ఆమె కథ చెప్తే అది మెగా సినిమానే. ఈమె గ్నాపకం కృష్ణమూర్తిని చాన్నాళ్ళు వెంటాడింది. ఆ పిల్ల అందం ఒక తియ్యని గ్నాపకం కృష్ణమూర్తికి.
ఇక కుడుముల పండుగకూ కుక్కల కడుపు నిండటానికీ వున్న సింబయాటిక్ సంబంధం ఒక కదిలించే గ్నాపకం.
పదో తరగతి పిల్లల పైనే పోలీసు కేసుండే మరో గ్నాపకం.
ఓహ్ ఏం కాలం. ఏమీ లేమి విద్యార్థి వుద్యమం?
బొగ్గు బస్సూ, నీడల తోలుబొమ్మలు ఆడించే బుడగ జంగాలు, ఉర్దూలో మూలికలు అమ్ముకునే వాడూ.
అలా అమ్ముకోడానికి తెలుగులో తర్జుమా చేసే ఇంకోవాడూ.
ఆ నడి రోడ్డుల దవాసాజ్ ఒక మధుర గ్నాపకం.
ఇంత మామూలు గ్నాపకాలు కూడా ఇంత బలాదూర్ గా బందిస్తాయని తెలియదు నాకు ఇంతక ముందు. కవితలు, కథలు, నవలలు ఎవరైనా రాస్తారు.
కానీ, కానీకి కొరగాకుండా పోయాయనుకున్న ప్రతి గ్నాపకాన్నీ అద్భుతంగా ఇలా రాసే నేర్పు తెలిసిన యువ రచయిత కృష్ణమూర్తికి పేరా పేరానా పడి పడి పదివేల దండాలు.
ఈ ఊరు, ఈ వాడా, ఈ బతుకూ నాలో చెలరేపిన గ్నాపకాలెన్నో.
@
మూడో తరగతిలో ఆలూరులో ఆరుబయట రాత్రిపూట రెహమాన్ సర్కస్ చూసిన గ్నాపకం. టాకీస్ లో కృష్ణమూర్తిలా నాటకం చూడలేక పోయాను. కానీ ఆలూరులో గోవర్థన టాకీసులో చూసిన సింహబలుడు నా తొలి సినిమా గ్నాపకం. కోడుమూరులో పరప్ప జిన్నుకు ఎదురుగా చేలలో తెల్లార్లూ ఆడిన చింతామణి నాటకం కొంచెం సేపే చూసి నిండా పడుకున్న గ్నాపకం. నాటకం అయిపోయిన మరుసటి రోజు మల్లె పూవులా మా ఇంట్లో తిరుగుతున్న బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్ర్రిని రాత్రి చింతామణిగా పోల్చుకోలేని గ్నాపకం.
నేషనల్ పేనసోనిక్ టు ఇన్ వన్ లో తొలిసారి కుంతీ విలాపం పద్యాలు, వర విక్రమయంలో కాళింది, కమలల డైలాగులు, సిలోన్ నుంచి మీనాక్షి పొన్నుదురై, గౌరీ మునిరత్నం దయతలచి వినిపించిన పాటలు నా బాల్యపు గ్నాపకాలు.
@
మరాఠీలో మాట్లాడుకుని , కాఫీ అమ్ముకునే రంగ్రీజోళ్ళ గురించి ప్రస్తావిస్తాడు కృష్ణమూర్తి. మా కోడుమూరులో కూడా ఈ రంగ్రీజులుండే వారు. వాళ్ళను మేం రంగరాజులు అనే పిలిచే వాళ్ళం. ఈ కుటుంబాలు కూడా బట్టల వ్యాపారం చేసేవారు. కాఫీ అమ్ముకునే వారు. అయితే షోలాపూర్ నుంచి వచ్చిన వీళ్లను ఖత్రోళ్ళు, దగుడోళ్ళు అనికూడా అనే వాళ్ళం. వీళ్ళలో కొంత మంది కంసాలి పని కూడా చేసేవాళ్లు. ఇంకొంత మంది దర్జీ పనినే చేసే వాళ్ళు.
@
ఇక సైన్ బోర్డులు, అంగళ్ళ మీద చేతి రాతలు, గోడల మీద చేతి ప్రకటనలు రాసే పెయింటర్ ఎం.హెచ్.కె గురించి కృష్ణ మూర్తి ఆప్యాయంగా రాస్తాడు. ఈ ఎం.హెచ్.కె ఎవరో నాకు తెలియదు. కానీ ఎం.హెచ్.కె లాగే సంతకం పెట్టిన మా మాస్టర్ విజయకుమార్ నాకు బాగా గ్నాపకం వచ్చాడు ఈ పుస్తకం చదువుతుంటే.
@
కర్నూలు జిల్లాలో మంత్రాలయం నుంచి శ్రీశైలం వరకు కనిపించే అన్ని సైన్ బోర్డులపైనా ధగధగ మెరిసిన పేరు ఆర్ట్ బై మాస్టర్. మాస్టర్ కుంచె నుంచి ఏ కళాఖండాలూ జాలువారలేదు అప్పటి టాబ్లాయిడ్స్ లో రాసి వార్తలు వార్చేందుకు. మాస్టర్ అని సంతకం చేసే అతని అసలు పేరు విజయ్ కుమార్. అతను దళిత క్రిస్టియన్. మాల. టెలిఫోన్ ఎక్సేంజిలో ఆపరేటర్. మా శేషఫణి బాబాయికి బాల్యపు జిగిరి.
మాస్టర్ మా జిల్లాలో ఎన్నో పెళ్ళిల్లను ఘనంగా, వైభవంగా, మధురంగా తీర్చి దిద్దిన ఫోటోగ్రాఫర్ కూడా. ఈ ప్రకాశ్ ఆర్ట్స్, ఇజ్రా బోర్డుల గుత్తాధిపత్యం, దాన్ని కూడా మింగేసిన ఈ ఫ్లెక్సీలు, ఆ వినైల్ షీట్లు రాకముందు మాస్టరే మెగాస్టార్ మా జిల్లాలో.
దళితుడైనందుకు ఉద్యోగం చాలా సార్లు పోగొట్టుకున్నాడు.
క్రైస్తవుడు అయినందుకు కర్నూలు జిల్లా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటి అనే వన్ మ్యాన్ ఆర్మీని కర్నూలు జిల్లా ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా నడిపి అనేక సార్లు ప్రాణాలు పోగొట్టుకున్నంత పనిచేసుకున్నాడు.
మాస్టర్ విజయ కుమార్ దగ్గర నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను.
మాస్టర్ సైన్ బోర్డులపై చేసే సంతకం వెనుక ఒక కత వుంది. తర్వాతే అది నాకూ తెలిసింది. బోర్డులపైన బై మాస్టర్ అని చేసే సంతకం లోపల ముగ్గురు కళాకారులు దాగి వున్నారు. ఒకరు మాస్టర్ విజయ్ కుమార్. రెండు- మాస్టర్ కి ప్రాణ నేస్తుడయిన గిడ్డయ్య. మూడు- మాస్టర్ తమ్ముడు సుకుమార్. రెండు సందర్భాలలో మాస్టర్ అన్న సంతకాన్ని విజయ్ కుమార్ కాకుండా తక్కిన ఇద్దరు చేసేవాళ్ళు.
సందర్భం-1
ఆర్డర్లు ఎక్కువై మాస్టర్ మరీ బిజీ అయిపోతే అతనికి ఆసరాగా ఆ బ్రాండ్ నీడను చల్లగా చూసుకునేవారు మిగతా ఇద్దరూ-ఎక్కువ సార్లు గిడ్డయ్య, అప్పుడప్పుడు సుకుమార్.
సందర్భం- 2
మాస్టర్ విజయ్ కుమార్ కు తరచూ ఉద్యోగం ఊడేది. లేదా ట్రాన్స్ఫర్ అయ్యేది. మాస్టర్ కు విపరీతమైన ఆత్మాభిమానం. పైగా ఆర్టిస్టు. ఆపై అనార్కిస్టు. చాలాసార్లు తనపై అధికారులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద బుక్ చేసి కులం పేరుతో తనపైనా, తన సాటి దళిత సిబ్బందిపైనా కులం కుళ్ళు జోకులు పేలుస్తూ, బూతులు తిట్టే వాళ్ళకు చెక్ పెట్టేవాడు. ఉద్యోగం వదిలి కోర్టుల చుట్టూ తిరిగి ఆ కేసులు గెలిచి కాలర్ ఎగరేసేవాడు.
అలా ఉద్యోగం ఊడటానికీ, కాలర్ ఎగరేయడానికీ మధ్య కాలంలో మాస్టర్ మరేమీ చేసేవాడు కాదు. తన తరపు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి తన కేసు ఎలా గెలవచ్చో, ఎందుకు గెలవాలో లాంటి విషయాల్లో తర్ఫీదు ఇస్తూ బైబిల్ కొటేషన్లను అలవోకగా అరువు ఇచ్చేవాడు. సరిగ్గా ఇలాంటి క్రాప్ హాలిడేలోనే గిడ్డయ్య తన స్నేహాన్ని మాస్టర్ సంతకం పెట్టి చాటుకునేవాడు. అంత వరకూ అల్లరిగా తిరిగే సుకుమార్ కూడా ఇల్లు గడవడానికి మాస్టర్ కి ఘోస్టయ్యేవాడు.
మా జిల్లాలో సైన్ బోర్డుల్లో ఇప్పటికీ చెక్కు చెదరని సంతకం, వ్యక్తిత్వం- మా మాస్టర్ ది. కృష్ణమూర్తి గుర్తు చేసుకున్న ఎం.హెచ్.కె నాకు మాస్టర్ ని గుర్తుకు తెచ్చాడు. గ్నాపకాలు చెప్పుకునేందుకే కదా మనందరికీ ఒక నికార్సయిన సందర్భం కావాలి. అది ఇచ్చినందుకు కృష్ణమూర్తికి కృతగ్నతలు. అంతకు మించి ఇలా నా మాస్టర్ విజయ్ కుమార్ గురించి ఈ నాలుగు స్క్రీన్ ప్రింట్లు ఎక్స్పోజ్ చేసుకునేందుకు వెతుక్కోకుండానే ఒక మంచి సందర్భం ఇచ్చినందుకు కృష్ణమూర్తికి నమస్కారాలు.
@
ఈత రాని తన దోస్త్ రెహమాన్ ని దొరోరి బావిలో కృష్ణమూర్తి ఎలా కాపాడాడో చెప్పినప్పుడు నాదీ ఒక గ్నాపకం చెప్పాలనిపిస్తోంది. నేనూ, శశి, ఖదీర్, ఉమ, విష్ణు, చిట్టి బాబాయ్(సత్య శ్రీనివాస్) తారామతి బిరాదరిపైన గ్రూప్ డాన్స్ వేసి గండిపేట చెరువుకెళ్ళి టెమ్ట్ అయ్యి ఈతకు దిగాం. గండిపేటలో అక్కడ, అప్పుడు ఈత నిషేధం. ఈత రాని విష్ణు నీళ్ళలోకి దిగలేదు. రాకున్నా ఖదీర్, శశి, చిట్టి దిగి తడిసారు. వస్తుందని దిగిన ఉమకు నీళ్ళలోకి దిగిన వెంటనే తెలియని భయమేదో వేసి తడబడ్డాడు. అప్పుడే ఈత కొట్టి ఒడ్డుకు వచ్చాను నేను. అప్పటికే ఉమ నీళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయి కసిబిసి అయిపోతుంటే అదంతా ఆట అనుకుని పెద్దగా స్పందిచలేదు ఒకే ఒక్క ఈతగాడినైన నేనూ. గండిపేటలో ఉన్నట్టుండి లోతు ఎక్కువవుతుంది. ఉమ మునిగి పోతున్నాడు. అరుస్తున్నాడు. అదంతా ఆటలో భాగమే అనుకున్నాం అప్పటికీ అందరం. గారడీ వాడు కత్తి సాము చేస్తూ పొరపాటున కత్తి నెత్తికి తగిలి తల తెగి పడినా చప్పట్లే కదా కొడతాం. అలాగే వుండింది మాకూ ఆ రెండు క్షణాలు. కాని విష్ణుకు విషయం అర్థం అయిపోయింది. నేను వెంటనే నీళ్ళలోకి దూకి ఉమను గడ్డకు తీసుకువచ్చాను. ఉమ ప్రాణాలు కాపాడి హీరోనయ్యాను.
ఈ గ్నాపకాన్ని నాలో ట్రిగ్గర్ చేసింది కృష్ణమూర్తి ఫ్రెండ్ రెహమానే. ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతమే అని అనిపించవచ్చు. కానీ ఇలాంటి గ్నాపకాలను తీసి పారేయలేం. చెరిపేయనూ లేం. గొప్ప మలుపులూ, మైలురాళ్ళూ కాకపోయినా ఇవన్నీ బతికిన క్షణాలే. ఈ ఎరుక తన పుస్తకమంతా పరిచిన కృష్ణమూర్తికి సవినయ సలాములు.
@
ఇక గాలి పతంగుల గ్నాపకం.
ఓహ్!
ఈత తర్వాత తలచుకుంటేనే నా అణువణువూ పుకించేది గాలిపటాలకే.
ఒక్క కోడుమూరులో వున్నన్ని గాలిపటాలు మళ్ళీ నేనెక్కడా చూడ్లేదు. చూడలేను. గాలి పటం అన్న పదం కర్నూలు టవున్లో కూడా ఏకవచనమే. అంతా ఒకే రకం. ఆకారం చతురస్రం.
టెక్స్ట్ బుక్కుల్లో బుక్కయిన ఈ గాలిపట విశేషం పేరు మా కోడుమూరులో బుడ్దంగి. ఇదే కాక ఇంకా బుర్ బుర్ పటాకి, నక్షత్రం పటాకి, మనిషి పటాకి, చామంతి పటాకి, సూపర్ కాయితం పటాకి..... ఇవన్నీ ఎంతెంత పెద్దవో... ఎంతెంత ఎత్తుల్లో ఎగిరేవో.
వీటికి సరిపడా తోకలు కట్టడం, అవి ఎగిరేందుకు చక్కని సూత్రాలు వేయడం ఒక సైన్స్... ఒక కళ.
అందుకే గాలిపటానికి బహువచనంలా వుండేది మా కోడుమూరు ఆకాశం. అదీ సంక్రాంతి ముందు. ఎక్కడా మాంజా అన్న మాట కానీ , కటీ అన్న పదం కానీ తెలియని స్వచ్ఛమైన గాలిపటాల ప్రదర్శన కోడుమూరు. పరుల గాలిపటాలను కటీ చేసి చప్పట్లూ, కేరింతలూ కొట్టడం కోడుమూరుకు తెలియదు.
నేను ఆ ఊరిని అలా చూడనూ లేదు.
ఎగరేసిన గాలి పటానికి క్యాండిల్ కట్టి పైకి పంపించి ,రాత్రంతా గుంజకు కట్టేసి పొద్దునే పళ్ళు కూడా తోముకోకుండా ఇష్టమైన నేస్తం ముఖం చూసినట్లు మురిసిపోవడం ఒక్కటే తెలుసు మాకు. గాలిపటాలు అవంతటవే ఏ అవాంతరమో, మరే సాంకేతిక లోపమో వచ్చి తెగిపోవాల్సిందే.
తెంపడం తెలియని బాల్యం మాది.
అలా తెగిపోయిన గాలిపటాలన్నీ మా సద్ద సేన్లో దొరుకుతాయి.
అని అబద్ధం చెప్పింది మా నాన్నే.
తను నా జీవితం నుంచి తెగిన తక్షణం కోడుమూరి సద్దసేనికి వెళ్తే నాన్న ఒక కనిపించని గాలిపటం.
అందమైన వేర్వేరు ఆకారాల్లో సగర్వంగా, సమున్నతంగా గాలిపటాలను ఎగురవేసేది ఎక్కువగా నేసోళ్ళే కోడుమూరులో. అయితే మేదరోళ్ళ దగ్గర ఎలాంటి వెదురు బొంగు బద్దలు తెచ్చుకోవాలి, వాటిని ఎలా కోయాలి, ఎలా కట్టాలి, ఎలా కాయితాలు మూయాలి, ఎలాంటి రంగుల కాయితాలు అద్దాలి, వాటికి ఎలాంటి సూత్రమేసి బుర్ బుర్ మనిపించాలి అన్న మర్మాలను నాకు నేర్పింది మాత్రం అన్ని గాలిపటాలతో పాటు సద్ద సేన్లో కనిసించని మా నాయనే.
నేసోళ్ళ గాలిపటాల నైపుణ్యానికి సవాల్ గా వుండేది మా నాన్న గాలిపటాల పనితనం.
@
ఈ పుస్తకం ఒక మంచి village ethnography study కి మేలు నమూనా. కేంద్రీకృతకం అయిపోయిన విశ్వవిద్యాలయాల్లోని ఏ కల్చరల్ ఆంత్రొపాలజీ విభాగంలోని ఏ ఎం.ఎన్.శ్రీనివాసన్ లాంటి బోధకులకూ బోధపడని, తెలియని రాత పద్ధతి కృష్ణమూర్తిది. గోల్డు మెడలల్లో వేసుకునే ఆ విద్యార్థులు పొందాల్సిన తక్షణ తర్ఫీదు ఇదీ. టేకింగ్ సైడ్స్ల్ లో చాలా dispassionate గా వుంటూనే చెప్పే పద్ధతిలో విపరీతమైన passion కురిపిస్తాడు కృష్ణమూర్తి. Anthropology లోని observer-participant method కు applied అచ్చుపోత ఈ రచన. మహా ఘటనలను కూడా చాలా మామూలుగా matter-of-fact గాచెప్పి పాఠకులకూ. ఘటనకూ మధ్యవర్తిత్వం, సూత్రధారకత్వం (ఒక ఎరుకతో) మానిన అరుదైన రచనా శైలి ఇది. పాఠకుడికి ఎలాంటి దిశానిర్దేశం అవసరం లేదిలాంటి చారిత్రక జీవిత ఘటనా సమాహారాన్ని చెప్పుకొచ్చేటపుడు. పాఠకులు వట్టి చవట దద్దమ్మలనుకునే మేధావి రచయితలకు నివాళి ఈ శైలి. ప్రతి వచనం పుస్తకం నిండా తాజాగా, చాలా నేల బారుగా, నిటారుగా, సాదాసీదాగా కృష్ణమూర్తిలా పాండిత్యంతో ఎలాంటి దుప్పటి పంచాయితీలు లేకుండా సాగిపోతుంది. మాట అలవోకగా కదులుతుంది.
ఇది రచయితకు రమారమి 19 ఏళ్ళు నిండినపుడు ఆగిపోయే గ్నాపకాల కదంబం. అసలు 19 ఏళ్ళకు ఇంత విస్తారమైన జీవితం, అనుభవం, విపులమైన గ్నాపకం ఎలా సాధ్యం? ఎవరైనా ఎలా వడుకుతారిలా?
@
కొన్ని గ్నాపకాలు మరిచిపోవడానికి గుప్పెడు గుళికల్ని మింగుతుంటాం. ఇంకోసారి గుర్తు తెచ్చుకోడానికి పిడికెడు గ్నాపకాలు కూడా మిగిలి వుండవు వెనక్కి చూసుకుంటే. కొన్నింటిని రబ్బరు పెట్టి అదేపనిగా చెరిపేసుకోవాలనీ అనుకుంటుంటాం. మరి కొన్నింటిని ఆల్కహాలిక్ డిమెన్షియాలో, ఏజింగ్ అమ్నీషియాలో, అల్జమీర్ రోగాలో, ఏ గాలో మింగేస్తున్న ఈ కాలంలో ఇసుకలో మేలు రకం రేణువులను పోల్చుకోగల నిపుణతతో గతాన్ని సైకత శిల్పంగా మలిచే ఈ మెలకువ ఎప్పటికొస్తుందో నా మటుకు నాకు.
కతకూ, నవలికకూ, నవలకూ- అసలు మనకు తెలిసిన సకల కాల్పనిక రచనా స్వరూపాలకూ అంతుపట్టని , లొంగని ఇట్లాంటి పోగులు పెట్టే సృజన శైలులకు మనం నిజంగా రుణపడి వుంటాం కథా.
-
Tuesday, September 6, 2011
కలనయినా శిలనైనా
శిల మొలక
కలువ
కలువ యిక
కొలను కౌగిలిలో
@
మరి నేనే కొలను అయితే
కొలను
ఒడిలో కలువ
యిక
కలువ
శిల శిలువ
-
(original
so chong-ju
korean poet
english title- if i became a stone
english version-david r.mccann)
english version
If I became a stone
If I became
a stone
stone would become
lotus
lotus,
lake
and if I became
a lake
lake would become
lotus
lotus,
stone.
Sunday, August 7, 2011
కెంపు
గుండెలో
అలజడులు అడుగులేస్తుంటే
బతికి వున్నట్టే నువ్వు
చూపులో స్వప్నాల మిణుగురులు
రెక్కలల్లార్చుతూ వుంటే
బతికి వున్నట్టే నువ్వు
ఝంఝా మారుతాల నుంచి
స్వేచ్ఛను గురుతెరుగు
సంద్రపు అలల నుంచి
స్రవంతి నేర్వు
జీవితపు అనుక్షణాన్నీ
అనంత బాహువులతో పిలు
కాలపు న్రతి కదలిక ఒక మొదలు
నీ కనుపాపల్లో
అనూహ్యత ఉరకలేస్తుంటే
నువ్ బతికి వున్నట్టే
గుండెలో
అలజడులు అడుగులేస్తుంటే
బతికి వున్నట్టే నువ్వు
(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం-నాలుగు)
Saturday, August 6, 2011
నలుపు
దుఖపు మేఘం కమ్మేసినా
ఎపుడు బాధల నీడ పరుచుకున్నా
ఎపుడు కన్నీరు రెప్పలదాకా ఉబికినా
ఒంటరిదై మనసు ఎపుడు గాభరా పడినా
రోదిస్తావెందుకని
ఓదార్చాను హృదయాన్ని
అయినా ఇదే లోక రీతి
ఈ నిశి ఏకాకి సమయాలను
కాలం పంచేసింది
కాసిని నీకూ
కాసిన్ని నాకూ
కొంచెం దిగులు నీ వంతూ
వెలుతురు కొంచెం నా వంతూ
అయినా ఎందుకు కన్నీరు
హృదయమా
ఇవి నీ బతికిన క్షణాలు
మరి మరి
కోల్పోతావెందుకు
రెప్పపాటులో నవ రుతువు
మరి
రెప్ప చాటున కన్నీరెందుకు
(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం-మూడు)
తెలుపు
కళ్ళలో తళుకుమంటుంది
ఎపుడైనా
నీ నుంచీ
నా నుంచీ
మాటలు అరువడుగుతారు
అవి తొడుక్కుని
పెదాల దాకా రెక్కలల్లార్చి
పెగిలిన గొంతును
కౌగలించుకుందామని
ఒకటి మాత్రం నిజం
అనుభవం
పల్లవించాలి
గాలిలో సోలిన గంధం
గమకమై పరిమళిస్తుంది
ఆ కబురు నీకు చేరుతుంది
ఆ ఆనవాలు నాకు అందుతుంది
లోకం నోట కూడా దాగదు
మరి ఇదేం రహస్యం
(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం-రెండు)
నీలం
ఘనీభవించిన నీలం
నీలి నీలి ఈ మవునాలూ
ఎక్కడా నేల ఆనదు
నింగి ఆనవాలూ లేదెక్కడ
ఉసురుసురంటున్న రెమ్మలూ ఆకులూ
గుసగుసమంటున్నాయి
ఇక్కడ
నువ్వొక్కడివే వున్నావని
నేనొక్కడ్నే
నా శ్వాస
నా గుండె లయ
ఈ తీక్షణతల్లో
ఈ ఒంటరి తనాల్లో
నేనే
ఒఖడినే
నా వునికిపై
నాకే
గొప్ప నమ్మకం కుదిరింది
(జిందగీ న మిలేగా దొబారా
ఫరాన్ అఖ్తర్ గాత్రం, జావేద్ అఖ్తర్-పద్యం 1)
Monday, July 4, 2011
ఇద్దరే
రెండు అద్దాలు
ఎదురు పడితే
కోటి నువ్వుల్లో
కోటి నేనుల్లు
కింద పడితే
బింబోత్సవం
#
ఇద్దరు
వొకరు గాజు
మరొకరు అద్దం
ఒకరు చూపునిస్తారు
మరొకరు చూపిస్తారు
#
ఇద్దరు
ఒక్కే అద్దం
ఇంద్రియాలకు
అబద్ధాలూ
నిబద్ధాలూ
నేర్పించారు
#
ఇద్దరే
ఒకే గాజు
అతుకుకు భయపడి
పగలడం మానేశారు
Saturday, June 18, 2011
వెన్నెలలో
సుమాల నడుమ
చషకంతో
వొంటరిగా
సేవిస్తూ
జాబిలిని అడిగాను
జత కట్టమని
చషకం
చషకంలో తేలియాడే
నాదొక్క
జాబిలిదొక్క బింబం
మేం ముగ్గురం... అంతే!
అరెరే
జాబిలి తాగలేదుకదా అని చింతించాను
నా నీడ అలా ఖాళీగా
నాతో అడుగులేస్తూ వుంది
అనంత మౌనంతో
సఖులెవ్వరూ లేరు సమక్షంలో
ఈ ఇద్దరి సావాసంలో
లేమి దిగులూ లేదు
యీ వుత్సవ కాలంలో
నేనూ నను చేరిన వారితో
సంబరించాలికదా
చల్లని వెన్నెలలో పాడుతుంటే
జాబిలి జత కట్టినట్టే వుంటుంది
నేనాడితే
నా నీడ నాతో సయ్యాడుతుంది
మందుకు ముందు
జాబిలి
నీడలే
నా సఖులు
మత్తెక్కిన మరుక్షణం విడిపోతాం
అయినా సరే
ఏ లౌకిక రాగ ద్వేషాల ఛాయ సోకని
వీళ్ళిద్దరే
నాకత్యంత యిష్ట సఖులు
బహుశా
ఒక నాటికి
పాలపుంతల లోపొరల్లో
మేం ముగ్గురం
మరోలా
మళ్ళీ కలుస్తాం
-లీ పో
(ఇతను క్రీస్తు శకం 701-762 మధ్య జీవించిన చైనా కవి)
Saturday, June 11, 2011
Hard Habit
under the sky
lets write a sweet lore
every moment is a great feeling
when you are here in my heart, darling
when I am low
you are
the dearest one to take
I swear on you,
you are
the hardest habit to break
Monday, May 23, 2011
Tale of Gundelakka
By now, you must be curious to know who this Gundelakka, my alleged harlot, is.
I must tell you about her, but remember, this is my childhood story.
*
I went to our farm lands carrying the food that my sister Rani had packed for our parents. I and my sister Rani attended half-day school in the morning. After that, my sister's duty was to cook and pack the food, and mine, to take it to the night guards at the farm and my parents. The farm land that I am talking about is about three furlongs away from my street. Elders in our community volunteered to guard the land, staying there at night, especially just before the harvest, fearing theft of fodder and produce by men from the Boya community. Our land was on the way to the farms of the Boyas and remote too. Anyone could get away with whatever they wanted if the farm was left unguarded. And Boyas are notorious bastards! It doesn’t matter if you are a rich landlord or a poor farmer, Boyas simply take away everything that they see.
*
On one such evening, I headed to our farm carrying food. As I crossed Ramulamma temple, entered the oddevallu pass and was nearing saviti senu, an idea flashed in my mind. I took the pinjari senu route, thinking that it was a shortcut. I managed to pass through sekanna's senu. Then only did I realise that I had lost track and missed the bogappa senu route. I had to go on as I was unaware of the route I was passing through that evening. I crossed maddikera hillock and reached Nancharla station. It was twilight by the time I managed to get to our farm and I was tired. My parents were busy clearing jowar stalks in the farm. They both jumped at me as if they were waiting for me for ages.
"You stupid boy! How did you turn up this way?" mother yelled.
"I lost track and fumbled on my way, mother," I explained.
"You could have come straight, why did you fumble? Don’t you know the route?" father asked.
"My thought of taking a shortcut from saviti senu landed me in trouble, father," I explained.
"It is as simple as crossing bogappa's farm; why did you take that route at all?" father continued quizzing.
"Father, I told you I lost my way," I reiterated.
"Now I understand you, it is not about losing your way, it is your age, which is the root cause of all these diversions and shortcuts. Anyhow, did you manage to meet your harlot Gundelakka?" father probed, adding satire to his queries.
I could not take this heckling from my father. In an instant, I fell down, yelled like hell and sobbed.
"Get up idiot, Enough of your dramatics; do not take not your father's comments seriously," cribbed my mother and ordered me to take the utensils and go home before it was too late.
I had thought otherwise. I had expected mother to give some dried grains as remuneration for my spectacular performance so that I could buy enough puffed masala rice.
"Aha! my street-smart boy, do not think that we are unaware of your matters. We know your love escapades well. The secret affair between you and Gundelakka is no longer news. We know about your daily visits to your lady love. Before we knew this, we were both clueless, we did not understand why our boy looked agitated and absent-minded. We now know that Gundelakka kicked you with her left leg when you knocked at her door at a wrong hour," said my father, breaking into laughter, this irritating me to the core.
Since the day my dad coined my nickname – the gigolo of Gundelakka. It spread like wildfire in no time and everybody in my village began calling me that. I wept a lot when people on the roads cut jokes and passed nasty comments on me, and later learned to keep quiet.
When somebody asked me whether I was the paramour of Gundelakka, I would sport an emotionless face and say "Yes" in helplessness.
"What was today's special dish on her menu," one prankster on the roadside asks me.
"She cooked a variety of special dishes including kheer, sweet pancakes, stuffed brinjal curry with mirchi soaked in butter milk," I replied, extempore without hesitation.
Another enthusiast asked me "Where did you sleep with her?"
I had an immediate answer for each of such queries.
I also used to improvise a nice cock-and-bull story every time.
But who is this Gundelakka?
Till I was thirty, I didn’t know the answer myself.
One fine day, thinking that it was high time that I know who Gundelakka was, I finally asked my mother.
"She is the one and only fashionable and most sexiest woman Nemakallu village ever saw," mother said. "She was picture-perfect, a stunning black beauty. Words could not describe her grace. Masculine in built, her nose as straight as a lily stalk. She could finish her work, I am told, before ten men put together, finished theirs. And during functions like marriages and other community gatherings ,she was notorious for drinking a bucketfull of kheer at one go. She never spared any man who tried to cross paths with her. She would catch his hair and beat him up. And when it comes to loyalty, the entire community put her on par with Sita. All these features made her a legend in the village. When she was in her thirties, her husband passed away. Against all odds, she not only raised her children but also laboured to get fifty acres of land. Now she is no more. She is remembered as a great icon. This is all I know about her through the age old tales that passed through generations in this village's memory," my mother's narration halted.
I cribbed, "Enough is enough, don't make me fool again. So, Gundelakka is no more, but I am still her gigolo. Is this what you are trying to tell me?" I was both agitated and laughing at the same time when I questioned my mother.
"I feel that everybody here is cheating on me," I screamed.
" Enough is enough."
You must be wondering, why on the one hand I told you that I had met Gundelakka and on the other, that she is no more.
It is true that when I was on my way back home from the place where oxen are slaughtered, I met Gundelakka.
It is also a fact that Gundelakka died long ago. The Gundelakka I have spoken of through my mom's memory and my village's legend is not the one I met.
The Gundelakka who is long dead belongs to the Pinjara community, and the Gundelakka I know is from my community, the Madigas.
I will tell you something about Madiga Gundelakka for your clarification.
The Madiga Gundelakka I know is neither Gundelakka nor an aged woman. She is a ten year old girl . Her real name is Mallakka. Her grand father Siddhiramappa is a highly renowned person in our cluster of villages. He is the busiest man in the entire Aloor taluk. What I tell you now happened during Siddhiramappa's youthful days.
Young Siddhiramappa roamed around the cluster of villages to find a suitable girl for wife. It seems that seven pairs of chappals wore away during the search. No one came forward to give his daughter in marriage to Siddhiramappa. The reason was that enquiries about Siddhiramappa's roots revealed that he was the son of a basavi. As his paternal parentage was unknown, nobody came forward to give him their daughter in marriage. Adding to his woes, his mother died when he was just a child, and he had faced hardships all his young life.
At last, a match was fixed from a village that lay to the west of our cluster. The village head then raised an objection, saying it was not possible for a girl to marry a Madiga man who had no working relationship with the village community. Later, the elders themselves came out with a solution. For a year, Siddiramappa should serve the kapu community in the village; till such time the elders would request the girl to wait for him. This twist in the tale was the begining of bad days for Siddhiramappa. He worked day and night in the pedda Reddy's community as a wage labourer, and in the process gained their confidence. He became expert in making chappals. The chappals he made were the most sought after in the village. People said that the footwear that Siddiramappa made were as neat and unblemished as a plain mirror. Soon Siddiramappa became the brand designer, not just in footwear making, but in other leather works too. In a year's time, he had become famous among the 33 Reddy families that he served. On coming to know about his extraordinary workmanship, people in and around 7 villages came forward with dozens of marriage proposals.
Mallakka is the daughter of Siddiramappa's son Narayana. Mallakka spoke well. Her concern for the family was unparalleled. She was a multi-faceted personality and a great taskmaster; From dawn to dusk she meticulously did all the domestic chores and in the evening, carried food to the fields. Considering her tenacity, people in the village often said that Mallakkka should not have been born in the Madiga community. If she was born in the dora's community, she would have ruled a kingdom. By now you must be knowing that the Madiga Gundelakka I met is this Mallakka. And my so-called harlot Gundelakka, whom I have never seen, died long ago.
*
Do I need to tell you that my father was a joker?
One day Mallakka was passing our street. "She looks just like Gundelakka,” my dad comented.
That was the end of it. From that day onwards, Madiga Mallakka became Gundelakka. Mind you, even today, I am called Gundelakka's paramour. This is how it became one of my nicknames. This is the story behind my nickname.
I have lots of other nicknames. I am ready to tell you about all of them, are you ready to listen ?
(Telugu: Nagapparaju sundara raju madiga)
(The Oxford Univeristy Press is soon publishing an antnhology of dalit stories of AP. This piece is part of it)
Sunday, March 27, 2011
లోయ గాలి పాత జీవితం
అన్నీవెంటాడుతూనే వుంటాయి
కాలం కామం కాకుండా పోయిన పుప్పొడీ
చైతన్యం
చొచ్చుకువచ్చిన పారదర్సకతా
తనను తానూ తన్మయంగా చూస్తూ కబోది ఐన చూపూ
వసంతం
పరదాలు
పదాలు
పడిగాపులూ
బూడిద రంగు చేతొడుగులూ
మరకలు
గరికపైన కుప్ప కూలిన మనో ధూళి
భస్మం రాల్చిన పరిచయాలూ
నీ నా మధ్య ఎగసిపడిన కీర్ర్తి కెరటాలూ కిరీటాలూ
చితికిన దృశ్యాల జనాయసయపు కల
జ్వర రాత్రుల పీడ కల
జోస్యపు నురగ
గాలి కతల నేతగాళ్ళ కంఠోపాఠాలూ
కాలి పేరుకు పోయిన కరపత్రాలూ
వెలిసి పేలికలైన ముదురు ఎరుపెరుపు జెండాలూ
చెల్లా చెదురైన సముద్రాలూ
గోడల వెల్ల వెనుక మరుగైన నినాదాలూ
కోరలూ గోర్లూ మొలిచిన బంధాలూ
మాసిన ఊసులూ మాయమైన పాద గురుతులూ
చితికిన మాటలూ
చితికి ఎక్కని స్పర్సాలూ
ఉరీ ఉచ్చూ కంచే హద్దూ పద్దూ గానుగెద్దు పరిభ్రమణాలూ భ్రమణాలూ
అకసేరుకాలూ నత్తలూ గుల్లాలూ
మచ్చిక కాని పెంపుడు కుక్కల్లాంటి పేర్చిన పుస్తకాలూ
మానని గాయాల్లాంటి పేలని యవ్వనలూ
అన్నింటికీ మించి
కుదురెరిగిన బతుకూ
దాని సాకులూ
సంజాయిషీలూ
వెంటాడుతూనే వున్నాయి
(సెప్టెంబర్, పన్నెండు, పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది- vaartha, srushti )
Friday, March 25, 2011
ఒక్ఖన్నే
దుర్మార్గంతో
దూరంగా
ఒక్ఖన్నే
చీకటిలో
చింతల్తో
శబ్దంలా
ఒక్ఖన్నే
దప్పికలో
ఆకలితో
ఒంటరిగా
ఒక్ఖన్నే
మొహాల్లో
మొహమాటాల్తో
రద్దీగా
ఒక్ఖన్నే
లోయల్లో
లోతుల్తో
కేకల్లా
ఒక్ఖన్నే
చితుల్లో
మత్తుల్లో
గమ్మత్తై
ఒక్ఖన్నే
కాలంతో
కామాల్లో
మొండిగా
ఒక్ఖన్నే
రాగాల్లో
గారంగా
పగిలినా
ఒక్ఖన్నే
కంచల్లో
వంచనతో
భయంగా
ఒక్ఖన్నే
దారాల్లో
దారులతో
తప్పినా
ఒక్ఖన్నే
రాళ్ళలో
ప్రియురాల్లతో
రంజుగా
ఒక్ఖన్నే
దిగులుగా
పగిలినా
పలుగుతో
ఒక్ఖన్నే
భద్రాల్లో
భస్మాల్తో
బల్లెంలా
ఒక్ఖన్నే
కూడలిలో
కూటమితో
శిథిలంలా
ఒక్ఖన్నే
గురుతుల్లో
గాయాలతో
కస్కసిగా
ఒక్ఖన్నే
మాటలలో
బాకుల్తో
మవునంగా
ఒక్ఖన్నే
చరితల్లో
చిగురలతో
దర్జాగా
ఒక్ఖన్నే
స్నేహాల్లో
హేయాల్తో
మచ్చికగా
ఒక్ఖన్నే
ఒలికినా
ఒరిగినా
లేచినా
ఓడినా
ఒక్ఖన్నే
ఒక్ఖన్నే
ఒక్ఖన్నే
(-జూలై-ఇరవై ఒకటి - రెండు వేలా మూడు)
శ్యూన్య తేకే శురూ
తిరిగీ నలిగీ అక్కడికే చేరడం
ఎప్పటికప్పుడు
మళ్ళీ మొదలవడం
@
నాలుగ్గువ్వలు వుండేవీ
ఈ నగరంలో
తలో చెట్టును వదిలి
నదినీ తల్లినీ
ప్రేయసినీ
#
తడిసిన రెక్కలతో
తటపటాయింపులు లేని
పటాపంచల పాటలు పాడాలనుకున్నాయి
$
పరధ్యానంలోనే గడిచింది జీవితం
అపర పరాజితై కూలుతోన్న కాలంలో
&
పరాధీనమైన దైనందినం
అన్యాకాంతమైపోయిన జాగా
%
దేనిపైనా పిర్యాది లేకపోవడం దుర్మార్గం
!
ఒక సంభాషణా
ఒక సాయంత్రమూ లేక
తెగిన తీగల దగ్గిర
ప్రసారం కోసం పడిగాపులు కాచీ
చని
పోయిన
ఆ గువ్వల
సమాధుల పైన
పరకల మధ్యా
" వచ్చి వెళ్ళిన వారు
అసలు రానట్టే
మరెవల్లూ పూడ్చలేని ఖాళీ
గుండెల్లో గుచ్చి వెళ్లక పోతే "
ఎక్కడ్నించి వచ్చామో
తిరిగీ నలిగీ అక్కడి నుంచే
మొదలవడం
౧
పశ్చాత్తాపమా
ప్రాయహ్చిత్తమా
(ఏడు మే తొంభై తొమ్మిది)
పుట్టిన రోజే
పూలకు మారుగా
నినాదాలు పేర్చి
మరికొందరు
కాసిన్ని మెట్లూ
ఖాళీ చేతులూ
ఖాళీ నవ్వులూ
చూపించలేని
అత్యంత ఆప్తులు
ఇంకొందరు
గయరు హాజరైనారు
నన్ను మీటని
గీతాలాపనల హోరు మధ్య
చూడండి
ఇంకొందరెలా
నిశ్సబ్దంగా
నీడల్ని
నాటి
వెల్లిపోతున్నారో
-పంతొమ్మిది మే ౧౯౯౭
Wednesday, March 23, 2011
aphorisms
రెండు కోవలు.
ప్రియు రాళ్ళూ
రప్పలూ
సిగరెట్
భస్మమై
కాలి రాలిన కాలపు
మారు మిత్రుడు
మిత్రుడికి మారు
పూలు
కోయనూ లేను
ఏరనూ లేను
చీకటి
అలసిన జాబిలి
అనుమతితో
చేరగిలడం
Tuesday, March 22, 2011
మరిజా మెవ్ ఫాదూ
ఇప్పుడు పోర్చుగీసు లో (అంటే మన బుడత కీచు అన్న మాట) ఫాదూ సంప్రదాయం లో పాటల నిప్పులు చెరుగుతున్న రవ్వ పేరే మరిజా. ఫాదూ సంప్రదాయంమన గజల్ సంప్రదాయానికి చాలా దగ్గరగా వుంటుంది. గజల్ మాదిరిగానే ఫాదూ లో కూడా ఒక అంతర్లీనమైన దుఖపుజీర ప్రాణ వాయువై పారుతుంది. ఫాదూ సంప్రదాయం లో పాడే వాళ్ళను ఫాదిస్తా అంటారు. నా మనసు దోచిన ఫాదిస్తా పేరే మారిస్సా లేదా మరిజా. వీలయితే విని పరవసించండి. అర్థం కాకున్నా పంబ రేగుతుంది.
కింద వున్న నేగ్రో పాట మరిజా వాళ్ళ నానమ్మ కోసం రాసి పాడింది.
barca negro
São loucas! são loucas! loucas...Eu sei, meu amor,Que nem chegaste a partirPois tudo em meu redorMe diz que estás sempre comigoEu sei, meu amor,Que nem chegaste a partirPois tudo em meu redorMe diz que estás sempre comigoDe manhã, que medo, que me achasses feia!Acordei, tremendo, deitada na areiaMas logo os teus olhos disseram que não,E o sol penetrou no meu coraçãoMas logo os teus olhos disseram que não,E o sol penetrou no meu coraçãoVi depois, numa rocha, uma cruz,E o teu barco negro dançava na luzVi teu braço acenando, entre as velas já soltasDizem as velhas da praia que não voltas:São loucas! loucas...Eu sei, meu amor,.... .... ....No vento que lança areia nos vidros;Na água que canta, no fogo mortiço;No calor do leito, nos bancos vazios;Dentro do meu peito, estás sempre comigoNo calor do leito, nos bancos vazios;Dentro do meu peito, estás sempre comigo( solo )Eu sei, meu amor,.... .... ....
Friday, March 18, 2011
కబీరు పదాలు
కొమ్మ చివర
మునికాళ్ళలో స్వరం నింపి
ఆకుతో ముచ్చటించింది
మాను ఇలా
పత్రమా!
విను నా మాటల శాఖను
చిగురు నవ్వు
పూలు రాలు
మాను మేని రీతి ఇదే
#
అహం
పొగరు రాలితే
చిగురు
రగిలే ఎద నది
ఎండితే
సత్య ప్రవాహం
#
అనంతం
ధనం
యవ్వనం
వచ్చి ఖర్చు అవుతాయంతే
...
మంది మంచి
నీ విడిది ఐతే
అనంతం
నీ సంతకం
#
గమనం
ఇహం సుఖం
మది యోగం
లోక రీతి
కాల గమనం
నోటికి చేరేది కొంత
పంటికింద రాయి
కొండంత
#
బడాయి
పెదవి వెడల్పూ
నాలుక పొడవూ
శ్వాస లోతూ
అంతా అహంకారం
బడాయి రద్దు
వజ్రానికి సాన పట్తేన్తవరకూ
ఓర్పే
మెరుపు తురుపు
#
బోధి
పండితుడికి
కబీర్
ఏం నేర్పగలడు?
కబోది
ముందు
బోధి నృత్యం
#
అహం
అహం మాను
తేనె పలుకు
హృదిలో మిత్రుడు
మదిలో శత్రువు
మను
కాను
మాను
కానీ
మనమే కదా
#
ఓర్పు
నేలన పార
చెట్టున కొడవలి
పార, కొడవలి కలిసి
గొడ్డలి విసిరినా
నేర్వాలి
నెల నుంచి ఓర్పు
చెట్టు నుంచి ఓదార్పు
#
నది
మది శుప్త నది
సప్త పది
మది
నిరంతర చిరంతన
మది లిహం
రెక్కలల్లర్చినా
వివర్ణం కారాదు
జీవితం
#
Saturday, February 26, 2011
Friday, February 18, 2011
subterfuge
of humenbeings,
man is the weaker gender
to the core,
for all the hegemony attached to
masculinity
is only a
subterfuge
born out
of his
lacking the
decisive womb
(eighth-feb-twothousand-nine)
Tuesday, February 15, 2011
ముబారక్
ఊపిరి పుట్టుక
ఉరకలే వేరు
అది మరి నది మది
నదీ పారివాహిక ప్రాంతమే నాగరికథ
*
ఊపిరి పిడికిలి తెరిచేందుకు
ఉరకలు పిడికిలి బిగించేందుకు
కన్న కాలం
రెండు నదులు మూడు పదులు
*
తహరీర్
నువ్ ఇప్పుడు కూడలివే కాదు
కూతురివీ
కన్న తల్లివీ
విసిరేయబోతున్న రాయి చేతి చిరునామా
రాతి గాయం కూడా నువ్వే
తహరీర్
కలిసి రాని కాలంలో
నువ్వే కన్న
నడిచే పసికందుకు
ఆయువు నవ్వు నువ్వు
రువ్వు
*
రెండు నదులు
మూడు సుడులు
తొలికేక
యోమే పైదాయిష్ ముబారక్
తహ్రీర్ ముబారక్
*
(ముబారక్!
ఇక నీకు నిండా
నూరేళ్ళూ నిండాయి)
*