Tuesday, February 15, 2011

ముబారక్

ఊపిరి పుట్టుక

ఉరకలే వేరు

అది మరి నది మది

నదీ పారివాహిక ప్రాంతమే నాగరికథ

*

ఊపిరి పిడికిలి తెరిచేందుకు

ఉరకలు పిడికిలి బిగించేందుకు

కన్న కాలం

రెండు నదులు మూడు పదులు

*

తహరీర్

నువ్ ఇప్పుడు కూడలివే కాదు

కూతురివీ

కన్న తల్లివీ

విసిరేయబోతున్న రాయి చేతి చిరునామా

రాతి గాయం కూడా నువ్వే

తహరీర్

కలిసి రాని కాలంలో

నువ్వే కన్న

నడిచే పసికందుకు

ఆయువు నవ్వు నువ్వు

రువ్వు

*

రెండు నదులు

మూడు సుడులు

తొలికేక

యోమే పైదాయిష్ ముబారక్

తహ్రీర్ ముబారక్

*

(ముబారక్!

ఇక నీకు నిండా

నూరేళ్ళూ నిండాయి)

*

No comments: