Monday, July 19, 2010

జయ 'ప్రభ' లేని అనుక్షణ ప్రయాసం

(జయప్రభ వ్యాస సంకలనం క్షణ క్షణ ప్రయాణం పరిచయం )

#
ఇదొక చెత్త పుస్తకం. సాహిత్యంలో ఇలాంటి అభిప్రాయాలను అహంకారంగా అపార్థం చేసుకునే ఆచారం చెత్తంత పాతది. పాతుకుపోయినది. ఇక పుస్తకం రచయిత్రిది అయితే అహంకారానికి ఆటోమాటిక్ గా 'పురుష' అన్నది ప్రిఫిక్స్అయిపోతుంది. ఒక్క వాక్యానికి వివరణ, ఆధారాలు ఇవ్వడానికే పుస్తక పరిచయం.
#
నేను సాహిత్య
పేజీ చూసుకునే రోజుల్లోనో నాకు పుస్తకం చిక్కి వుంటే '' అల్ప సంక్యకులుగా మిగిలి పోయిన అగ్రహారసంస్కృత పాటకుల కోసం జయప్రభ రాసిన క్షణ క్షణ ప్రయాణం వ్యాస సంకలనం అందింది.'' అని రాసి ఊరుకునేవాడినిమొహమాటానికి.
కాని ఇప్పుడు ఇలా చేసే పరిస్తితి లేదు. కనుక ఇది ఎంత చేత్తదో, ఇందులో ఎంత శాతం చెత్త వుందో నిరూపించాల్సిన అగత్యంఏర్పడింది.
#
పట్టుమని పది వ్యాసాలు చదివే సరికి నేను
అడ్డంగా మోసపోయానన్న సంగతి పదింతలుగా స్పష్టమైపోయింది . జయప్రభ హాఫ్ బేక్ద్ మరియు వస 34 మోతాదు మించిన వ్యాసాలను పద్యాలుగా ప్యాక్ చేసి మన ముక్కులు పిండి అక్షరాలా 200 రూపాయలకు అమ్మజూపే ప్రయత్నం చేసిందన్న విషయం స్పష్టం అయిపొయింది. (అదే విదేశీయుల విషయంలో నయితే నోరుమూసుకుని పది అమెరికన్ డాలర్లకు వీటిని కొనాలన్నది మాంద్యం దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన శ్రావనమాసపు డిస్కౌంట్ స్కీంఅని యిట్టె అర్థం అయిపోతుంది. ) ప్రభ ఇంత మిస్ లీడ్ చేసినప్పటికీ వినమ్రంగా వ్యాసాలన్నిటినీ ఒకటికి రెండు సార్లుచదవాల్సి వచ్చింది.
బియ్యంలో రాళ్ళను ఏరడం తలకు మించిన పంయితే, తపీమని బియ్యాన్ని ఏరటం మొదులు పెట్టాలన్న మా నాయనమ్మఉపాయం అనుసరిన్చాల్సివచ్చింది. పుస్తకం మూలాన ఎక్కడో నక్కి దాక్కున్న నాలుగయిదు కవిత్వ సంగతులను వడిసిపట్టుకునేందుకు జాణతనం ప్రదర్శించిన నేను కనుగొన్న సత్యాలు ఇలా వున్నాయి.
- పుస్తకంలోని 34 పద్యాలలో ( ప్రభ బుకాయింపుకు క్షణ క్షణ మినహాయింపు.) 66 శాతం లిపి మనదే అయినా భాష పరాయిది.
- ఇవి పోగా దక్కిన 34 శాతంలో లిపి, భాష మనవే అనిపించినప్పటికీ నడక ఇసుర్రాయినీ, ఆత్మ డొల్లనీ, ప్రాసేచ్చ ప్రభందాలను, ఉద్వేగం తమిళ దర్శక నటకావతంసుడు విసునీ, శైలి ముక్త భావ గ్రశ్తాలంకారాన్నీ, తపన ఆర్ నారాయణ మూర్తి ప్రచారనియమావలినీ , శిల్పం ప్లాస్టర్ అఫ్ పారిస్ నీ క్నుకరిమ్చాయని అలవోకగా అర్థమై ఆనందం వేస్తుంది. వ్యాసాల పొరల్లోరెండు మూడు రిపోర్టులు కూడా దాగి వున్నాని కనుగొన్న తక్షణం సమ్మర్ హాలిడేస్లో దిన పత్రికల్లో రెండు బొమ్మల్లో ఐదుతేడాలను పర్ఫెక్టుగా చకచక కానీ పెట్టిన పిల్లల కేరింత నా స్వామ్తమయింది. వ్యాసాలు చదువుతుంటే క్లుప్తతకు కాలం చెల్లిందనిఅనిపించి దుఖమేదో వచ్చింది. ప్రతి వ్యాసమూ ముగిసిందని చెప్పేందుకు ఒక పువ్వు గుర్తును వాడింది రచయిత్రి. ఐతే గుర్తు వ్యాసాలలో మనకు తారస పడటం మాత్రం చాల చాలా ఆలస్యమైంది. వ్యాసం ఫలానా చోట ముగిసిందన్న విషయాన్నికనుక్కోవడమే కదా రచయితలకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్. కృతి కృతకంగా మారుతున్న చోట స్వచ్చందంగావిరమిమ్చటం తెలియాలి.
"గట్టున నేను విశ్రమించి నన్ను నేను పరిసీలిమ్చుకోవడం నా కెంతో ఇష్టం!" - అని ప్రకటించుకున్న ప్రభ అల్లా వ్యాససంకలనంలో ఎక్కడా చేయలేక పోయింది. దాదాపు అన్ని వ్యాసాలలోను ఎక్కడో మొదలై దాని చుట్తో చక్కర్లు కొట్టి, చటుక్కున పదమో, విశేషమో నచ్చి దాన్ని ఎత్తుకుని మళ్ళీ కాసేపు దాని వ్యామోహంలో మళ్ళీ గిరికీలు కొట్టడం... పుస్తకమంతా ఇదేవరస. కవిత్వం ఎలా ఉండాలో నాకు ఇంకా తెలిసిరావడం లేదు కాని, ప్యాసింజర్స్ ఎవరు చేయి లేపినా ఎక్కడ పడితే అక్కడఆపేసే గ్రామిని బస్సులాగా మాత్రం ఉండకూడదని నా గట్టి నమ్మకం. ఇది లేకే పుస్తకం నిండా ఎక్కడ పడితే అక్కడ గిరికీలుకొట్టడం ఎక్కువైపోయింది. రాసిన తర్వాత తనే మరొక్క సారైనా చదువుకుని వుండి వుంటే గిరికీలేరిగి వాత పెట్టడం ఏమంతకష్టసాధ్యమైన పని అయి వుండక పోయేది. అందుకే వ్యాసాలన్నీ కూడా కవితలు కావడానికి ముందు దశలో మూడోవెర్షన్లుగా మిగిలి పోయినట్టు అనిపిస్తాయి. ఒక దృగ్విషయానికి , అది మన మదిలో రేపే ఫీలింగ్ ని డైజస్ట్ చేసుకుని మనదిగాఅనువదించడమే కవిత్వమైతే... వ్యాసాలల్లో జీర్తి( డైజేషన్ ), అనువాదం( ట్రాన్స్లేషన్) అన్న రెండు ప్రధాన ముఖ్య స్తితులనుస్కిప్ చేసినవే 99 శాతం వ్యాసాలు. లేకపోతే పెరట్లో సంపెగని చూసి అడవిని
ఊహించుకున్నంత కృతకంగానూ, బీటెక్కుర్రవాడి నివేదికకు మెలోడ్రామా మేళవించి తెలుగులోకి దించినట్టూ ఎందుకే డుశ్తాయ్.
ఇక పుష్టకం నిండా వెళ్లి విరిసిన మరొక ప్రయత్నా పూర్వక విన్యాసం- బలవంతపు ప్రాసలు. దీనికి పరాకాష్ట ' సృష్టి అనవరతం' అనే వ్యాసం. కీట్స్, కోకు, పుట్టపర్తి నారాయణాచార్యులు, గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీరంగం గోపాల రత్నం, నాచనసోమనాథుడు, అన్నమయ్య లాంటి వ్యక్తుల జ్ఞాపకంగానో, వారి ప్రజ్ఞ గురించో రాసినవ్యాసాలన్నీకూడా వాళ్ళ మీద మనకుఇదివరకు ఏర్పడిన అభిప్రాయాన్ని తునాతునకలు చేశ్తాయి. వీటన్నింటి లోనూ శ్రీ రంగం గోప్ల రత్నం గురించి రాసిన వ్యాసంమంచి మెతుకు. వ్య్యాసం ఎలా వుందంటే దిన పత్రికల మఫిసిల్ డెస్క్ లో రిటైర్మెంట్ కి దగ్గర పడుతూన్న ఓకే కల్చరల్కంట్రి
బ్యూర్ రాసి ఇచ్చిన సింగల్ కాలం ఐటెం కి చేయి తీట ఎక్కువ వున్న ఒకానొక ట్రైనీ సబ్ ఎడిటర్ రాసిన లీడ్ లాగుంది.

నా ఏక వాక్యానికి సమర్థనగా నేను ఇప్పటి వరకు చేసిన పరిచయం సరితూగు తుందని అనుకుంటున్నా.
చివరగా ... జయప్రభ చెప్పుకున్నట్టు (చూ, పే. 105) వ్యాసాలు " మహిమాన్వితమైనవీ, మొలకలు పైరులై, మంటలా, మట్టిలా రూపాంతరం చెందేందుకు మాత్రం మరో 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఆగి పోయాయి.


(తా.: పరిచయ వాక్యాలు బాగా పొడవు అనిపిష్తే అది కేవలం జయప్రభావమే.)

- అనంతు

Thursday, July 15, 2010

ఒకో సారి



ప్రతి వేకువ
మరొకటే
తీరొకటే మారి
కప్పు వున్నది
రాత్రి ఒకతికే
పగలెలాగూ
కుశలం
#
చూడూ
ఆమె
వాసంపై
వెన్ను దన్నుగా
నిదరోతోంది బలే
కనీసం లెక్క
పెట్టకుండా
.................................

english- Sometimes- ak ramanujam

పిక్స్

ఈ బొమ్మలు సెంట్రల్ యూనివెర్సిటీ ప్రదర్సన కోసం తెలుగు లోకి నేను అనువదించిన సోఫోక్లేస్ గ్రీక్ నాటకం ఆన్తిగొని కోసం నేను వేసినవి. ఈ అనువాదాన్ని తెలుగు యూనివెర్సిటీ త్వరలో ఒక పుస్తకంగా పబ్లిష్ చేస్తోంది..

టైరిశిఎస్





క్రియాన్


ఇస్మిని






ఆంటిగొని