Wednesday, December 14, 2011

వొఖణ్ణే


దుఃఖంలో
దుర్మార్గంతో
దూరంగా
వొఖణ్ణే

చీకటిలో
చింతల్తో
శబ్దంలా
వొఖణ్ణే

దప్పికలో
ఆకల్తో
వొంటరిగా
వొఖణ్ణే

మోహాల్లో
మొహమాటాల్తో
రద్దీగా
వొఖణ్ణే

లోయల్లో
లోతుల్లో
కేకల్లా
వొఖణ్ణే

చిత్తుల్లో
మత్తుల్లో
గమ్మత్తయి
వొఖణ్ణే

కాలంతో
కామాల్లో
మొండిగా
వొఖణ్ణే

రాగాల్లో
గారంగా
పగిలినా
వొఖణ్ణే

కంచెల్లో
వంచనతో
భయంగా
వొఖణ్ణే

దారాల్లో
దారుల్తో
తప్పినా
వొఖణ్ణే

రాళ్ళలో
ప్రియురాళ్ళతో
రంజుగా
వొఖణ్ణే

దిగులుగా
పగిలినా
పలుగుతో
వొఖణ్ణే

కూడలిలో
కూటమితో
శిథిలంలా
వొఖణ్ణే

గురుతుల్లో
గాయాల్తో
కస్కసిగా
వొఖణ్ణే

మాటల్లో
బాకుల్తో
మవునంగా
వొఖణ్ణే

చరితల్లో
చిరుగుల్తో
దర్జాగా
వొఖణ్ణే

స్నేహాల్లో
హేయాల్తో
మచ్చికగా
వొఖణ్ణే

ఒలికినా
ఒరిగినా
లేచినా
పడినా
ఓడినా

వొఖణ్ణే
మళ్ళీ
వొఖణ్ణే

(21-july-2003)



1 comment:

akbar chakravarthy said...

గల్లీలో
సిగరెట్తో
నేనున్నా
నీతోనే...


పీసీలో
కింగ్ ఫిషర్ తో
నేనొచ్చా నీతోనే

ఆరడుగుల
నిశ్శబ్దంలో
వొక్కరే
నువ్వైనా..నేనైనా...
Dude how is this...:-)