Tuesday, September 14, 2010

కలవని కనుపాపలు




కలవని
మన కనుపాపలు
కనని పాపలు
కవలలు

వేరుగా
కాలం విసిరిన
రెండు వలల్లో
చిక్కి ఒక్కటైన
చిన్నారి చేపలు
రెండు
నిండు
పాపాలకు
రూపాపాయిలే

కదలని కథలనుకున్న
ఈ సమయాలు
సమాధి ఫలకాలాలే
వదలని
ఈ పెన్మత్తుమ్మెదలు
గతత్ కాలపు
చెదిరి
దరినీ కనలేనీ
నిలువునా
చీలిన
యవనికలు
కవనికలు
-







1 comment:

ఎం. ఎస్. నాయుడు said...

ఇవి ఎలా ఉన్నా, చదవని వాళ్ల గురించి ఆలోచిస్తూ కూర్చోను. మళ్లీ మళ్లీ చదువుతూ ఉన్నా.