సంచారి
కనలి కదిలే ఆకాశాలు
మోసే మేఘాలు
నీ ఇంటి పైనా
ఖాట్మండూ లోనూ
నడయాడేదొఖటే
#
కానపుడే
కానలేనపుడే
సంచారం పంచన
నడకను ఎరుక చేసుకోవాలని అనుకుంటావు
బహుశా
#
నీ ఏటిని సమాధి చేసి
ఆగిన వాగుల ముందు
వినమ్రంగా
సజల నేత్రాన వంగి
నూటొక్క సలాములు సమర్పిస్తావు
#
ఓ నా పసికూన
గడిచిన రాతిరి
మలి నిదురన
మసలిన మెలకువలో
కడలి అలలపై
నురగ మొలిచిన చందాన
నీ
లో
నీటిలో
లోన
నీ నీలాకాశంలో
నీ నేల నడకలో
విప్పారుకున్న
చిత్ విలాసమే
సదరు సంచారమ్
-
1 comment:
good.
Post a Comment