Tuesday, August 17, 2010
..నాయన.. ..నేనూ.. -వాడూ-
ఐదేళ్ళప్పుడు
నాకు
కలలో నాయన
నిదురలో వయ్యారంగా
అగ్గిపెట్టెలో బింగన్నలా
ఆకాశానికి కట్టిన బుడదంగిలా
#
ఐదేళ్ళప్పుడు
నిదురకు మూసుకున్న
వాడి కళ్ళ ఎదుటే
నాయన
....
మూసిన రెప్పలపై
మురిపెంగా వాలిందొక
సద్దు లేని ముద్దు
#
చూరు
ఒక వేలాడే టీగల తూము
సందేహాల సమూహం
నడి రేయి రేయి
ఏ జాములోనో
గుక్క తిప్పుకోలేని
పిలుపుకు
తచ్చాడే
పసి
పిడికిలి నిండా
తల వాల్చని నీడల రజను
#
అమ్మాంతం కుప్ప కూలింది
కప్పు లాంటి ఆకాశం
పొటుకులా
అశరీర వాణి
#
కుమారా
నీ నిలువుటద్దం
ఎదురుపడుతుంది
కనుబొమలే కొడవల్లుగా
గుమ్మం ముందే
#
మళ్ళీ మరో
రాతిరి
నీ ముడ్డి కడిగేసాక
నను చూడాలని
మదన పడీ
రెప్పలు అయిష్టంగానే
నువ్వు వాల్చి బజ్జుంటే
అటూ ఇటూ ఊగేస్తోంది
తొట్లే
జతగా జోల
నీ చూపు లాలికి
లయగా తిప్పేసి
పెనుగులాడి
వాల్చ్సింది
బుగ్గల నవ్వు హామీతో
#
తొట్లే లోంచి తొంగి చూస్తున్నాయి ఇంకా
పసి పాదాల వేళ్లు
మరి
ఈ వేళ్లు
చూరును కూల్చేస్తాయో
కుదురును
చూపుడు వేలుకి
గుచ్చుతాయో
- మే ౩౦, 2009
వొక సీతాకోక కల
అదృశ్య తంత్రిపై
రెక్కలు అల్లార్చిందో
సీతాకోక
#
కలత రాత్రి
కలకలాన్ని
వదిలించుకుందుకు
తెలి కాఫీ
తొలి సిప్
వణుకు చేతి కప్పు నుంచి
వంపుకుంటూ వుంటే
చెక్కిలి పై వాలినంత
పని చేసింది
#
నీరెండలో
వొక కంచెపైన
ఆ సీతాకోక నాట్యం చూసా
కల పోలిన ప్రార్థన ఒకటి
#
నిన్న మాత్రం
పట్టు పురుగు ఒకటి
ఇరుకు పిసినికాయె
తన లోకమంది
--
ఇంగ్లీష్- "బట్టర్ ఫ్లైస్ డ్రీం"
సర్గోయన్ బౌల్స్
లాలీ
కొన్ని రాత్రిళ్ళు
నిదుర పట్టదు
రాతిరి గూళ్ళు
#
ఇంకొన్ని పగల్లో
నిద్రను
దరి చేరనీయవు
దిగులు పగుళ్ళు
#
చేరగిలాలి కొంచెం
కాసింతే వొత్తిలాలి
కాసేపు వొడిలాలి మళ్లీ వినాలి
మళ్ళీ వొడిలో
లాలే వినాలి
ఎలా కా'పాడు' కోవాలే
ఈ 'పాడు' జీవితాన్ని
రా వా లాలై
లావా రాలీ
-
(పదిహేను, మే, 2010)
ఆమె
విత్తును
కన్నుగప్పి
మన్ను కప్పింది
#
దాగినదేదీ
దాచినప్రతిదీ
మాను మేనిపై
శాఖోపశాఖల్లో
విరగ బూస్తుంది ఒకనాటికి
అని
మాత్రం
కన లేదు
ఆమె
-- అనంతు
(మార్చి, ఎనిమిది, రెండు వేల పది)
ప్రవక్త
సత్యం
ఇలా చెప్పిందని తనతో
ప్రవక్త అన్నాడు మనతో:
" నేను సత్యాన్ని
ఉచ్చ నీచాల
గజిబిజి నడుమ
గడబిడల లోనూ,
నింగీ నేలల సంగమ
సింహాసనంపైనా
మన లేను నేను
#
సఖా
నేను
నిజం
నా వాక్కు ఖనిజం
నమ్మకం తొణికిసలాడే
దిటవు
గుండెను మీటు
నను
చూడాలని వుంటే
నీకు "
- జలాలుద్దీన్ రూమి
Friday, August 13, 2010
Subscribe to:
Posts (Atom)